Netizens Trolls On Vaishnavi Chaitanya Brother Over Photo With Vijay Deverakonda And His Sister, Goes Viral - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya Brother Trolls: విజయ్‌తో ఫోటో.. వైష్ణవి తమ్ముడిపై ఎలాంటి కామెంట్లు చేశారంటే..

Published Tue, Aug 1 2023 9:52 AM | Last Updated on Tue, Aug 1 2023 10:13 AM

Vijay Deverakonda And Vaishnavi Chaitanya Brother Photo On Trolling - Sakshi

ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్‌ దేవరకొండ కూడా సొంత టాలెంట్‌తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం  నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు.  వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్‌గా మారాడు. అలాంటి 'లైగర్‌' పక్కన బేబి ఫేమ్‌ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్‌  ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.

(ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్)

బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్‌లోకి వచ్చారు. సినిమా సక్సెస్‌ అయ్యాక విజయ్‌ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది విజయ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్‌ అవుతూ స్టిల్‌ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్‌పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్‌కు మరింత దారి తీసింది.

(ఇదీ చదవండి: యంగ్‌ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు)

వైష్ణవి తమ్ముడి పైనా విజయ్‌ ఫ్యాన్స్‌ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్‌ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్‌ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్‌.. నీతో ఫోటో దిగేందుకు విజయ్‌, ఆనంద్‌లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్‌ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు  చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ ఫోటో వార్‌ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో  వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement