పూడూరు: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల కోసం జెండాను ఏర్పాటుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులను కాపాడే ప్రయత్నంలో ఓ ప్రధానోపాధ్యాయిని ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలోప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కలువ ప్రభావతి (40) మరణించారు.
పెద్ద ఉమ్మాంతాల్ గ్రామానికి చెందిన ప్రభావతి.. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకుగానూ ఆదివారం పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలోనే విద్యార్థులు కీర్తన, గణేష్, శివతేజ, మధుప్రియలు జెండా కర్రను జరుపుతుండగా, విద్యుధాఘాతానికి గురయ్యారు. వెంటనే స్పంఇంచిన ప్రభావతి.. విద్యార్థులను పక్కకునెట్టేసి.. ప్రమాదంలో చిచ్కుకుపోయారు. స్పృహకోల్పోయిన ఆమెను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రభావతి మరణించినట్లు వైద్యులు చెప్పారు.
పాఠశాలలో విషాదం: కరెంట్ షాక్ తగిలి హెచ్ఎం మృతి
Published Sun, Aug 14 2016 5:49 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement