AP CM YS Jagan Speech Highlights At Jagananna Suraksha Program Launch, Details Inside - Sakshi
Sakshi News home page

జగనన్న సురక్షతో అర్హులందరికీ లబ్ధి: సీఎం జగన్‌ స్పష్టీకరణ

Published Fri, Jun 23 2023 12:05 PM | Last Updated on Fri, Jun 23 2023 4:08 PM

AP CM YS Jagan Speech At Jagananna Suraksha Program Launch - Sakshi

సాక్షి, గుంటూరు: రేషన్‌ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అయితే.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.   

శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం.  ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేలు అర్హులందరికీ అందాలి. వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే జగనన్న సురక్ష తీసుకొచ్చాం. అర్హత ఉండి కూడా.. చిన్నచిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

‘‘నవరత్నాల ద్వారా రూ.2 లక్షల 16వేల కోట్లు అందించాం. నేరుగా బటన్‌ నొక్కి అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. పేదవాడికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. పేదల పట్ల ప్రేమ చూపిస్తు‍న్న ఏకైక ప్రభుత్వం మనదే. లంచాలకు తావులేకుండా 600 రకాల పౌర సేవలు అందిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజులపాటు ‘జగనన్నకి చెబుదాం’ కార్యక్రమానికి కొనసాగింపుగా.. జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుంది. ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్‌ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు. సమస్యలేవైనా ఉంటే ఈ నెంబర్‌కు డయల్‌ చేయొచ్చు.

‘లబ్ధిదారుల సమస్యను గుర్తించి పరిష్కారానికి ప్రయత్నిస్తారు’
‘మొదటి అడుగుగా వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు ఒక టీమ్‌గా ఏర్పడి వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి అందని వారిని గుర్తించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు.   ‘సచివాలయాలకు వెళ్లి సర్వీస్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసి టోకెన్‌ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు. సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి చెప్పి ఆరోజు వారిని క్యాంపులకు తీసుకొచ్చి సమస్య పరిష్కరించేలా చూస్తారు. 

మండల స్థాయి అధికారులతో కూడా బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తారు  ప్రతి మండలంలో ప్రతి రోజూ 2 సచివాలయాలు కవర్‌ అవుతాయి. జూలై 1వ తేదీ నుంచి కూడా ఈ ‍క్యాంపులను నిర్వహిస్తారు. ఎలాంటి చార్జీలు లేకుండానే ఈసేవలు అందిస్తారు. 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్‌ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం. పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని సీఎం జగన్‌ తెలిపారు.

క్యాంపులు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు సందర్శించాలి
అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతన్న తీరుపై తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్‌ సెక్రటరీలు మానిటరింగ్‌ చేస్తారు.  సచివాలయాల్లో క్యాంపులో నిర్వహించేటప్పుడు సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.క్యాంపులు జరుగుతున్నప్రుడు కచ్చితంగా ఎమ్మెల్యేలు సందర్శించాలి. జగనన్నకు చెబుదాం ద్వారా వచ్చిన సమస్యలను ఇదే కార్యక్రమంలో మిళితం చేసి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి. ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: నిరుద్యోగ రహిత ఏపీనే లక్ష్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement