జగనన్న సురక్ష’ నిర్వహణకు రూ.25 కోట్లు | 25 Crores For The Maintenance Of Jagananna Suraksha | Sakshi
Sakshi News home page

జగనన్న సురక్ష’ నిర్వహణకు రూ.25 కోట్లు

Published Sat, Jul 15 2023 5:04 AM | Last Updated on Sat, Jul 15 2023 4:54 PM

25 Crores For The Maintenance Of Jagananna Suraksha - Sakshi

సాక్షి, అమరావతి: వ్యక్తిగత ప్రజా వినతులను సైతం సంతృప్తస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపుల నిర్వహణ ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది.

ప్రభుత్వ ఆఫీసుల్లో అవసరం పడే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారు ఒక్కరూ మిగిలి పోకూడదన్న లక్ష్యంగా ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికి సంబంధించిన వినతుల పరిష్కారం కోసం  జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సచివాలయాల వద్ద క్యాంపుల నిర్వహణకు గ్రామ సచివాలయానికి రూ.15 వేల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో క్యాంపులు జరిగే వార్డు సచివాలయానికి రూ.25 వేల చొప్పున ఈ నిధులను విడుదల చేశారు. వీటికితోడు అదనంగా ప్రతి జిల్లాకు రూ.మూడు లక్షల చొప్పున కలెక్టర్లుకు విడుదల చేశారు. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement