AP CM YS Jagan Launches 'Jagananna Suraksha' Programme: Updates - Sakshi
Sakshi News home page

పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్‌

Published Fri, Jun 23 2023 11:38 AM | Last Updated on Fri, Jun 23 2023 4:09 PM

AP CM YS Jagan Launches Jagananna Suraksha Programme Updates - Sakshi

Updates

జగనన్న సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమం.. తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి సీఎం జగన్‌ స్పీచ్‌

దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
జగనన్న సురక్షా కార్యక్రమంలో నేరుగా ప్రజల వద్దకు వెళ్తారు
నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్నా సురక్షా కార్యక్రమం
జగనన్ను చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్షాను చేపట్టాం
అర్హులైన ఉండి ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు కాని, పలానా లబ్ధి కాని అందలేదు అని చెప్పే అవకాశం ఉండకూడదు
జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలే కాదు వారికి కావల్సిన డాక్యుమెంటేషన్లుకూడా ఇస్తారు
నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితులను చూడండి
ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ వార్డును తీసుకున్నా, ఏ పట్టణాన్ని తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి
లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారు
ఏ పనికోసం వెళ్లినా మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగేవారు
నాలుగేళ్లలో పరిస్థితిని పూర్తిగా మార్చాం

పెన్షన్‌ కావాలన్నా.. రేషన్‌ కావాలన్నా నేరుగా ఇంటికే తీసుకువచ్చే గొప్ప వాలంటీర్‌ వ్యవస్థను తీసుకు వచ్చాం
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే దీన్ని తీసుకు వచ్చాం
కులం చూడకుండా, మతం చూడకుండా, చివరకు వారు ఏ పార్టీవారో చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా ఎక్కడా ఒక్క రూపాయికూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పౌరసేవలు అందించడం మన ప్రభుత్వంలోనే ప్రారంభం అయ్యింది
ప్రతిపక్షాలకు అజెండా అన్నది ఏదీ మిగల్లేదు

ఇంతకుముందు రేషన్‌ కార్డులు కావాలని, ఇళ్లపట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఇంతకుముందు రోజుల్లో చూసేవారు
పెన్షన్లు కానివ్వండి, రేషన్‌ కార్డులు కానివ్వడం, ఇళ్లపట్టాలు కానివ్వండి, ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా.. అత్యంత పారదర్శకంగా, లంచాలకు తావులేకుండా వివక్షకు చోటు లేకుండా గ్రామస్థాయిలోనే ఇవన్నీ అందుతున్నాయి
అంతకు మించి నవరత్నాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రూ. 2.16 లక్షల కోట్లు బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా, వివక్ష లేకుండా, అవినీతి లేకుండా డీబీటీ ద్వారా జమచేయడం జరిగింది
ఒక గొప్ప విప్లవం గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వాల పాలనలో తీసుకు రాగలిగాం
ఈ విప్లవంలో భాగంగానే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే తపనతో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని చేపట్టాం
దీనికి ముందు ఇప్పటికే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జులై, డిసెంబర్‌ మాసాల్లో మంజూరు చేస్తున్నాం
దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాం
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడైనాకూడా, ఎవ్వరైనా కూడా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో, అందాల్సిన మంచి అందకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని పేదవాళ్లకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో జగనన్నా సురక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం
15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాళ్టి నుంచి ప్రారంభమై నెలరోజులపాటు కొనసాగుతుంది
రాష్ట్రంలో ౯౮శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి
సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాలవల్లో ఆ ఒక్క శాతం మందికూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం

ఈ కార్యక్రమంలో అర్హులకు పథకాలు మంజూరు చేస్తారు
వివిధ సర్టిఫికెట్లు జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీచేస్తారు
ఆదాయం, కులం, బర్త్‌, కొత్త రేషన్‌ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌ కు బ్యాంక్‌ లింకేజి, ఆధార్‌ కార్డుల్లో మార్పులు… ఇవన్నీకూడా ఈ కార్యక్రమం కింద చేపడతారు

కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే 2500 ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం
కేంద్రం ఇప్పటికే ఆధార్‌ మార్పులకు సంబంధించి విధివిధానాలు ప్రకటించాం
వీటిప్రకారం సేవలను జగనన్నా సురక్షా కార్యక్రమం కింద అందిస్తారు
ఇలా ఎలాంటి సాంకేతిక సమస్యల వల్లనైనా నిజంగా అర్హత ఉండి.. ఏ ఒక్కరైనా, ఎవ్వరైనా మంచి జరగని పరిస్థితి ఉందంటే… దాన్ని సరిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది
ఎలాంటి సర్వీసు ఛార్జీలు కూడా ప్రభుత్వం వసూలు చేయడదు

కార్యక్రమంలో మొదటి అడుగుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఎవరైనా ఒక టీంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటివద్దకూ వెళ్తారు
లబ్ధి అందని వారు ఎవరైనా ఉంటే.. వారందర్నీ కూడా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు
వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి… సచివాలయాలకు వెళ్లి సర్వీసు నంబరు రిజిస్టర్‌ చేసి, టోకెన్‌ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు
సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి తేదీ చెప్పి, ఆరోజు వారిని క్యాంపులకు తీసుకు వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు
క్యాంపుల సందర్భంగా మండలస్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి… ఈ సమస్యలను పరిష్కరిస్తారు
ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్‌ అవుతాయి
జులై 1 నుంచి కూడా ఈ క్యాంపులను నిర్వహిస్తారు
ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఈ సేవలు అందిస్తారు
రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ ఈ సేవలు అందుతాయి
సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వాలంటీర్ల సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు
26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం
అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు
ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు
వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్‌ సెక్రటరీలు మానిటరింగ్‌ చేస్తారు
దేశ చరిత్రలో ఎక్కడా కూడా, ఎప్పుడూకూడా చూడని విధంగా పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం, ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా లేకపోవచ్చు
మీ బిడ్డ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుంది

సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించేటప్పుడు సదుపాయాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
తాగునీరు, భోజనం, కూర్చోవడానికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి
క్యాంపులు జరుగుతున్నప్పుడు కచ్చితంగా ఎమ్మెల్యేలు వాటిని సందర్శించాలి
వారికి అధికారుల ద్వారా సరైన సమాచారం అందించాలి
జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి
ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యం

నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ

రేపటి నుంచి గృహాల సందర్శన

రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శించనున్న బృందాలు

రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహణ

‘1902’తో హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు..

అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్ర­యంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’.


ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుంది.

తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజ­న్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకా­లు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లే­కుండా వాటిని ఉచితంగా అందించనుంది.

కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వి­వక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దే­శంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి స­మస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష’.


వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది.

అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు.


ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు.

ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు.

మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్‌ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు.

జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు.

జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుంది.


రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది పౌరులకు చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శిస్తూ, జూలైæ 1 నుంచి∙ఈ కార్యకమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు జరుగుతాయి. ఇందులో 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వో­ద్యోగులు, 2.6 లక్షల మంది వలంటీర్లు పాల్గొంటారు. ఇక 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక ఐఏఎస్‌ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ క్యాంపులను తనిఖీ చేస్తారు. ప్రోగ్రాం పురోగతిపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై వారం వారం సమీక్ష నిర్వహిస్తారు.

వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని ఇంటివద్ద లేకపోయి­నప్ప­టికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్లినట్లయితే వలంటీర్లతో కూడిన ఈ టీమ్‌ ‘1902’ హెల్ప్‌డెస్క్‌ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఇక గ్రామంలో.. సచివాలయ పరిధిలో ఏ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘1902’ కి కాల్‌ చేయాలి. లేదా https://vswsonline.ap.gov.in/#/home వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement