new ration card
-
కొత్త రేషన్ కార్డుల మంజూరు అసాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పట్లో కొత్త రేషన్ కార్డుల మంజూరు అసాధ్యమే అనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ (ఆహార భద్రత)కార్డు ప్రామాణికంగా చెప్పడంతో ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తూ వస్తోంది. గత పదేళ్లలో కొత్త కార్డుల మంజూరు అంతంతగా మారడంతో రేషన్ కార్డులు లేనివారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే నాలుగు లక్షల పైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, మరో ఆరు లక్షల కుటుంబాలు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్ల నుంచి పౌరసరఫరాల ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు స్వీకరించే లాగిన్‌ను నిలిపివేశారు. వాస్తవంగా 2021 మార్చి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి ఆమోదం లేకుండా పోయింది. ఆ తర్వాత కొత్త దరఖాస్తుల సమర్పించుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తెల్లరేషన్ కార్డులను ఆహార భద్రత కార్డులుగా మార్పు చేయడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బడిముబ్బడిగా కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత కాలానికి అనర్హుల పేరిట కొన్ని కార్డులను ఏరివేసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్ జిల్లా పరిధిలో కార్డుల సంఖ్యను 15,99,639 పరిమితం చేసింది. దీంతో తిరిగి కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున సుమారు 3.40 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకోగా, 2021 ఆగస్టులో దరఖాస్తులను వడబోసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి కొత్త కార్డులు మంజూరు మంజూరు చేసింది. 10 లక్షల కుటుంబాలకు ఎదురుచూపులే.. మహానగరంలో మరో 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. ఇక ఇటీవలి ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5,73,069 కుటుంబాలు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నాయి. ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు జోన్ కొత్త దరఖాస్తుల సంఖ్య ఎల్బీనగర్ 3,16,919 చార్మినార్ 6,53,795 ఖైరతాబాద్ 4,27,950 కూకట్పల్లి 4,04,746 శేరిలింగంపల్లి 2,29,355 సికింద్రాబాద్ 3,91,160 కంటోన్మెంట్ 50,400 -
తెలంగాణలో నిరంతరం కొత్త రేషన్‌కార్డుల జారీ.. ప్రజాపాలన దరఖాస్తు ఫారం, లోగో, పోస్టర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'..
కరీంనగర్: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది. ‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.' దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది. ఒక్కో కార్డుకు రూ.25 వసూలు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR) -
రెండున్నర గంటల్లో రేషన్‌కార్డు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు. గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్‌కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. -
కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను ఇప్పట్లో జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జూన్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించనున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది దీనిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని.. ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఆలోచనేదీ లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలను మించి కార్డులు రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల కన్నా అత్యధిక సంఖ్యలో ఆహార భద్రత కార్డులు ఉన్నాయని పలు సర్వేలు తేల్చాయి. అనర్హులకు ఇచ్చిన కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు సార్లు ఆలోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మిన్నకుండి పోయింది. 2018 ఎన్నికలకు ముందు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సర్కారు.. 2021 వరకు పలు దఫాల్లో 3.11 లక్షల కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును తొలగిస్తున్న అధికారులు, కొత్తగా జన్మించిన వారి పేర్లను చేర్చడం లేదు. ఈ మార్పులు చేర్పుల కోసం ఎఫ్ఎస్సీఆర్ఎం వెబ్సైట్లో చేసుకుంటున్న దరఖాస్తుకే ఇప్పటివరకు మోక్షం కలగలేదు. 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 90,14,263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న యూనిట్ల (కుటుంబ సభ్యుల) సంఖ్య 2.83 కోట్లు. అంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండొంతుల మేర ప్రజలు వీటి పరిధిలో ఉన్నారు. ఇక రేషన్ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 48.86 లక్షల కార్డులు, అంత్యోదయ అన్నయోజన పథకం (ఏఏవై) కింద 5.62 లక్షల కార్డులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ భరిస్తూ ఇచ్చిన ఆహార భద్రత కార్డులు (ఎఫ్ఎస్సీ) 35.66 లక్షల మేర ఉన్నాయి. ఇందులో 5,211 కార్డులు అన్నపూర్ణ పథకం కింద వినియోగంలో ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద కార్డుకు 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తారు. ఏఏవై, అన్నపూర్ణ మినహా మిగతా రేషన్ కార్డులపై ప్రతినెలా కుటుంబంలోని ఒక్కొక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కరోనా ప్రబలిన నేపథ్యంలో 2021 నుంచి ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు గత ఎన్నికల ముందు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లుగానే.. ఈసారి కూడా అవకాశం ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూన్ నుంచే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని పౌర సరఫరాల శాఖ తోసిపుచ్చింది. కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ‘సాక్షి’కి స్పష్టం చేసింది. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
‘స్మార్ట్’గా వేటు!
- కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు - ప్రజాసాధికార సర్వే ప్రభావం - జిల్లాలో 3,700 కార్డుల తొలగింపు అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే (స్మార్ట్ పల్స్) విషయంలో పేదలు భయపడినట్లే జరుగుతోంది. నాలుగు చక్రాల వాహనం, సొంత ఇల్లు... ఇలా వివిధ కారణాలతో కార్డుల తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా మంజూరైన బీపీఎల్ కార్డులపై తొలి దశలో ‘స్మార్ట్’గా వేటువేసింది. కొత్త కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసింది. లబ్ధిదారుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి అర్హత లేదంటూ తొలగించింది. దీంతో కార్డు వచ్చిన ఆనందం లబ్ధిదారుల్లో అంతలోనే ఆవిరైపోయింది. 3,700 కార్డుల రద్దు జిల్లాకు కొత్తగా 95 వేల రేషన్ కార్డుల మంజూరయ్యాయి. నాల్గో విడత జన్మభూమిలో 72,531 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలినవి లబ్ధిదారులు స్వయంగా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకున్నారు. కొత్తగా మంజూరైన వాటిలో 3,700 కార్డులను పూర్తిగా రద్దు చేశారు. కార్డులు పొందిన వారికి సంబం«ధించిన ఆధార్ వివరాలను ప్రజాసాధికార సర్వే వివరాలతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు అంచెల పరిశీలన చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనం ఉందంటూ కొందరిని, పరిమితికి మించి సొంత ఇల్లు ఉందని మరికొందరిని.. ఇలా వివిధ కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ కార్డులను రద్దు చేసింది. ఇదే క్రమంలో మున్ముందు మరిన్ని కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ‘ఉపాధి’ కోసం పెట్టుకుంటే.. జిల్లాలో పలువురు వ్యాన్లు, టాటా సుమోలు, జీపులు వంటి నాలుగు చక్రాల వాహనాలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, కనగానపల్లి, తగరకుంట, గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, రాయదుర్గం.. ఇలా పలు ప్రాంతాల్లో పేద వర్గాలకు చెందిన నిరుద్యోగులు నాలుగు చక్రాల వాహనాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో రుణం పొంది వాహనాలు కొనుగోలు చేశారు. సొంతంగా నడుపుతూ.. తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి వారికి కార్డులు రద్దు చేయడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. – ఓ.నల్లప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్షేమ పథకాలకు పేదలను దూరం చేసేందుకే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం నిర్వహించిందని తొలి నుంచి చెబుతున్నాం. సర్వే వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేసి కార్డులు తొలగిస్తారని జనం భయపడినట్లే ఇప్పుడు జరుగుతోంది. జిల్లాలో వేలాది మంది పేద నిరుద్యోగ యువకులు అప్పులు చేసి.. నాలుగు చక్రాల వాహనాలు కొన్నారు. వీటి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వీరిని ప్రోత్సహించాల్సింది పోయి కార్డులు తొలగించడం అన్యాయం. -
జన్మభూమిని బహిష్కరిస్తా..!
కంచిలి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ గ్రామ సభలను బహిష్కరించనున్నట్టు కంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు ఇప్పిలి లోలాక్షి చెప్పారు. ఆమె బుధవారం మధ్యాహ్నం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల ఎంపిక ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. కొన్ని నెలలుగా ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రెవెన్యూ యంత్రాంగం అర్హులైన లబ్ధిదారుల జాబితాను అనర్హులుగా పేర్కొంటూ జాబితాను రూపొందించారని తెలిపారు. జన్మభూమి కమిటీలు వారికి నచ్చిన వారికే కార్డులు కేటాయించారని అలాంటప్పుడు అధికార యంత్రాంగం పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఎన్నో నెలలుగా అధికార యంత్రాంగం కసరత్తుపడి తయారు చేసిన జాబితాకి అర్ధం లేకుండా పోయిందని వాపోయారు. మండలంలో అర్హులైన 348 మందికి కొత్తరేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీవారు అడ్డుకున్నారని, ఆ జాబితాను కూడా జిల్లా ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు. ఈ విషయమై ఈ నెల 16వ తేదీన జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగానికి లేఖలు రాయడంతోపాటు తమ పరిస్థితిని పత్రికల ద్వారా వెల్లడించామని తెలిపారు. ఒక మహిళా ఎంపీపీని అయిన తాను ప్రజల కోసం నిరసన దీక్ష చేశానని, ఇంకా అన్యాయం చేస్తున్నారని, చివరి వరకు పోరాట పటిమతో ముందుకెళతానని, విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాను నిరసన దీక్ష చేసినప్పుడు, టెక్కలి ఆర్డీఓ వచ్చి కొత్తరేషన్‌కార్డులను పూర్తిగా పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ, అవేవీ దిగువస్థాయిలో అమలుకాలేదన్నారు. ఏకపక్షంగా కొత్తరేషన్ కార్డుల ఎంపిక జరిగినందుకు నిరసనగా తాను ఈ జన్మభూమి కార్యక్రమ గ్రామసభలను బహిష్కరిస్తున్నానని తెలిపారు. -
ఉన్నవి పీకేశారు... కొత్తవి ఇవ్వలేదు
శ్రీకాకుళం పాతబస్టాండ్ :పాతరోజులు గుర్తుకొస్తున్నాయి.. కొత్త రేషన్‌కార్డు కావాలంటే ఒకరి కార్డు రద్దు చేయాలన్నది నాడు బాబు హయాంలో ఉన్న కండిషన్... ఇప్పుడూ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. గడచిన బాబు ఏడాది పాలనలో పాత రేషన్‌కార్డులు పరిశీలన పేరుతో తొలగించారు. కొత్తవాటి కోసం అర్జీలు పెరుగుతున్నా మంజూరు చేసిన పాపాన పోలేదు. ప్రజలు నిరంతరం మీ సేవలోనూ, తహశీల్దారు కార్యాలయాల్లోనూ, గ్రామాలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు, ఆధికారులకు అర్జీలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే వడబోత పేరుతో జిల్లాలో దాదాపు 32వేల కార్డులను అనర్హత పేరుతో తొలగించేసిన సర్కారు వాటి పునరుద్ధరణకు సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో పిల్లల ఉచిత విద్య, ఉపకార వేతనాలు, సంక్షేమ రుణాలు వంటివాటికి నోచుకోలేకపోతున్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరిగిన తొలివిడత జన్మభూమి కార్యక్రమంలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వేలాది మంది కొత్త కార్డుల కోసం దర ఖాస్తుచేసుకున్నారు. అంతే కాకుండా నేరుగా తహశీల్దారు కార్యాలయానికి ఇచ్చినవారూ ఉన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 52,376 మంది కొత్త రేషన్ కార్డులకోసం కుటుంబాలతో కూడిన ఫొటోలు, ఆధార్ కార్డులు, ఓటరు కార్డు ఇతర ఆధారాలతో దరఖాస్తుచేసుకున్నారు. అవన్నీ తహశీల్దారు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. వీటిలో కొన్ని పరిశీలనలో ఉండగా, మరికొన్ని అన్లైన్ దశలో ఉన్నాయి. ఈ ప్రక్రియకు ముందు ఈ దరఖాస్తులను ఆయా గ్రామాల్లోగల జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదిస్తేనే కొత్తకార్డు కోసం అన్లైన్లో సిపార్సు చేస్తారు. కొత్త రేషన్ కార్డులకు కూడా జనాబా ప్రాతిపతిక అని నెపంతో ఆర్హులకు కూడా కోత పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇక ‘భద్రతా కార్డు’..!
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. అయితే రేషన్ కార్డు అనే పేరుకు బదులు ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ అని కొత్తగా పేరు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ఇక ‘రేషన్ కార్డు’ లింకు తెగిపోనుంది. ఈ కార్డు స్థానంలో ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ రానుంది. ఇది కేవలం రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకు బదులుగా ‘కుటుంబ అహార భద్రత కార్డు’ తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ కానుంది. ఇందులో భాగంగానే అర్హులైన ప్రజలందరికీ ‘ఆహార భద్రత కార్డు’ (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఇచ్చేందుకు ఈ నెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతోపాటు అర్హులైన వారికి పింఛన్లు, కుల, ఆదాయ, విద్యార్థులకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈ నెల 7న హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ తగిన సూచనలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాకు మార్గదర్శకాలు అందాయి. ఇందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ‘భద్రత కార్డు’ ప్రక్రియ ఇలా... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డు’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ కార్డు కోసం ప్రజలు గ్రామాల్లోని వీఆర్వోలకు, లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరిని ఈ ప్రక్రియ గ్రామ ఇన్‌చార్జీలుగా నియమించారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున మొత్తం 1732 మంది అధికారులు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నెల 15 వరకు ‘భద్రతా కార్డు’ దరఖాస్తులతో పాటు, పింఛన్లు, ఇతర తహశీల్దార్ ద్వారా జారీ చేయబడే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారందరూ ఆహార భద్రతా కార్డులకు తెల్లకాగితంపై తమ వివరాలను రాసి సంబంధిత అధికారులు అందించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. వీఆర్వోలకు, కార్యదర్శులకు అందించిన దరఖాస్తులన్నీ గ్రామాల వారీగా విభజించి ఆహార భద్రతా కార్డు, పింఛన్లు, సర్టిఫికెట్ల దరఖాస్తులను వేరు చేస్తారు. ఇలా గ్రామాల వారీగా విభజించిన దరఖాస్తులను ఈ నెల 15 నుంచి పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారుల చొప్పున పర్యవేక్షించేందుకు నియమించారు. వీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా సంబంధిత గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్న తీరు.. అర్హులా.. కాదా.. అనేది తేల్చుతారు. ఒక వేళ ‘బోగస్’గా కూడా ఆహార భద్రతా కార్డు జారీకి అర్హులని గుర్తిస్తే ఈ ఆరుగురు అధికారులే బాధ్యులవుతారు. జిల్లా వ్యాప్తంగా 52 మండలాల్లో మండలానికి ఆరుగురు అధికారులు చొప్పున మొత్తం 312 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ముఖ్యులుగా ఉంటారు. ఇప్పటికే 85 వేల దరఖాస్తులు జిల్లాలో ప్రస్తుతం 6,72,288 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉండడం.. పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఇందులో 81,700 రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించారు. అయితే.. గతంలో చేపట్టిన రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 85 వేల మంది తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఈ దరఖాస్తులు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,78,613 కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 8,28,042 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఈపీడీఎస్ విధానం ద్వారా సరుకులు కేటాయిస్తున్నారు. కొత్త కార్డులు ఇచ్చేందుకు... - ఎం.జగన్మోహన్, కలెక్టర్ రేషన్ కార్డులకు బదులు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆహార భద్రతా కార్డును జారీ చేయనుంది. ఇందుకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మొదట గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. 15 నుంచి ప్రతి దరఖాస్తును మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. అర్హులందరికీ ‘ఆహార భద్రత కార్డు’లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తాం. -
