Jagananna Suraksha
-
AP : డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న H9N2 వైరస్ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం. -
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్‌వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
ఆరోగ్య సురక్ష విస్తరణ
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది. ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్ క్లినిక్‌ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు. ► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ► బీపీ, సుగర్ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు. ► ఈ స్క్రీనింగ్‌లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు. ► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. ► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. ఇబ్బందులకు తావు లేకుండా.. పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం. - ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు. ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. -
అవ్వలతో మంత్రి విడదల రజిని సరదా సన్నివేశం
-
45 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
-
కలెక్టర్లు అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి: సీఎం జగన్
-
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములే
-
జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరం
-
ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే నిర్వహించనున్న వైద్యులు: సీఎం జగన్
-
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సమస్య నయం అయ్యేవరకు తోడుంటాం: సీఎం జగన్
-
ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం: సీఎం జగన్
-
జల్లెడ పట్టి మరీ ఆరోగ్య సమస్యకు పరిష్కారం: సీఎం జగన్
-
ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం సురక్షితం
-
ఐదు దశల్లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం.. జగనన్న సురక్ష తరహాలోనే 'జగనన్న ఆరోగ్య సురక్ష'..!
-
రూ 1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం
-
రేపటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్
-
ఇంటింటికీ ఆరోగ్య రక్షణ కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెను మార్పులకు శ్రీకారం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్ డీసీజెస్) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. సంపూర్ణ రక్తహీనత నివారణ రాష్ట్రంలో జీరో అనిమిక్ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్ సప్లిమెంటేషన్ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్ కేర్ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్ కేర్) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 45 రోజుల తర్వాత కూడా.. మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. క్యాంప్‌లలో నలుగురు వైద్యులు హెల్త్ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో గైనిక్/పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి. ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ జానకి, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకట మురళీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా... (( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. ((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి. ((3)) మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు. ((4)) గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి. ((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు. -
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు, మందులను ఉచితంగా అందించబోతోంది. ఎవరైనా రోగులకు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలకు ‘స్పెషల్’ చికిత్స.. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు) సందర్శిస్తారు. ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు. విజయవంతం చేద్దాం: సీఎస్ జవహర్‌రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణ, ప్రచార సామగ్రి, టెస్టింగ్ కిట్లు, మందులు తదితరాలను అందజేయాలని సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమించని, సంక్రమించే వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్, మలేరియా, డెంగీ తదితరాలతో బాధపడుతున్నవారిపై దృష్టి పెట్టాలన్నారు. శిశువులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సూచించారు. సమావేశంలో ఉన్నతాధికారులు కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాశ్, జయలక్ష్మి, కోటేశ్వరరావు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి రజిని రాష్ట్ర ప్రజలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం రక్షగా నిలవబోతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇప్పటికే విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారోగ్యానికి అండగా నిలిచిన సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. గురువారం మంగళగిరిలోని వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా వైద్య శిబిరాలు నిర్వహించి.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామని తెలిపారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యమందిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.120 కోట్ల మేర ఖర్చు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్సీ వైద్యాధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి, యూపీహెచ్సీ వైద్యాధికారులు ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. సమీక్షలో ఉన్నతాధికారులు ఎం.టి.కృష్ణబాబు, నివాస్, మురళీధర్‌రెడ్డి, హరేంధిరప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలకలూరిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి ఆమె దిశానిర్దేశం చేశారు. -
'జగనన్న సురక్ష' కు నీరాజనం
-
నేటితో ముగియనున్న జగనన్న సురక్ష కార్యక్రమం
-
కోటికి చేరువలో ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాలను ఇంటివద్ద కలుసుకోవడం ద్వారా పెండింగ్ సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం ప్రతి ఇంటినీ జల్లెడ పట్టింది. జూన్ 23వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో (జూలై 31వ తేదీ) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా శనివారం నాటికే 15,002 సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల స్థాయిలో ప్రత్యేక వినతుల పరిష్కార క్యాంపులు పూర్తయ్యాయి. సోమవారం మిగిలిన రెండు సచివాలయాల వద్ద క్యాంపులు కొనసాగుతాయని సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోరాదనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ క్యాంపుల ద్వారా ఎలాంటి సర్విసు చార్జీలు లేకుండా ఉచితంగా అందజేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తొలుత వారం రోజుల పాటు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. 59 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.. వివిధ కారణాలతో ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులకు మేలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చారు. 99.80 లక్షల టోకెన్లు జారీ కాగా క్యాంపులు జరిగిన రోజు అధికారుల వద్దకు 95.96 లక్షల వినతులు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో 92.97 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో పరిశీలన కొనసాగుతోంది. ఒకేరోజు 7,37,638 వినతుల పరిష్కారం.. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాలను పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 2,70,073 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1 బీ ధ్రువీకరణ పత్రాలను పొందగా మరో 139,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికెట్లు పొందారు. ఈ నెల 18వ తేదీన జరిగిన క్యాంపులో ఒక్క రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. అల్లూరి జిల్లాలో అత్యధికం జగనన్న సురక్ష కార్యక్రమం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలకు సంబంధించి పలు ధ్రువీకరణ పత్రాలు వేగంగా మంజూరయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 57.4 శాతం కుటుంబాలు ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రయోజనం పొందాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53.51 శాతం కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాలో 51.01 శాతం కుటుంబాలకు వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 77 శాతం గ్రామీణ ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. – లక్ష్మీ శా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
చంద్రబాబుకు లెక్కలతో సహా ఇచ్చిపడేసిన మంత్రి రోజా
-
జగనన్న సురక్షతో లబ్ధిదారులు హర్షం
-
జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పవన్ రాజకీయ అజ్ఞాని కావడంతో వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా 57లక్షల మందికి సర్టిఫికెట్లు అందించాం. జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది. 11 రకాల సేవలను లబ్దిదారులకు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఎన్నికలకు ఒంటిరిగా వెళ్లి గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం లేదంటూ కామెంట్స్ చేశారు. ప్రజలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంది కాబట్టే సింగిల్‌గా బరిలోకి దిగుతాము అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పార్లమెంట్లో రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఎన్టీఆర్ జిల్లాలో జగనన్న సురక్ష విజయవంతం
-
ప్రజల వద్దకే పాలన తెచ్చిన సీఎం వైఎస్ జగన్ కు ప్రశంసలు
-
రెండున్నర గంటల్లో రేషన్‌కార్డు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు. గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్‌కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. -
‘సురక్ష’కు నీరాజనం
‘అన్ని వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ కుల, ఆదాయ, ఫ్యామిలీ.. ఇతరత్రా సర్టిఫికెట్లు పొందాలంటే అంత సులువు కాదన్న విషయం అందరికీ అనుభవమే. విద్యా సంవత్సరం ప్రారంభంలో అయితే మరీ కష్టం. సర్టిఫికెట్లు కొంచెం త్వరగా కావాలనుకుంటే రోజుల తరబడి పనులు మానుకుని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు మీకు ఏవైనా సర్టిఫికెట్లు కావాలా? అని ఇంటి వద్దకే వచ్చి వివరాలు తీసుకెళ్తున్నారు. వారం తిరక్కుండానే సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. జయహో జగనన్న సురక్ష’ అంటూ ఊరూరా ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి నెట్వర్క్ : ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తరఫున వలంటీర్లు ఇంటికే వచ్చి ఏవైనా సమస్యలున్నాయా.. సర్టిఫికెట్లు కావాలా.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. అని అడిగి తెలుసుకోవడం తొలిసారిగా చూస్తున్నామని జనం చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలందించేందుకు జల్లెడ పడుతుండగా మరో పక్క క్యాంపుల ద్వారా అక్కడికక్కడే అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసే కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించి రికార్డు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ పాఠశాలలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సురక్ష శిబిరాల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. వారంలోగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అందించారని విశాఖ జిల్లా వాసి సాసబోయిన దాసు ఆనందంగా చెప్పాడు. ఇంటికే వచ్చి వివరాలు తీసుకుని బర్త్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చారని అనంతపురం జిల్లా వాసి అభిదా సంతోషం వ్యక్తం చేసింది. అత్త, మామల పేర్లను రేషన్ కార్డు నుంచి వేరు చేసి, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చారని పల్నాడు జిల్లాకు చెందిన దుడ్డు ఇందు సంబరపడిపోతూ తెలిపింది. ప్రజల ఇంటికే వచ్చి మీకు ఏ సమస్యలున్నాయని అడుగుతున్న తొలి సర్కారు ఇదేనని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వినతుల పరిష్కారం ► ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు 1,305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే, వాటిలో 4,57,642 అక్కడికక్కడే పరిష్కరించారు. 17వ తేదీ నాటికి 9,721 సచివాలయాల పరిధిలో 53.24 లక్షల వినతులు వస్తే, అందులో 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒక్క రోజే 6.5 లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. ► ఇప్పటిదాకా 1,69,891 మంది వలంటీర్లు జగనన్న సురక్ష శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా, అధికారులు 4,37,509 పరిష్కరించారు. అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా, 62,312 పరిష్కారమయ్యాయి. ► ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 4,154 ఓబీసీ సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ► ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8,263, ఆధార్‌తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి. ► ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని, జగనన్న ప్రభుత్వంలో ఏ పని అయినా సులభంగా పూర్తవుతోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండీ కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వలంటీర్‌ను కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను కానీ సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. సర్టిఫికెట్ ఇంటికి తెచ్చిచ్చారు.. నాకు బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం సర్టిఫికెట్ అవసరమైంది. వీటి కోసం గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదు. ఇప్పుడు మా ఇంటికే వలంటీర్ వచ్చి నాకేం కావాలో మరీ అడిగి తెలుసుకున్నాడు. కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే బర్త్ సర్టిఫికెట్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – అభిదా, కణేకల్లు క్రాస్, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా తొమ్మిదేళ్ల తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫ్యామీలీ మెంబర్ సర్టిఫికెట్ లేకపోవడంతో కుటుంబ ఆస్తుల కోసం తగాదాలు చోటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తొమ్మిదేళ్ల క్రితం ఆఫీసుల చుట్టూ తిరిగినా అది ఇక రాదని ఆశ వదులుకున్నాం. ఇక మా కుటుంబం బతుకింతే అనుకున్నాం. కొద్ది రోజుల కిందట మా ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది, వలంటీరుకు మా పరిస్థితి వివరించాం. వివరాలు తీసుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకు సురక్ష క్యాంపులో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందించారు. తొమ్మిదేళ్ల మా ఇబ్బందులకు పరిష్కారం చూపించారు. – సాసబోయిన దాసు, ప్రైవేటు ఉద్యోగి, గెడ్డవీధి, జ్ఞానాపురం, విశాఖ జిల్లా కొత్త రేషన్ కార్డు వచ్చింది మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా తెల్లరేషన్ కార్డులో నేను, నా భర్త సాగర్, మా అత్తమామలు యాకోబు, రాణి, మరిది మధు ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు రేషన్‌కార్డు డివైడ్ చేయాలని కోరినా ఫలితం లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వారం క్రితం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మా ఇంటికొచ్చారు. సమస్య చెప్పాం. నాకు, నా భర్తకు కలిపి వేరే కార్డు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దుడ్డు ఇందు, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా -
నెలలు టైం పట్టే సర్టిఫికెట్స్ కూడా మేము గంట వ్యవధిలో ఇస్తున్నాం
-
ఆ విషయంలో రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం
-
Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్ సక్సెస్
సాక్షి, విజయవాడ: జగనన్న సురక్ష సర్వే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి 51.14 లక్షల వినతులకు గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిష్కారం చూపారు. జులై 11న అత్యధికంగా ఒకేరోజు 6.25 లక్షల వినతులను పరిష్కరించడంతో.. ప్రజా వినతుల పరిష్కారంలో ‘జగనన్న సురక్ష’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 17 రోజుల్లోనే 9,721 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి చేశారు. లక్ష 73 వేల క్లస్టర్లలో 84.11 లక్షల ఇళ్లను వలంటీర్లు సందర్శించారు. దీంతో ఏపీ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ మరో అరుదైన ఘనత సాధించింది. కాగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఏ సంక్షేమ పథకమైనా, ధ్రువపత్రామైనా అందని అర్హులకు అండగా నిలిచే సేవా యజ్ఞాన్ని చేపట్టింది. ‘జగనన్న సురక్ష’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఈనెల ఒకటో తేదీ నుంచి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడటంతోపాటు జనన, మరణ, కుల, ఆదాయ, సీసీఆర్సీ, రేషన్‌కార్డు విభజన వంటి 11 రకాల ధ్రువపత్రాలను జగనన్న సురక్ష గ్రామసభల ద్వారా అందిస్తున్నారు. ఫలితంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
-
జగనన్న సురక్షపై పబ్లిక్ రెస్పాన్స్...ఇది కదా పరిపాలన అంటే..
-
ప్రతి గుమ్మంలోకి జగనన్న సురక్ష
-
సురక్ష సూపర్..గంటల వ్యవధిలోనే 11 రకాల సేవలు
-
జగనన్న సురక్ష’ నిర్వహణకు రూ.25 కోట్లు
సాక్షి, అమరావతి: వ్యక్తిగత ప్రజా వినతులను సైతం సంతృప్తస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపుల నిర్వహణ ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవసరం పడే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారు ఒక్కరూ మిగిలి పోకూడదన్న లక్ష్యంగా ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికి సంబంధించిన వినతుల పరిష్కారం కోసం జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణకు గ్రామ సచివాలయానికి రూ.15 వేల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో క్యాంపులు జరిగే వార్డు సచివాలయానికి రూ.25 వేల చొప్పున ఈ నిధులను విడుదల చేశారు. వీటికితోడు అదనంగా ప్రతి జిల్లాకు రూ.మూడు లక్షల చొప్పున కలెక్టర్లుకు విడుదల చేశారు. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
ఉద్యమంలా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం
-
‘సురక్ష’ శిబిరాల్లో 30.98 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాల్లో బుధవారం వరకు విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సహా మొత్తం 30,98,697 వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికీ పథకాలు అందజేసేందుకు జగనన్న సురక్ష పేరుతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల విద్య నుంచి పీహెచ్డీ వంటి వాటివరకు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగే ఈ సమయంలో విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకునే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ శిబిరాల్లో అప్పటికప్పుడే సర్విసు చార్జీలు లేకుండా అందజేస్తున్నారు. జూలై 1న మొదలు పెట్టిన ఈ శిబిరాలు సచివాలయాల వారీగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు.. ఆదివారాలు మినహా 10 రోజులు 6,997 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మొత్తం 34,39,585 సర్విసులకు సంబంధించి అధికారులకు వినతులు అందాయని తెలిపారు. వాటిలో 90 శాతానికిపైగా.. 30.98 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కారించారని పేర్కొన్నారు. వీటిలో హౌస్హోల్డు జాబితాలో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్థులకు ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, కౌలు రైతులకు సీసీఆర్సీల జారీ వంటివి పెద్దసంఖ్యలో ఉన్నట్టు వివరించారు. ఒక్కరోజే.. 5,54,009 వినతుల పరిష్కారం ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,54,009 వినతులను అధికారులు పరిష్కరించారు. బుధవారం 573 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జరిగిన శిబిరాల్లో 2,44,582 మంది వినతులు పరిష్కరించారు. -
జగనన్న సురక్షలో బిజీబిజీగా ఎమ్మెల్యేలు
-
సచివాలయాల వద్దే సమస్యలు పరిష్కారించేలా జగనన్న సురక్ష
-
అభాగ్యులకు అండగా..
సాక్షి, నెట్వర్క్: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల సమస్యకు పరిష్కారం ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్‌కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్ నంబర్ లింక్ అయ్యింది. దీంతో ఆమె పింఛన్ ఆగిపోయింది. ‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్ మెహరున్నీసా, వలంటీర్లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్‌కార్డుకు మరొకరి ఆధార్ లింక్ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్‌కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్ నంబర్‌ను తొలగించారు. ఆ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్ పింఛన్ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నిరక్షరాస్యులకు ఎంతో మేలు ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరాస్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్ ఇతని పేరు శర్మాస్ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్లతో నూతన రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్ లేక కొత్తగా రేషన్ కార్డు పొందలేకపోయాడు. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్ ఇంటికి వచ్చినపుడు శర్మాస్ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్.. సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్ కుటుంబ విభజన సర్టిఫికెట్ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్ వలి నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా -
ఉద్యమంలా జగనన్న సురక్ష కార్యక్రమం
-
Jagananna Suraksha: దిగులు తీర్చిన సురక్ష
ఏ సర్టిఫికెట్ ఎవరిస్తారో తెలియదు. ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియదు. మనకిక ప్రభుత్వ సాయం అందదులే అనుకుంటున్న వారి ఇంటికి.. వలంటీర్లే వచ్చి ఏ సర్టిఫికెట్లు కావాలి అని అడిగి మరీ సేవలు చేస్తుంటే.. ప్రజల ముఖాల్లో ఆనందం అంతా ఇంతా కాదు. జగనన్న సురక్ష శిబిరాల్లో లబ్ధిదారులు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలును వేనోళ్ల కొనియాడుతున్నారు. కొంతమందికి ఇంటి వద్దే వలంటీర్లు సర్టిఫికెట్లు అందజేస్తుంటే.. ఇలాంటి సర్కార్‌ను ఎప్పుడూ చూడలేదంటూ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. వేలాది మంది ఇందులో లబ్ధిపొందారు. పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ జగనన్న సురక్షలో అధికారుల నుంచి సదరం సర్టిఫికెట్ అందుకుంటున్న ఈమె పేరు షేక్ మీరాబి. పల్నాడు జిల్లా కారెంపూడి మండలం చినకొదమగుండ్ల గ్రామం. మూడు నెలల క్రితం ఆమె భర్త షేక్ ఖాదర్‌కు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కుడి కాలు తీసేశారు. గతంలో ఇద్దరు పని చేసుకుంటూ జీవనం సాగించారు. 3 నెలలుగా భర్త మంచానికే పరిమితం కావడంతో పోషణ కష్టమైంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పలువురు మీరాబీకి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వలంటీర్‌కు చెప్పగా.. వారితో దరఖాస్తు చేయించారు. బుధవారం జరిగిన గ్రామ సభలో సదరం సర్టిఫికెట్‌ను మీరాబీకి అధికారులు అందించారు. పింఛన్‌కు కూడా అధికారులు దరఖాస్తు చేయించి మంజూరుకు సిఫార్సు చేశారు. త్వరలో దివ్యాంగుల పింఛన్ వస్తుందని తెలిసి మీరాబీ సంతోషానికి అవధులు లేవు. ఎంతో దిగులుతో ఉన్న తనకు సురక్ష శిబిరాల ద్వారా జగనన్న ఎంతో మేలు చేశారంటూ ఆమె కన్నీళ్లతో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రం ఈమె పేరు సీసా మచ్చూలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి.గొందూరు గ్రామం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, రెండుమూడు సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి నెలరోజుల తర్వాత ఆ పత్రం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కులధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఒక్కరోజులోనే ఫైసా ఖర్చు లేకుండా అధికారులు పత్రం అందజేశారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించిన జగనన్నకు థ్యాంక్స్ అంటూ ఆనందం వెలిబుచ్చారు. సులువుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, గెద్దానాపల్లికి చెందిన జల్లిగంపల పోలారావు ఉన్నత చదువులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అవసరమైంది. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు అతని ఇంటికి వెళ్లినప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం.. అతని దగ్గర నుంచి సర్టిఫికెట్ కోసం వివరాలు, జిరాక్స్‌లు తీసుకుని అధికారులకు అందజేశారు. వారు ఆ దరఖాస్తును పరిశీలించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇచ్చారు. -
అప్పటికప్పుడే... 10.86 లక్షల సమస్యలకు పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తక్షణమే తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఇప్పటివరకు 10.86 లక్షల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయి. వీటిని ప్రజల నుంచి వినతులు అందిన వెంటనే అప్పటికప్పుడే.. అక్కడికక్కడే పరిష్కరించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లో బుధవారం వరకు మొత్తం 10,86,727 వినతులను అప్పటికప్పుడే, అక్కడికక్కడే క్యాంపుల్లో అధికారులు పరిష్కరించారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరు వంటివాటికి సంబంధించిన అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వలంటీర్ల ఆధ్వర్యంలో ఇంటింటా అర్హులను జల్లెడ పట్టి.. వారికి ఆయా సేవలను అందజేస్తోంది. సచివాలయాలవారీగా 31 వరకు నిర్వహణ.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం (జూలై 1) నుంచి మొదలుపెట్టి ఈ నెల 31 వరకు ప్రభుత్వం క్యాంపులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు.. 1వ తేదీన 1,305 సచివాలయాల వద్ద, 3న 387 సచివాలయాల వద్ద, 4న 1,022 సచివాలయాల వద్ద, 5 (బుధవారం)న మరో 625 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తయినట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 36.30 లక్షల కుటుంబాలు నివాసం ఉండే పరిధిలో మొత్తం 3,339 సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణ పూర్తయినట్టు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో జరిగిన క్యాంపుల్లో వివిధ రకాల సమస్యలపై 13.10 లక్షల వినతులు అందాయి. ఇందులో 80 శాతానికి పైగా అంటే 10,86,727 వినతులను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు. వీటిలో హౌస్ హోల్డ్ లిస్టులో మార్పులుచేర్పులతోపాటు విద్యార్థులకు సంబంధించి ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీ వంటివి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన క్యాంపుల్లో అందిన వినతుల్లో ఇంకా 2.22 లక్షలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అవి కూడా ఆయా శాఖల అధికారుల పరిశీలనలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ వర్గాలు తెలిపాయి. -
జగనన్న సురక్ష: ఇక రావనుకున్న సర్టిఫికెట్లు వచ్చాయి
ఆమె ఓ మధ్య తరగతి గృహిణి. బొటాబొటిగా ఉండే సంపాదనతో కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదైనా ప్రభుత్వ పథకం అందితే తమ కుటుంబానికి భరోసాగా ఉంటుందని విశాఖ జ్ఞానాపురానికి చెందిన సంతోష్‌కుమారి ఆశ. కానీ ఆమెకు చాలా కాలంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఇంక విసుగొచ్చేసింది. దాంతో ఆ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడమే మానేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ‘జగనన్న సురక్ష’ ద్వారా ఎవరికి ఏం కావాలన్నా ప్రభుత్వం మంజూరు చేస్తుందని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు కోసం తాను పడ్డ కష్టాలు వారికి తెలిపింది. వెంటనే వారు వివరాలు అడిగారు. వివరాలన్నీ ఇచ్చి.. ఇప్పుడు కూడా ఆ ధ్రువీకరణ పత్రాలు రావులే అని భావించింది. అయితే రోజుల వ్యవధిలోనే ఆమెకు ఫోన్ వచ్చింది. ‘రేపు సురక్ష క్యాంపు ఉంది. మీ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయి తీసుకెళ్లండి’ అని ఆ ఫోన్లో సమాచారం ఇచ్చారు. తొలుత నమ్మలేకపోయింది. తర్వాత రోజు క్యాంపునకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుని మురిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏళ్ల తరబడి లేనిది వారం రోజుల్లో ఎలా వచ్చేస్తాయని అనుకున్నాను. క్యాంపులో పాల్గొన్నాను. నా పేరు పిలిచి.. నాకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు. విసుగొచ్చేలా తిరిగినా రానివి పైసా ఖర్చు లేకుండా రావడం నిజంగా మాలాంటి వారికి ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి పని ఇంటి తలుపు ముంగిటే జరుగుతుందని అందరూ అంటే.. ఏదో అనుకున్నాను. నాకూ అలా జరగడంతో.. ప్రజలంతా జగనన్నని సీఎంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమైంది’’ అని ఆనందం వ్యక్తం చేసింది. -
గతంలో కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం.. కానీ ఇప్పుడు అలా లేదు
-
జగనన్న సురక్ష: గంటల వ్యవధిలోనే మోక్షం.. 11రకాల సేవలు ఉచితం
-
ఏపీ వ్యాప్తంగా ఉద్యమంలా జగనన్న సురక్ష కార్యక్రమం
-
రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం (ఫొటోలు)
-
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే... దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసారథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా అమలవుతుంది. -
ఉద్యమంలా ‘జగనన్న సురక్ష’ .. అక్కడికక్కడే.. 'అప్పటికప్పుడే'
వెంటనే సర్టిఫికెట్లు.. ఈమె పేరు సునీత. వీళ్లది విజయవాడ శివారులోని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామం. జగనన్న సురక్ష క్యాంపులో కుల ధ్రువీకరణ, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం సచివాలయంలో దరఖాస్తు చేశారు. వలంటీర్లు వెంటనే ఇంటికి వచ్చి ఈమెకు అవసరమైన సర్టిఫికెట్ల గురించి వాకబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి ప్రారంభించిన జగనన్న సురక్ష క్యాంపులో అధికారులు వీటిని అక్కడికక్కడే ఉచితంగా అందజేశారు. గతంలో ఒక సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలా ప్రజల వద్దకే పాలనను తీసుకురావడంతో ఇప్పుడు ఆ ఇక్కట్లు తప్పాయి. సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా శనివారం (జులై 1) నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న క్యాంపుల్లో తొలిరోజే భారీ స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే మొత్తం 3,69,373 వినతులను అప్పటికప్పుడే పరిష్కరించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే మండల స్థాయి అధికారులందరూ వచ్చి క్యాంపుల్లో పాల్గొని నిబంధనల మేరకు వాటిని పరిష్కరించారు. సాధారణంగా వారం నుంచి 30 రోజుల వ్యవధిలో జారీచేయాల్సిన వాటిని కూడా రెండు, మూడు గంటల వ్యవధిలోనే అధికారులు అర్జీదారులు కోరిన సర్టిఫికెట్లను అందజేశారు. నిజానికి.. నాలుగేళ్ల క్రితం వరకు ప్రభుత్వాఫీసుల్లో పని కావాలంటే వాటిచుట్టూ రోజులు లేదా నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వినూత్న రీతిలో ప్రభుత్వ పాలనను గడప వద్దకే తీసుకొచ్చేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా.. రాష్ట్రంలో ఎవరికి ఏ పని ఉన్నా వారి సొంత ఊరిలోని సచివాలయాల్లోనే దాదాపు 600 పైగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమ పథకంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా సంతృప్తస్థాయిలో పూర్తి పారదర్శకంగా అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఫలితంగా.. ఇప్పుడు అర్హులెవ్వరూ మిగిలిపోకూడన్న ఆశయంతో ‘జగనన్న సురక్ష’ను చేపట్టింది. ఇందులో భాగంగా.. జులై 31 వరకు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ జూన్ 23న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం నుంచి ప్రారంభమైన సురక్ష క్యాంపుల్లో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలిరోజే 3.69 లక్షలకు పైగా అర్జీల పరిష్కారం.. రాష్ట్రవ్యాప్తంగా 14.28 లక్షల కుటుంబాలు నివాసం ఉండే 1,305 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద శనివారం ఆయా మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపులు జరిగాయి. వీటిల్లో 4,42,840 రకాల వినతుల పరిష్కారం కోసం అర్జీదారులు దరఖాస్తు చేసుకోగా, వాటిల్లో 3,69,373 వినతులను అక్కడికక్కడే పరిష్కరించి, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఆయా అర్జీదారులకు అందజేసినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. తొలిరోజు క్యాంపుల్లో అక్కడికక్కడే పరిష్కరించిన సమస్యల్లో అత్యధికం కొత్త బియ్యం కార్డుల మంజూరు, హౌస్ హోల్డు లిస్టులో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్ధులకు సంబంధించి ఇన్‌కం, కుల ధృవీకరణ పత్రాల జారీ, పలు రకాల ఆధార్ సేవలు వంటివి ఉన్నాయి. కొత్త కార్డుల మంజూరుకు వీలుగా ముందే.. హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఉమ్మడి కుటుంబాలుగా నమోదై ప్రస్తుతం వేరుగా ఉంటున్న వారు కొత్త కార్డుకు అవకాశంలేక ఇబ్బందుల పడుతున్న వారి సమస్యను ప్రభుత్వం ఈ సందర్భంగా జగనన్న సురక్ష పరిష్కరిస్తోంది. స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ (ప్రభుత్వ డేటాలోని కుటుంబ వివరాల్లో కొంతమంది సభ్యుల పేర్ల తొలగింపు) కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దాదాపు 82 వేల వినతులను జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రభుత్వం పరిష్కరించింది. 11 రకాల సేవలు ఉచితంగా.. మండల స్థాయి అధికారులు నిర్వహించే క్యాంపుల్లో అన్ని రకాల వినతులు, ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన అర్జీలు స్వీకరిస్తారు. అయితే, ఇందులో 1) ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధృవీకరణ) 2) ఆదాయ ధృవీకరణ 3) పుట్టిన రోజు 4) మరణ ధృవీకరణ 5) మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ (భూ కొనుగోలు అనంతరం అన్లైన్లో నమోదు) – మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ (అన్లైన్లో భూ వివరాల నమోదులో మార్పులు చేర్పులు) 6) వివాహ ధృవీకరణ (పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు) 7) ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు 8) ఆధార్‌కార్డులో మొబైల్ నెంబరు అప్డేట్ 9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) 10) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన 11) స్ప్లిట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సంబంధింత సర్వీసులకు ఈ క్యాంపుల్లో ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ప్రభుత్వం వీటిని జారీచేస్తోంది. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇక ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి అనేకమంది రైతులు సీసీఆర్సీ కార్డులు పొందారు. క్యాంపులు తమకు బాగా ఉపయోగపడ్డాయని వారు ఎక్కడలేని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆధార్ డెస్‌్కలో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింకింగ్ సేవలూ అనేకమంది అందుకున్నారు. అలాగే, మ్యుటేషన్ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్ చేసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరిస్తున్నారు. సేవలు మరింత విస్తృతం ఈ ప్రభుత్వం రాకముందు గతంతో 2–3 గ్రామాలకు ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వోద్యోగులు ఉండేవారు. కానీ, నేడు సచివాలయ పరిధిలో కనీసం 10–11 మంది ఉండడంతో ఇలాంటి క్యాంపుల ద్వారా సేవలు మరింత విస్తృతం అయ్యాయి. అంతేకాక, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతున్నాయి. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్య సేవలు కూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు. -
జగనన్న సురక్షపై లబ్ధిదారుల హర్షం..
-
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
-
నేటి నుంచి ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమం
-
AP: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభం
సాక్షి, అమరావతి: ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ ద్వారా నేటి నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ►ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. ►తొలిరోజు జూలై 1వ తేదీన 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు జూన్ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతుల వివరాలను సేకరించారు. ►తొలిరోజు క్యాంపులకు సంబంధించి 14,29,051 కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఎస్ఎంఎస్ రూపంలో కూడా సమాచారాన్ని పంపింది. ►జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ►జగనన్న సురక్ష కార్యక్రమం కింద జూలై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు నిర్దేశిత తేదీల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ►సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఏడు రోజుల ముందే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. ►శుక్రవారం సాయంత్రం వరకు 9.48 లక్షల టోకెన్లు జారీ కాగా 6.77 లక్షల వినతుల వివరాలను సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటికప్పుడే పరిష్కారానికి అవకాశం ఉన్న 2.65 లక్షల వినతులకు సంబంధించి క్యాంపు నిర్వహణకు ముందే అధికారుల స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తయ్యాయి. -
‘జగనన్న సురక్ష’ క్యాంపులు ఖరారు
సాక్షి, అమరావతి: ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీన రాష్ట్రవ్యాప్తంగా 1,297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఏ సచివాలయం పరిధిలో ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తారనే వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే తెలియజేశారు. తొలిరోజు జూలై 1వతేదీన 1,297 సచివాలయాల వద్ద ఈ క్యాంపులు ప్రారంభమవుతాయి. జూలై 3వతేదీన 410 సచివాలయాల వద్ద, నాలుగో తేదీన 934 సచివాలయాల వద్ద క్యాంపులు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 15,004 సచివాలయాల వద్ద నిర్దేశిత తేదీల్లో క్యాంపులు జరుగుతాయి. జూలై 31వ తేదీతో ఈ క్యాంపుల నిర్వహణ పూర్తి కానుంది. మైకులో ప్రచారం.. వాట్సాప్.. ఎస్సెమ్మెస్‌లు ఏ సచివాలయం పరిధిలో ఏ తేదీన క్యాంపు జరుగుతుందన్న వివరాలను వారం రోజుల ముందే మైక్ ద్వారా ప్రచారం చేస్తారు. అదే రోజు వలంటీర్లు ఇంటింటి సందర్శన కార్యక్రమాన్ని చేపట్టి క్యాంపు వివరాలను వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు అర్హులకు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమో ముందుగా తెలియజేస్తారు. క్యాంపు జరగటానికి నాలుగు రోజుల ముందు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పనిచేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికీ సమాచారం ఇస్తారు. దీంతోపాటు క్యాంపు నిర్వహణకు ఒక్క రోజు ముందు ఆయా సచివాలయాల పరిధిలో నమోదైన ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా కూడ సమాచారం చేరవేస్తారు. ఈ మేరకు క్యాంపుల నిర్వహణ, ఇంటింటికీ వలంటీర్ల సందర్శనకు సంబందించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందించి అన్ని జిల్లాలు, మండల స్థాయి అధికారులకు పంపింది. ఏడు రోజుల ముందు ఆన్లైన్ టోకెన్లు.. సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులు సజావుగా కొనసాగేలా క్యాంపు నిర్వహణకు ఏడు రోజుల ముందు అర్జీదారుల నుంచి వినతుల స్వీకరణతో పాటు వరుస క్రమంలో టోకెన్లను జారీ చేస్తారు. ఈమేరకు ఏడు రోజుల ముందు ఆన్లైన్లో టోకెన్లు జారీ చేసేలా సచివాలయ ఉద్యోగులకు సాఫ్ట్వేర్ అందుబాటులో వస్తుంది. ఒక దరఖాస్తుదారుడు రెండు రకాల వినతులు అందజేస్తే సంబంధిత వ్యక్తికి రెండు టోకెన్లు జారీ చేస్తారు. ముందుగా టోకెన్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే క్యాంపుల్లో సర్వీసు చార్జీ మినహాయింపు ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేసిన ఎస్‌వోపీలో స్పష్టం చేసింది. 13 ప్రశ్నలతో వలంటీర్ల ఇంటింటి సర్వే.. ఈ కార్యక్రమంలో భాగంగా వలంటీర్ల ఇంటింటి సందర్శన సమయంలో ప్రతి ఇంటి నుంచి వివరాల సేకరణకు మొత్తం 13 రకాల ప్రశ్నలతో గ్రామ, వార్డుసచివాలయాల శాఖ యాప్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి వివరించడంతోపాటు అర్హులు ఆయా పథకాలను పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అని పరిశీలిస్తారు. ప్రభుత్వం జారీచేసే వివిధరకాల ధ్రువీకరణ పత్రాల గురించి తెలియచేసిన వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. -
జగనన్న సురక్ష పథకం గురించి వివరించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు మేలు చేసేందుకు ఉద్యమంగా ‘జగనన్న సురక్ష’...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఉద్యమంగా ‘జగనన్న సురక్ష’
పేదవాడు ఎలా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులు పోయి.. ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో 99 శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాల వల్లో మిగతా ఒక్క శాతం మంది కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా, దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఏమైనా సమస్యలున్నాయా అని అడుగుతున్న తొలి ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం.. ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు, పలానా పథకం లబ్ధి అందలేదని చెప్పే అవకాశం ఉండకూడని విధంగా సమస్యలు పరిష్కరించాలన్నదే ధ్యేయమని పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే జల్లెడ పట్టి.. అర్హులను గుర్తించి, పథకాలే కాదు వారికి కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా ఈ కార్యక్రమంలో ఇస్తారని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, మండల, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ.. నేరుగా పేద లబి్ధదారుల దగ్గరకు వెళ్లడమే జగనన్న సురక్షా కార్యక్రమం అన్నారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండీ పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హుల తలుపు తట్టి, లబ్ధి చేకూర్చే మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అర్హుల కోసం జల్లెడ పడతాం ♦ అర్హులెవ్వరూ మిగిలిపోకూడదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి జూలై, డిసెంబర్ మాసాల్లో పథకాలు మంజూరు చేస్తున్నాం. దీనికి మరో ప్రయత్నంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మిగిలిపోయిన అర్హుల కోసం జల్లెడ పట్టే ఈ కార్యక్రమం నెల పాటు కొనసాగుతుంది. ♦ ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర సేవలన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారు. దాదాపు 11 రకాల సేవలు ఎలాంటి సర్విసు చార్జీ లేకుండా అందించేలా అడుగులు వేస్తున్నాం. ఆధార్ కార్డుల మార్పులకు కోసం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2,500 సెంటర్లు ఏర్పాటు చేయించాం. వాటికి సంబంధించిన విధి, విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ మేరకు సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం కింద అందిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ.. ♦ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం మీద ప్రేమ ఉన్న ఉత్సాహవంతులు ఒక బృందంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తడతారు. లబ్ధి అందని వారు, ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి సచివాలయంలో సమర్పిస్తారు. ♦ ఒక టోకెన్ నంబరు జనరేట్ చేసి, సర్వీసు రిక్వెస్ట్ నంబర్ కేటాయించి.. దానిని ఆయా కుటుంబాలకు అందిస్తారు. సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారు, మండల అధికారులు ఎప్పుడు వస్తారన్న తేదీ కూడా వారికి చెబుతారు. ఆ రోజున వారిని క్యాంపులకు తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు. ♦ ఈ నెల రోజుల్లో క్యాంపుల సందర్భంగా మండల స్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి ఈ సమస్యలను పరిష్కరించి, సరి్టఫికెట్లు ఇస్తారు. తాసీల్దార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో ఒక టీంగా, డిప్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ రెండో టీంగా ఏర్పడతారు. ♦ ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1 నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షల మంది ఉద్యోగులు, వలంటీర్లు ♦ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పేదవాడికి సాయం చేయడం కోసం సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వలంటీర్లు సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారు. ♦ 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారులు అన్ని క్యాంపుల్లో పాల్గొంటారు. అక్కడ సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీ కూడా మానిటరింగ్ చేస్తారు. క్యాంపుల నిర్వహణలో జాగ్రత్తలు ♦ సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతి క్యాంపును ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కచ్చితంగా సందర్శించాలి. లబ్దిదారులకు క్యాంపుల గురించి సరైన సమాచారం అందించాలి. ♦ జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి వాటిని కూడా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్లు అడిగింది సాధ్యం కాని పరిస్థితులు ఉంటే ఆ విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి. దాన్ని కూడా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగం చేసుకోవాలి. రెవెన్యూ డివిజన్ల వారీగా కూడా ఈ కార్యక్రమంపై పర్యవేక్షణ అవసరం. ఈ అంశంపై కూడా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. ♦ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అప్పుడు, ఇప్పడు పరిస్థితి గమనించండి ♦ నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వంలో పరిస్థితులను చూడండి. ఏ పట్టణాన్ని, ఏ గ్రామాన్ని, ఏ వార్డును తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. మరో వైపు వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు. మీరు ఏ పార్టీ వారనే ప్రశ్న ఎదురయ్యేది. ♦ మనం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చే గొప్ప వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఆరు నెలల్లోనే దాదాపు 600 రకాల పౌరసేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటకు తీసుకు వచ్చాం. ♦ అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా.. ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా పౌర సేవలు అందించడం మన ప్రభుత్వంలోనే మొదలైంది. ♦ అందువల్లే ఇవాళ ప్రతిపక్షాలకు అజెండా అన్నది మిగల్లేదు. ఇంతకు ముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్ల పట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఉద్యమాలు జరిగే పరిస్థితులు ఉండేవి. ఈ రోజు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, బర్త్, ఇన్‌కం, డెత్, ఇన్‌కం సర్టిఫికెట్లు గ్రామ స్థాయిలోనే అందుతున్నాయి. ♦ ఈ నాలుగేళ్లలో నవరత్నాల ద్వారా రూ.2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో డీబీటీ ద్వారా నేరుగా జమ చేశాం. నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాల విలువ కూడా కలుపుకుంటే అది రూ.3.10 లక్షల కోట్లు దాటింది. -
ఎక్కడా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం
-
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు అర్హులందరికీ అందాలి: సీఎం వైఎస్ జగన్
-
అర్హులందరికీ జగనన్న సురక్షతో లబ్ధి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రేషన్ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అయితే.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేలు అర్హులందరికీ అందాలి. వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే జగనన్న సురక్ష తీసుకొచ్చాం. అర్హత ఉండి కూడా.. చిన్నచిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘నవరత్నాల ద్వారా రూ.2 లక్షల 16వేల కోట్లు అందించాం. నేరుగా బటన్ నొక్కి అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. పేదవాడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. లంచాలకు తావులేకుండా 600 రకాల పౌర సేవలు అందిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజులపాటు ‘జగనన్నకి చెబుదాం’ కార్యక్రమానికి కొనసాగింపుగా.. జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుంది. ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సమస్యలేవైనా ఉంటే ఈ నెంబర్‌కు డయల్ చేయొచ్చు. ‘లబ్ధిదారుల సమస్యను గుర్తించి పరిష్కారానికి ప్రయత్నిస్తారు’ ‘మొదటి అడుగుగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు ఒక టీమ్‌గా ఏర్పడి వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి అందని వారిని గుర్తించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సచివాలయాలకు వెళ్లి సర్వీస్ నెంబర్ రిజిస్టర్ చేసి టోకెన్ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు. సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి చెప్పి ఆరోజు వారిని క్యాంపులకు తీసుకొచ్చి సమస్య పరిష్కరించేలా చూస్తారు. మండల స్థాయి అధికారులతో కూడా బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తారు ప్రతి మండలంలో ప్రతి రోజూ 2 సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1వ తేదీ నుంచి కూడా ఈ క్యాంపులను నిర్వహిస్తారు. ఎలాంటి చార్జీలు లేకుండానే ఈసేవలు అందిస్తారు. 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని సీఎం జగన్ తెలిపారు. క్యాంపులు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు సందర్శించాలి అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతన్న తీరుపై తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీలు మానిటరింగ్ చేస్తారు. సచివాలయాల్లో క్యాంపులో నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.క్యాంపులు జరుగుతున్నప్రుడు కచ్చితంగా ఎమ్మెల్యేలు సందర్శించాలి. జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: నిరుద్యోగ రహిత ఏపీనే లక్ష్యం -
పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్
Updates జగనన్న సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమం.. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్ స్పీచ్ ►దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ►జగనన్న సురక్షా కార్యక్రమంలో నేరుగా ప్రజల వద్దకు వెళ్తారు ►నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్నా సురక్షా కార్యక్రమం ►జగనన్ను చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్షాను చేపట్టాం ►అర్హులైన ఉండి ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు కాని, పలానా లబ్ధి కాని అందలేదు అని చెప్పే అవకాశం ఉండకూడదు ►జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలే కాదు వారికి కావల్సిన డాక్యుమెంటేషన్లుకూడా ఇస్తారు ►నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితులను చూడండి ►ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ వార్డును తీసుకున్నా, ఏ పట్టణాన్ని తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ►లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు ►ఏ పనికోసం వెళ్లినా మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగేవారు ►నాలుగేళ్లలో పరిస్థితిని పూర్తిగా మార్చాం ►పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే తీసుకువచ్చే గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చాం ►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే దీన్ని తీసుకు వచ్చాం ►కులం చూడకుండా, మతం చూడకుండా, చివరకు వారు ఏ పార్టీవారో చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా ఎక్కడా ఒక్క రూపాయికూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పౌరసేవలు అందించడం మన ప్రభుత్వంలోనే ప్రారంభం అయ్యింది ►ప్రతిపక్షాలకు అజెండా అన్నది ఏదీ మిగల్లేదు ►ఇంతకుముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్లపట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఇంతకుముందు రోజుల్లో చూసేవారు ►పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వడం, ఇళ్లపట్టాలు కానివ్వండి, ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా.. అత్యంత పారదర్శకంగా, లంచాలకు తావులేకుండా వివక్షకు చోటు లేకుండా గ్రామస్థాయిలోనే ఇవన్నీ అందుతున్నాయి ►అంతకు మించి నవరత్నాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రూ. 2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా, వివక్ష లేకుండా, అవినీతి లేకుండా డీబీటీ ద్వారా జమచేయడం జరిగింది ►ఒక గొప్ప విప్లవం గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వాల పాలనలో తీసుకు రాగలిగాం ►ఈ విప్లవంలో భాగంగానే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే తపనతో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని చేపట్టాం ►దీనికి ముందు ఇప్పటికే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జులై, డిసెంబర్ మాసాల్లో మంజూరు చేస్తున్నాం ►దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాం ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడైనాకూడా, ఎవ్వరైనా కూడా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో, అందాల్సిన మంచి అందకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని పేదవాళ్లకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో జగనన్నా సురక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ►15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాళ్టి నుంచి ప్రారంభమై నెలరోజులపాటు కొనసాగుతుంది ►రాష్ట్రంలో ౯౮శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి ►సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాలవల్లో ఆ ఒక్క శాతం మందికూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం ►ఈ కార్యక్రమంలో అర్హులకు పథకాలు మంజూరు చేస్తారు ►వివిధ సర్టిఫికెట్లు జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీచేస్తారు ►ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్ కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు… ఇవన్నీకూడా ఈ కార్యక్రమం కింద చేపడతారు ►కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే 2500 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశాం ►కేంద్రం ఇప్పటికే ఆధార్ మార్పులకు సంబంధించి విధివిధానాలు ప్రకటించాం ►వీటిప్రకారం సేవలను జగనన్నా సురక్షా కార్యక్రమం కింద అందిస్తారు ►ఇలా ఎలాంటి సాంకేతిక సమస్యల వల్లనైనా నిజంగా అర్హత ఉండి.. ఏ ఒక్కరైనా, ఎవ్వరైనా మంచి జరగని పరిస్థితి ఉందంటే… దాన్ని సరిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ►ఎలాంటి సర్వీసు ఛార్జీలు కూడా ప్రభుత్వం వసూలు చేయడదు ►కార్యక్రమంలో మొదటి అడుగుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఎవరైనా ఒక టీంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటివద్దకూ వెళ్తారు ►లబ్ధి అందని వారు ఎవరైనా ఉంటే.. వారందర్నీ కూడా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు ►వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి… సచివాలయాలకు వెళ్లి సర్వీసు నంబరు రిజిస్టర్ చేసి, టోకెన్ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు ►సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి తేదీ చెప్పి, ఆరోజు వారిని క్యాంపులకు తీసుకు వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు ►క్యాంపుల సందర్భంగా మండలస్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి… ఈ సమస్యలను పరిష్కరిస్తారు ►ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి ►జులై 1 నుంచి కూడా ఈ క్యాంపులను నిర్వహిస్తారు ►ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఈ సేవలు అందిస్తారు ►రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ ఈ సేవలు అందుతాయి ►సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వాలంటీర్ల సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు ►26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం ►అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు ►ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు ►వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీలు మానిటరింగ్ చేస్తారు ►దేశ చరిత్రలో ఎక్కడా కూడా, ఎప్పుడూకూడా చూడని విధంగా పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం, ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా లేకపోవచ్చు ►మీ బిడ్డ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుంది ►సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ►తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి ►క్యాంపులు జరుగుతున్నప్పుడు కచ్చితంగా ఎమ్మెల్యేలు వాటిని సందర్శించాలి ►వారికి అధికారుల ద్వారా సరైన సమాచారం అందించాలి ►జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి ►ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి ►జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ►సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యం ►నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ ►రేపటి నుంచి గృహాల సందర్శన ►రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శించనున్న బృందాలు ►రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహణ ►‘1902’తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు.. ►అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’. ►ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుంది. ►తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఇన్కమ్ మొదలైన 11 రకాలు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుంది. ►కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష’. ►వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. ►అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు. ►ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ►ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు. ►మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. ►జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు. ►జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుంది. ►రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది పౌరులకు చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శిస్తూ, జూలైæ 1 నుంచి∙ఈ కార్యకమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు జరుగుతాయి. ఇందులో 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వోద్యోగులు, 2.6 లక్షల మంది వలంటీర్లు పాల్గొంటారు. ఇక 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక ఐఏఎస్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ క్యాంపులను తనిఖీ చేస్తారు. ప్రోగ్రాం పురోగతిపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై వారం వారం సమీక్ష నిర్వహిస్తారు. ►వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని ఇంటివద్ద లేకపోయినప్పటికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్లినట్లయితే వలంటీర్లతో కూడిన ఈ టీమ్ ‘1902’ హెల్ప్‌డెస్క్ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఇక గ్రామంలో.. సచివాలయ పరిధిలో ఏ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నంబర్ ‘1902’ కి కాల్ చేయాలి. లేదా https://vswsonline.ap.gov.in/#/home వెబ్‌సైట్‌ను సందర్శించాలి.