శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మతి చెందింది.
అనంతపురం టౌన్ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మతి చెందింది. ఇటుకలపల్లి ఎస్‌ఐ కరీం తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం నెట్టివారిపల్లికి నారాయణస్వామి, అమత దంపతులు తమ కుమార్తె ప్రభావతి (10)తో కలిసి అనంతపురం వచ్చారు.
మంగళవారం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రభావతి మతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణస్వామికి కాలు విరిగింది.