prabhavathi
-
రఘురామ సీఐడీ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట
-
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆందోళన
-
‘బేబి ప్రభావతమ్మా’ అంటుంటే ఆనందంగా ఉంది
ఇరవై రెండేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ‘బేబీ’సినిమాకు వచ్చినన్ని కాల్స్, ప్రశంసలు ఇంతవరకు రాలేదని అంటున్నారు నటి ప్రభావతి. ఆనందర్ దేవరకొండ, వైష్షవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో ఆనంద్ దేవరకొండ తల్లిగా ప్రభావతి నటించారు. ఈ చిత్రంలో ఆమెది మూగ పాత్ర. హావభావాలతోనే అద్భుత నటన కనబరిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అభినందించడం చూసినవాళ్ళల్లో ఆమెను ఎరుగనివారు "ఎవరీ ప్రభావతి?" అని ఆరాలు తీస్తున్నారు. "జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్, గోరింటాకు, సాహసం, అమరావతి, అనసూయ, ఏక్ మినీ ప్రేమ్ కథ, గరుడ వేగ, సీటీమార్, లవ్ యు రామ్" వంటి చిత్రాలతోనూ తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న ప్రభావతి... ఇప్పుడు అందరూ తనను "బేబి ప్రభావతమ్మా" అని పిలుస్తుంటే కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు అంటున్నారు. "బేబి" సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజులు చేస్తూ.. 'అమ్మ'గా వాళ్ళ గుండెల్లో చోటు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. -
రెండున్నర గంటల్లో రేషన్‌కార్డు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు. గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్‌కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. -
అచ్చులు అశ్రువులు
అచ్చులు హల్లులు కలిస్తేనే పాఠం.కాని పాఠం సగం ఆగిపోయింది.బ్లాక్‌బోర్డ్ మీద అక్షరాలు సగమే మిగిలిపోయాయి.సిలబస్ పూర్తి కాక మునుపే ఒక బంధం దూరమైపోయింది.మిగిలింది అశ్రువులు. కేవలం అశ్రువులు.ప్రభావతి టీచర్.ఆ రెండూళ్లు తల ఎత్తి తలుచుకునే పేరు. జెండాకు వందనం చేసినట్టు పవిత్రంగా వందనం చేసే పేరు. 2016. ఆగస్ట్ 14.రంగారెడ్డి జిల్లా. పెద్ద ఉమెంతాల్.ఉదయం పది దాటింది. అప్పుడే టిఫిన్ తిన్నారు ఆ ఇంట్లో వాళ్లు.‘‘సరే మరి. నేను ఫంక్షన్‌కు వెళ్తా’’ అన్నాడు భర్త. ‘‘ఊ.. నేను కూడా స్కూల్కెళ్లొస్తా’’ అన్నది భార్య.‘‘ఇవ్వాళ ఆదివారమే కదా. స్కూల్కెందుకు?’’అన్నాడు ఆయన.‘‘రేపు పంద్రాగస్ట్ కదా. స్టూడెంట్స్ వస్తున్నరు స్కూల్‌కి డెకరేషన్ కోసం. నేను కూడా ఉంటే మంచిది’’ అన్నది ఆమె.‘‘నిజమే కాని.. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిండ్రు కదా.. ఇంట్లో ఇద్దరం లేకపోతే ఎట్లా?’’ అన్నాడు. ‘‘తొందరగానే వస్తా.. ఈ లోపు వాళ్లు రెస్ట్ తీసుకుంటరు’’ అన్నది ఆమె.