కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
కొడుమూరు: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో కొడుమూరుకు చెందిన కీర్తి (15) మృతి చెందగా, ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికు తరలించారు. తండ్రితో కలసి ఇద్దరు బాలికలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మినగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.