త్వరలో కొత్త రేషన్ కార్డులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్త రేషన్ కార్డులకోసం ఏళ్లతరబడి నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. అతి త్వరలో అర్హులందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల వివరాలతో నివేదికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచనప్రాయంగా ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలతో జాబితా తయారు చేసేందుకు ఉపక్రమించారు. ‘సర్వే’ వివరాలే కీలకం.. అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. నిబంధనలు మాత్రం మరింత కఠినతరం చేసింది. గతంలో మాధిరిగా దరఖాస్తుల ప్రక్రియలో కాకుండా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. సర్వే ప్రక్రియలో రేషన్ కార్డు వివరాలను సేకరించనప్పటికీ.. కుటుంబ సభ్యుల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి అంచనాలు వేసేలా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. ఈనెల పదోతేదీనాటితో సర్వేకు సంబంధించి కంప్యూటరీకరణ సైతం పూర్తయింది. దీంతో సర్కారు తాజా నిర్ణయంతో వివరాల సేకరణకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలు పెట్టింది. జిల్లాలో ప్రస్తుతం 10.87 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం చేయని కార్డులను బోగస్‌గా పరిగణిస్తూ వాటిని రద్దు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇవి మిన హాయిస్తే ప్రస్తుతం జిల్లాలో 9.32 లక్షల రేషన్ కార్డులున్నట్లు లెక్క. అర్హుల సంఖ్య పెరిగే అవకాశం... 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 52.93 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఇందులో 12 లక్షల కుటుంబాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 4 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ఆ గణాంకాలు స్పష్టం చేశాయి. అయితే ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో ఈ గణాంకాలకు రెట్టింపు స్థాయిలో కుటుంబాలు ఉన్నట్లు తేలింది. సర్వే వివరాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.4 లక్షల కుటుంబాలున్నాయి. ఈక్రమంలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అర్హుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
బోగస్ కార్డులకు చెక్
- మళ్లీ ఏరివేత - కొత్త కార్డుల జారీ - కుటుంబాలకు మించి కార్డులు - 2.13 లక్షలు బోగసేనని అనుమానం కుటుంబాలు 9,76,022 రేషన్‌కార్డులు 11,88,974 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త కార్డులు ముద్రించి ఇవ్వటంతో పాటు పనిలోపనిగా బోగస్ కార్డులు ఏరివేయాలని ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బోగస్ కార్డుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు చేసిన జిల్లా పౌరసరఫరాల విభాగానికి చేతినిండా పని దొరికినట్లయింది. బోగస్ కార్డులతో ముడిపడి ఉన్న రేషన్ డీలర్లు, లబ్ధిదారులకు దడ పుట్టినట్లయింది. మన జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ప్రక్రియ సంబంధిత అధికారులకు కత్తిమీద సాములా మారనుంది. ఇప్పటికే జిల్లాలో మండలాల వారీగా బోగస్ కార్డుల వివరాలపై పౌర సరఫరాల విభాగం పక్కాగా సమాచారం సేకరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఉన్న కుటుంబాలకు రేషన్ కార్డుల సంఖ్య పొంతన కుదరటం లేదని తేల్చేసింది. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. శనివారం సీఎం సమక్షంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలోనూ జిల్లాల వారీగా బోగస్ కార్డులెన్ని ఉన్నాయనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో 9,76,022 కుటుంబాలు ఉండగా, రేషన్‌కార్డులు 11,88,974 ఉన్నాయి. వీటిలో 8.56 లక్షల తెల్లకార్డులు, రచ్చబండ సమయంలో జారీ చేసినవి 1.10 లక్షల తాత్కాలిక కార్డులు, 74,424 అంత్యోదయ అన్న యోజన కార్డులున్నాయి. వీటికి తోడు కొత్తగా రేషన్‌కార్డులు కోరుతూ మరో 88 వేల దరఖాస్తులు జిల్లాలోనే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా కుటుంబాల సంఖ్య కంటే రెండు లక్షలకు పైగా బోగస్ కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. మండలాల వారీగా సమాచారం సేకరించారు. కానీ.. వీటిలో ఏవి అసలు.. ఏవీ నకిలీవో గుర్తించటం సులభ సాధ్యం కాదని.. పక్కాగా సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త రేషన్ కార్డుకు ఓకే
సాక్షి, చెన్నై: మైలాపూర్‌లో పౌరసరఫరాల విభాగం కార్యాలయాన్ని మంత్రి కామరాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సరుకుల నిల్వ, పంపిణీ గురించి ఆరా తీశారు. కార్డుదారులను ప్రశ్నించారు. ఏదేని సమస్యలు ఉంటే వినతి పత్రంగా సమర్పించాలని సూచించారు. కాసేపు అక్కడే ఉండి మరీ వినతి పత్రాల్ని ఆయన స్వీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేషన్ కార్డుల్లో ఏదేని సవరణలు, చిరునామాల మార్పు వంటి ప్రక్రియలు త్వరితగతిన ముగించి, లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఆలస్యమయ్యే కొద్దీ కార్డు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కుటుంబ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. తొమ్మిది లక్షల మందికి త్వరలో కార్డులు పంపిణీ చేయనున్నామన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ విచారించి, పకడ్బందీ ఏర్పాట్లతో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు 60 రోజుల్లోపు మంజూరు చేయనున్నట్లు వివరించారు. 8,82,740 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారని, మరి కొద్ది రోజుల్లో వీరికి కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఫిర్యాదులు: చెన్నైలోని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుని ఉన్నామన్నారు. నగరంలో 1,723 రేషన్ దుకాణాలు ఉన్నాయని వివరించారు. నగరంలో 21,46,627 రేషన్ కార్డుదారులు ఉన్నారని గుర్తు చేశారు. వీరికి ఏదేని సమస్యలు తలెత్తినా, రేషన్ సరకు లు సక్రమంగా అందకున్నా 9445464748, 729900 8002 నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అంబత్తూరు, థౌజండ్‌లైట్స్, సైదా పేట ల్లోని కార్యాలయాల్ని రూ.2.5 కోట్ల వ్యయం తో ఆధునీకరించినట్లు వివరించారు. ప్రతినెలా మొదటి శని వారం, రెండో శుక్రవారం ఫిర్యాదుల స్వీకరణ శిబి రాల్ని నిర్వహిస్తున్నామన్నారు. కొన్నేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు చేయనందున, మంత్రి చేసిన ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం నెలకొంది. -
కొత్త రేషన్ కార్డులతో కాసుల వర్షం
=పాత కార్డులపై యూనిట్లు తగ్గించకుండా జారీ = రేషన్ డీలర్లకు మిగిలిపోతున్న బియ్యం యలమంచిలి, న్యూస్‌లైన్ : పాత రేషన్ కార్డుల్లో యూనిట్లను తగ్గించకుండా కొత్త కార్డులను పంపిణీ చేయడంతో డీలర్ల పంట పండింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్క యూనిట్‌పై 4 కేజీల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 10,83,475 రేషన్ కార్డులుండగా గత నెలలో జరిగిన రచ్చబండలో 1,36,856 కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెలా 17 వేల టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. వాస్తవానికి ఏదైనా కుటుంబంలో పెళ్లయిన వ్యక్తికి కొత్త రేషన్ కార్డు జారీ చేయాలంటే ఆ ఇంటి పాత రేషన్ కార్డులో యూనిట్లను తగ్గించవలసి ఉంది. ఆ మేరకు పంపిణీ చేయాల్సిన బియ్యం కోటా తగ్గుతుంది. కానీ పాత కార్డుల్లో యూనిట్లను తగ్గించకుండా కొత్త కార్డుల్ని జారీ చేసేందుకు డీలర్లే రెవెన్యూ యంత్రాంగానికి మామూళ్లు ఎర వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రచ్చబండ రేషన్ కార్డుల పంపిణీతో పాత కార్డుల్లో యూనిట్లను తగ్గించినట్టు వినియోగదారులను నమ్మిస్తున్నారు. దీనివల్ల ఒక్కొక్క డీలరుకు 2 నుంచి 3 క్వింటాళ్ల రాయితీ బియ్యం మిగులుతుందని అంచనా. యూనిట్ల తగ్గింపు సాధ్యమే పాత రేషన్ కార్డుల్లో యూనిట్ల తగ్గింపు సాధ్యమైనా రెవెన్యూ యంత్రాంగానికి రేషన్ డీలర్లకు ఉన్న అనుబంధంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కీ రిజిస్టర్ ఆధారంగానైనా పాత రేషన్ కార్డుల్లో యూనిట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ విధానాన్ని పలు రేషన్ దుకాణాల్లో మొక్కుబడిగా పూర్తి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.