‘‘సరే.. ’’ అని ఆయన వికారాబాద్‌లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లిపోయాడు. ఆమె కూడా తన ఇద్దరు కూతుళ్లకు జాగ్రత్తలు చెప్పి స్కూటీ స్టార్ట్ చేసింది రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లోని స్కూల్‌కి వెళ్లడానికి. మధ్యలో స్టేషనరీ షాప్ దగ్గర ఆగి రంగు కాగితాలు, జెండా కాగితాలు, డెకరేషన్‌కు సంబంధించిన ఇతర వస్తువులూ అన్నీ కొనుక్కొంది. దాదాపు అరగంట ప్రయాణం తర్వాత మేడికొండ ఊరు చేరుకుంది. నేరుగా వెళ్లి స్కూల్ ఆవరణలో స్కూటీ ఆపింది. ఆ చప్పుడికి లోపలున్న ఐదారుగురు పిల్లలు బిలబిలమంటూ బయటకు వచ్చారు. టీచర్‌ను చూసి ‘‘టీచర్ వచ్చేసింది ’’అనుకుంటూ ఆమెకు ఎదురువెళ్లి చేతిలో ఉన్న సామాన్ల బ్యాగ్ తీసుకున్నారు. సింగిల్ టీచర్ స్కూల్ అది. ఐదవ తరగతి వరకు ఆమె ఒక్కరే ఆ స్కూల్‌ను సంభాళించాలి. ‘‘తినే వచ్చిండ్రా పిల్లలూ?’’ ఆత్మీయంగా ప్రశ్నించింది వాళ్ల వెంటే లోపలికి వెళ్తూ.‘‘తిన్నాం.. టీచర్’’ముక్తకంఠంతో జవాబు.వెళ్లేసరికే బ్లాక్‌బోర్డ్‌ను శుభ్రం చేసేసేశారు. కళ్లతోనే శభాష్ అని మెచ్చుకుంది. ముగ్గురికి రంగు కాగితాలు ఇచ్చింది మడత పెట్టమని. ఇంకొక స్టూడెంట్ ఇతర డెకరేషన్ సామాన్లు చూడసాగింది. ఇంకో ఇద్దరు పిల్లలను తీసుకొని ముందున్న గ్రౌండ్‌కి వెళ్లింది. జెండా స్తంభాన్ని చెక్ చేయడానికి. ఆ స్కూల్లో జెండా ఇనుప రాడ్‌కు కట్టి ఉంది. దానికి జెండా డిజైన్‌లో ఉన్న కాగితాలు అతికించమని పిల్లలకు చెప్పి లోపలికి వెళ్లింది ఆమె. లోపల డెకరేషన్ పనులు చూసుకోవడానికి. అరగంటకు..గ్రౌండ్ నుంచి పెద్దపెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. లోపల బిజీగా ఉన్న ఆ టీచర్ గుండె గుభేలు మన్నది.. ‘ఏమైందీ’ అనుకుంటూ అంతే గాభరాగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ వెనకాలే క్లాస్‌లో ఉన్న పిల్లలూ వచ్చారు భయంతో. ముగ్గురు పిల్లలు జెండా రాడ్ పట్టుకుని కరెంట్ షాక్ తగిలినట్టు కంపిస్తున్నారు. అనుమానంగా పైకి చూసింది. 11కేవీ వైర్లు. జెండా ఉన్న ఇనుపరాడ్ వాటికి తగిలి కరెంట్ సర్క్యూట్ అయి అది పట్టుకున్న పిల్లలకూ పాస్ అవుతోంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వడివడిగా వాళ్లను తోసేసింది. ఆ క్రమంలో ఆ రాడ్ ఆమె చేతుల్లో పడింది. గిలగిలా కొట్టుకోసాగింది ఆమె శరీరం. ఆ హఠాత్పరిణామానికి అక్కడున్న పిల్లలు నోరెళ్లబెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు ఆ పసివాళ్లకు. చేష్టలుడిగిపోయారు. అరుద్దామన్నా నోరు పెగలట్లేదు.జెండా కాగితాలు అతికించి ఆ రాడ్‌ను దిమ్మెలో పెడదామని ముగ్గురు పిల్లలు తమ బలాన్ని కూడదీసుకొని జెండాను పైకెత్తారు దాంతో ఆ రాడ్ కరెంటు తీగలకు తగిలి ఈ ప్రమాదానికి కారణమైంది. కళ్ల ముందే టీచర్.. తమ క్లాస్‌మేట్స్‌ను రక్షించబోయి.. కరెంట్ తీగకు బలవుతోంది. అలా కంపించిన శరీరం కొన్ని సెకన్లకు అచేతనమైపోయింది. నల్లగా మాడిపోయి. అంతకుముందు ఆ రాడ్‌ను పట్టుకున్న ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. కాని టీచర్‌ను అలా చూసి తమ గాయాలను మర్చేపోయారు. కళ్లవెంట ధారాపాతంగా నీళ్లు. ఊర్లో వాళ్లను పిలవాలంటే కూడా నోరు రావట్లేదు. భయంతో బిక్కచచ్చిపోయారు. మొత్తానికి బలవంతంగా కదిలి ఊర్లోవాళ్ల దగ్గరకు పరిగెత్తారు. ‘ప్రభావతి టీచర్‌కు కరెంట్ షాక్ గొట్టింది’ ఒకేఒక్క నిమిషంలో ఊరంతా గుప్పుమంది. హుటాహుటిన వికారాబాద్ తీసుకుపోయారు. కాని టీచర్.. చనిపోయింది!పిల్లల గుండె పగిలింది. ఇదంతా అబద్ధం కావాలి దేవుడా.. పిల్లల మనసు రొదపెడుతోంది. ‘‘నాన్నా.. ఆ వైర్లను తీసేపియ్యు. టీచర్ రేపు జెండా ఎగరేస్తే తగలకుండా... ’’ ఆ స్కూల్లో చదివే ఆరేళ్ల అమ్మాయి అమాయకంగా అంది వాళ్ల నాన్నతో. ఒక అబ్బాయి విసావిసా ఇంట్లోకి వెళ్లి ఇస్త్రీ బట్టలను విసిరేశాడు. ఇంకో అమ్మాయి క్లాస్‌లోకి వెళ్లి బోర్డ్ మీద పిచ్చి గీతలు గీసింది. ఇంకో అబ్బాయి రంగు కాగితాలను చించేశాడు. పిల్లల మనసు వికలమైపోయింది.టీచర్ ఇంట్లో.. ఆమె మరణ వార్తతో షాక్ అయ్యారు. ‘‘ఇప్పుడే కదా అమ్మ మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్లింది. మ«ధ్యాహ్నం మీకు ఆకలయ్యే సరికి ఇంట్లో ఉంటానని ప్రామిస్ చేసి మరి! ఇదేంటి అమ్మ చనిపోయిందని చెప్తారేం’’ ఆమె పిల్లల సందేహం. ‘‘వద్దు అన్నా వినకుండా వెళ్లింది. నా ఇంటిని చీకటి చేసింది’’ భర్త కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. పెద్ద ఉమెంతాల్.. మేడికొండ.. రెండూళ్లు శోకసముద్రాలయ్యాయి. ‘ప్రభావతి టీచరే కాదు.. ఆమె అందరికీ అమ్మలాంటిది. బాగా చదవాలని పిల్లలకు, బాగా చదివించాలని పెద్దవాళ్లకూ కౌన్సిలింగ్ ఇచ్చేది.అలాంటి మనిషి మళ్లీ దొరకదు. మాదురదృష్టం’’ ఊళ్లో వాళ్ల అభిమానం చెప్పే మాట అది. ‘మా పెళ్లయి పదిహేడేళ్లు. ప్రభావతి డెడికేషన్‌తో పనిచేసేది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుభీక్ష ఇప్పుడు టెన్త్ చదువుతోంది. చిన్నమ్మాయి నాగహర్ష నెన్త్క్లాస్. ఆడపిల్లలయినా మేం ఎప్పుడూ ఫీలవలేదు. ఇద్దర్లో ఒకరిని డాక్టర్ చేద్దాం అనేది. ఇంటా, బయటా అన్నీ తానే చూసుకునేది. ఆమె ఉన్నన్ని రోజులు నేను అగ్రికల్చరే చూసేవాడిని. మాకు వాటర్ ప్లాంట్ ఉంది. ఊళ్లో వాళ్లు రోజూ సాయంత్రం మా ఇంటి దగ్గరకే వచ్చి నీళ్లు తీసుకెళ్తారు. ఆ టైమ్‌లో ఆమె అందరినీ పలకరిస్తూ మంచిచెడ్డలు అడిగి తెలుసుకునేది. వాళ్లు కూడా ఆమెతో అన్నీ షేర్ చేసుకునేవాళ్లు. ఆఫీసుల్లో నిర్భయంగా మట్లాడేది. ఆమె ఆ స్వభావం కొంతమంది శత్రువులుగా కూడా మారారు. అది చూసి ‘ఎందుకులే.. నీ పని నువ్వు చూసుకో’ అనేవాడిని. ‘ఇదీ నా పనే. అందరం మనకెందుకులే అనుకుంటే సమస్యలెలా సాల్వ్ అవుతాయి?’ అనేది. తప్పును సహించేది కాదు. లాజిక్‌గా మాట్లాడుతుంది. నా చిన్నకూతురిదీ అదే స్వభావం. ఆమెను చూస్తుంటే ప్రభావతే గుర్తొస్తుంది (గాద్గదిక స్వరంతో). అలాంటి మనిషి నా భార్యవడం నా అదృష్టమని ఫీలయ్యేవాడిని. ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది. నా లైఫ్‌లో అలాంటి మనిషిని చూడలేదు. చూడలేను కూడా’ అంటాడు ఆమె భర్త చౌదరి రాజీవ్ రెడ్డి. ప్రభావతి చనిపోయాక ఆమె ఉద్యోగాన్ని రాజీవ్‌రెడ్డికి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పరిగి మండలంలోని చిట్యాల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రభావతి స్ఫూర్తిని తమ కుటుంబం కొనసాగిస్తుందని అంటాడు. ‘ప్రైవేట్ స్కూళ్లో చదివించే స్థోమతలేని వాళ్లే తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. కాబట్టి పేరెంట్స్ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా మా స్కూళ్లో పిల్లలను మిన్నగా తయారు చేయాలి అని ప్రభావతి అనేది. నా మాట కూడా అదే’ అంటాడు రాజీవ్ రెడ్డి. ఏమైపోయేవాళ్లమో.. ఆ రోజు ప్రభావతి టీచర్ వచ్చి మమ్మల్ని నెట్టేయకపోతే ఏమైపోయేవాళ్లమో. పంద్రాగస్ట్ వస్తుందంటే ఇప్పటికీ భయమైతుంటది. టీచర్ కూడా బాగా గుర్తొస్తుంటది. – కీర్తన, నాల్గవ తరగతి, మేడికొండ దేవతలా కాపాడింది మా అబ్బాయి (గణేష్, నాల్గవ తరగతి) పుట్టు మూగ, చెవిడు. జెండా వందనం కోసం జెండా పైప్‌ను చెక్ చేయడం కోసం పైకెత్తి మళ్లీ తీసేస్తుండగా పైన కరెంటు తీగలు తాకడంతో షాక్ వచ్చి వెల్లకిలా పడ్డాడు కొడుకు. ప్రభావతి టీచర్ దేవతలా వచ్చి కాపాడింది. ఆ టీచర్ అంటే మాకు చాలా గౌవరం. ఆమె లేదంటే బాధనిపిస్తుంటుంది. – గణేష్ తల్లిదండ్రులు, మేడికొండ ఒళ్లంత గాయాలయ్యాయి మేడం లేకుంటే బ్రతికేవాళ్లం కాదు మేడం పక్కకు నెట్టేయకుంటే చనిపోయే వాళ్లం. పైపు పైకి ఎత్తడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి మూర్చపోయాం. ఇప్పుడు టీచర్ ఉండిఉంటే బాగుండేది. చాలా గుర్తొస్తుంటుంది. – కుర్వ మధుమతి, నాల్గవ తరగతి – సరస్వతి రమ -
ఇద్దరు వివాహితల బలవన్మరణం
పరిగి (పెనుకొండ) : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిగి మండలం ఎస్.బీరేపల్లిలో కంసల అశ్వత్థచారి భార్య ప్రభావతి(30) అనే వివాహిత శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అంజనయ్య శనివారం తెలిపారు. దంపతులిద్దరూ గతంలో గార్మెంట్‌కు వెళ్లేవారన్నారు. అయితే కొంతకాలంగా ప్రభావతి ఇంట్లోనే ఉంటుండగా, భర్త ఒక్కడే వెళ్లేవాడని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇంటి తలుపులు తీయకపోగా, రాత్రి ఇంటికొచ్చిన భర్త పిలిచినా పలక్కపోవడంతో అనుమానంతో లోపలకి తొంగి చూడగా.. ఇనుప తీర్లకు వేసిన ఉరికి వేలాడుతూ కనిపించిందన్నారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో చుట్టుపక్కల వారు పోగయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరవకూరులో మరొకరు.. కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం అరవకూరులో చంద్రకళ(26) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగిందని వివరించారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. రాత్రి పొద్దుపోయాక నీరున్న బావిలో మృతదేహమై తేలియాడుతుండగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
అనుమానం పెనుభూతమై
-
అనుమానం పెనుభూతమై
⇒ భార్యను నరికి చంపిన భర్త ⇒ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటానని పెళ్లి రోజు చేసిన బాసలను అతను మరిచి పోయాడు. అనుమానంతో విచక్షణ కోల్పోయాడు. కత్తితో భార్యను నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేశానంటూ వీధిలోకి వచ్చి కేకలు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీకాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏర్పేడు : భార్యను కత్తితో నరికి చంపిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలం మల్లిమడుగు ఎస్టీ కాలనీకి చెందిన పంజాపి గోవిందయ్య కుమారుడు అయ్యప్ప(32)కి శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు ఎస్టీ కాలనీకి చెందిన పాముల మహాలక్ష్మి కుమార్తె ప్రభావతి(28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చీరాలమ్మ(07), జయచంద్ర(05), హేమ(03) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి అయ్యప్ప భార్య ప్రవర్తనపై అనుమానించేవాడు. వేరేవారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను చితకబాదేవాడు. పిల్లలను చూసి ఆమె అన్ని బాధలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏడాది క్రితం కుటుంబాన్ని ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి మార్చాడు. కొన్ని నెలల వరకు భార్యతో మంచిగా నడచుకున్నాడు. తర్వాత మళ్లీ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కత్తితో భార్యపై దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అను వీధిలోకి వచ్చి భార్యను నరికేశానంటూ కేకలు వేశాడు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ అర్ధరాత్రి వేళ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరామర్శ స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, ఎంపీటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మండలంలోని కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి వెళ్లి పిల్లలను పరామర్శించారు. సాయం చేస్తానని చెప్పారు. -
వివాహిత అదృశ్యం
గుత్తి (గుంతకల్లు): పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ప్రభావతి ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రవికుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలాచోట్ల గాలించామని, అయినా జాడ కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
అనంతపురం టౌన్ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మతి చెందింది. ఇటుకలపల్లి ఎస్ఐ కరీం తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం నెట్టివారిపల్లికి నారాయణస్వామి, అమత దంపతులు తమ కుమార్తె ప్రభావతి (10)తో కలిసి అనంతపురం వచ్చారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రభావతి మతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణస్వామికి కాలు విరిగింది. -
విద్యార్ధులను కాపాడి ప్రాణాలు వదిలిన హెచ్ఎం
-
పాఠశాలలో విషాదం: కరెంట్ షాక్ తగిలి హెచ్ఎం మృతి
పూడూరు: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల కోసం జెండాను ఏర్పాటుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులను కాపాడే ప్రయత్నంలో ఓ ప్రధానోపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలోప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కలువ ప్రభావతి (40) మరణించారు. పెద్ద ఉమ్మాంతాల్ గ్రామానికి చెందిన ప్రభావతి.. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకుగానూ ఆదివారం పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలోనే విద్యార్థులు కీర్తన, గణేష్, శివతేజ, మధుప్రియలు జెండా కర్రను జరుపుతుండగా, విద్యుధాఘాతానికి గురయ్యారు. వెంటనే స్పంఇంచిన ప్రభావతి.. విద్యార్థులను పక్కకునెట్టేసి.. ప్రమాదంలో చిచ్కుకుపోయారు. స్పృహకోల్పోయిన ఆమెను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రభావతి మరణించినట్లు వైద్యులు చెప్పారు. -
అన్న మీద పగతో రగులుతున్న చెల్లెమ్మ
చెన్నై: అమ్మ మెప్పుతో సీటు దక్కితే, తోడపుట్టిన చెల్లెమ్మ రూపంలో చిక్కులు ఎదురు కావడం అన్నాడీఎంకే అభ్యర్థిని ఇరకాటంలో పడ్డారు. సీటు ఉంటుందో, ఊడుతుందో అన్న డైలమాలో పడ్డారు. ఇంతకీ ఈ అభ్యర్థి ఎవరో కాదు సింగానల్లూరు సింగముత్తు. అన్నాడీఎంకేలో సీటు దక్కడం అంటే ఆషామాషీ కాదన్న విషయం తెలిసిందే. అదేసమయంలో చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా సీటు తక్షణం ఊడడం ఖాయం. ఇలా అన్నాడీఎంకేలో పలువురి అభ్యర్థిత్వాలు తాజాగా రద్దు అయ్యాయి. మరి కొందరిపై వేటుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు జిల్లా సింగానల్లూరు అభ్యర్థి సింగముత్తుకు తోడ పుట్టిన చెల్లెమ్మ రూపంలోనే చిక్కులు ఎదురు కావడంతో సీటు ఉంటుందా? ఊడుతుందా? అని అన్నాడీఎంకే వర్గాలే పందెం కాస్తున్నాయట. ఇంతకీ తోడపుట్టిన అన్న మీద ఆ చెల్లెమ్మకు కోపం ఏమిటంటే, ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదట. తోడ పుట్టినోడికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా సింగనల్లూరులో నామినేషన్ దాఖలు చేసిన సింగముత్తు చెల్లెమ్మ ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ... తన అన్నయ్య బండారాన్ని ప్రచారంలో ప్రజల ముందు పెట్టి తీరుతానని స్పష్టం చేస్తున్నారు. ఇంత కోపం ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే... తన సోదరుడు కోట్లు గడించాడని, తన తల్లి పేరిట ఉన్న 10 సెంట్ల భూమిని తనకు ఇవ్వకుండా అమ్మే యత్నం చేయడం వల్లే ఈ ‘పగ’అని జవాబిచ్చారు. ఇదే విషయాన్ని అమ్మ(జయలలిత)కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే అన్నయ్యకు తగ్గ ప్రత్యర్థి తానేనంటూ ఆమె సెలవిచ్చారు. జయలలిత కరుణించి సీటును సింగముత్తుకే వదలి పెట్టినా, ఈ తోడ పుట్టిన చెల్లెమ్మ వదలి పెట్టేట్టు లేదంటూ సింగానల్లూరు ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. -
ఖమ్మం నగర శివారులో భారీ చోరీ
ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని పోలేపల్లి గ్రామ పరిధి కరుణగిరి సమీపంలోని రెండు అపార్ట్మెంట్లలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సాయి రాఘవ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు చావా దుర్గాప్రసాద్-ప్రభావతి, ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న సాయిరాం టవర్స్‌లో విశ్రాంత సర్వేయర్ మర్ల వెంకటరమణ దంపతులు నివాసముంటున్నారు. దుర్గాప్రసాద్-ప్రభావతి దంపతులు తమ ప్లాట్‌కు తాళం వేసి ఈ నెల 26న హైదరాబాద్ వెళ్లారు. మర్ల వెంకటరమణ దంపతులు కూడా తాళం వేసి ఈ నెల 30న బంధువుల ఊరు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ రెండు ప్లాట్ల తాళాలను పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. దుర్గాప్రసాద్ ప్లాట్లోని బీరువాను ఇనుప చువ్వలతో తెరిచి, అందులో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. వెంకటరమణ ప్లాట్ బీరువాను కూడా ఇలాగే తెరిచి 20 తులాల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఈ రెండు ప్లాట్లలో చోరీ సొత్తు విలువ రూ. 20 లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు.