Actress Prabhavathi Interesting Comments on Baby Movie - Sakshi
Sakshi News home page

Actress Prabhavathi: ‘బేబి ప్రభావతమ్మా’ అంటుంటే ఆనందంగా ఉంది

Jul 28 2023 2:05 PM | Updated on Jul 28 2023 2:13 PM

Actress Prabhavathi Talk About Baby Movie - Sakshi

ఇరవై రెండేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ‘బేబీ’సినిమాకు వచ్చినన్ని కాల్స్‌, ప్రశంసలు ఇంతవరకు రాలేదని అంటున్నారు నటి ప్రభావతి. ఆనందర్‌ దేవరకొండ, వైష్షవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో ఆనంద్‌ దేవరకొండ తల్లిగా  ప్రభావతి నటించారు. ఈ చిత్రంలో ఆమెది మూగ పాత్ర. హావభావాలతోనే అద్భుత నటన కనబరిచింది.  

ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అభినందించడం చూసినవాళ్ళల్లో ఆమెను ఎరుగనివారు "ఎవరీ ప్రభావతి?" అని ఆరాలు తీస్తున్నారు. "జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్, గోరింటాకు, సాహసం, అమరావతి, అనసూయ, ఏక్ మినీ ప్రేమ్ కథ, గరుడ వేగ, సీటీమార్, లవ్ యు రామ్" వంటి చిత్రాలతోనూ తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న ప్రభావతి... ఇప్పుడు అందరూ తనను "బేబి ప్రభావతమ్మా" అని పిలుస్తుంటే కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు అంటున్నారు. "బేబి" సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజులు చేస్తూ.. 'అమ్మ'గా వాళ్ళ గుండెల్లో చోటు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement