Kakani Govardhan Reddy Serious Comments On Pawan Kalyan Over His Remarks - Sakshi
Sakshi News home page

జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది: మంత్రి కాకాణి

Published Thu, Jul 20 2023 11:52 AM | Last Updated on Thu, Jul 20 2023 12:28 PM

Kakani Govardhan Reddy Serious On Pawan Kalyan - Sakshi

సాక్షి, నెల్లూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. పవన్‌ రాజకీయ అజ్ఞాని కావడంతో వాలంటీర్ల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా 57లక్షల మందికి సర్టిఫికెట్లు అందించాం. జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది. 11 రకాల సేవలను లబ్దిదారులకు అందిస్తున్నాం. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఎన్నికలకు ఒంటిరిగా వెళ్లి గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం లేదంటూ కామెంట్స్‌ చేశారు. ప్రజలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంది కాబట్టే సింగిల్‌గా బరిలోకి దిగుతాము అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్‌లో రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement