కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు.
గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్‌ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్‌కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment