రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రైతు మునీరుద్దీన్ శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లగా... అక్కడ విద్యుత్ సరఫరా లేదు. విద్యుత్ సిబ్బందికి చెప్పినా వెంటనే రారనే ఉద్దేశంతో మునీరుద్దీన్ తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ట్రాన్స్‌ఫారం దగ్గర విద్యుత్ సరఫరా కంట్రోలర్‌ను ఆఫ్ చేసి స్తంభంపైకి ఎక్కాడు. కానీ, అక్కడ మరో విద్యుత్ ట్రాన్స్‌ఫారం నుంచి లైన్ వెళ్లడంతో ఆ తీగలను పట్టుకున్న వెంటనే మునీరుద్దీన్ షాక్‌కు గురై స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు.
విద్యుత్ స్తంభంపై ప్రాణాలు కోల్పోయిన రైతు
Published Fri, Jun 3 2016 10:37 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement