మృగాడి దారుణానికి ఓ బాలిక మృత్యువుతో పోరాడి తానువు చాలించింది. ఖమ్మం జిల్లా గార్ల మండలం తిర్లాపురానికి చెందిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.30 గంటలకు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.... ప్రభుత్వ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాధితురాలిని అదే గ్రామానికి చెందిన బాబురావు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేసేవాడు. అయితే అతని చర్యలను బాలిక వ్యతిరేకించటంతో ఆగ్రహించిన బాబూరావు ఆమెపై కిరోసిన్ పోటీ నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఈ నెల 18వ తేదీన జరిగింది. నిందితుడు బాబురావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అంతకు ముందు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక మృతితో అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వరంగల్ యాసిడ్ దాడి నిందితులకు విధించిన 'తక్షణ శిక్ష' లాంటివే అన్నిచోట్లా అమలుచేయాలని, అప్పుడే అమ్మాయిలకు ఈ సమాజంలో రక్షణ లభిస్తుందని బాలిక తండ్రి వాపోయారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటననే చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకుని మృతి చెందింది. దాంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఖననం చేశారు. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు జరుపుతున్నారు.
Published Mon, Oct 28 2013 1:31 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement