
సెల్ఫీ మోజులో పడి..
ముంబై: సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలు తీసింది. కాలేజీ విద్యార్థిని ప్రీతి శ్రీకృష్ణ భిసే (17) తన మిత్రులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం మెరైన్ డ్రైవ్ సముద్ర తీరానికి వచ్చింది. అప్పటికే సముద్రంలో హై టైడ్ కారణంగా పెద్ద పెద్ద అలలు వేగంగా ఒడ్డుకు వస్తున్నాయి. కాని, సముద్ర అలల మధ్య నిలబడి మిత్రులతో కలిసి సెల్ఫీ దిగాలని ప్రీతి భావించింది.
అలా ప్రెండ్స్‌తో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఓ భారీ అల రావడంతో ప్రీతి అదుపుతప్పి నీటిలో పడి, కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో వెంటనే మెరైన్ డ్రైవ్ పోలీసులకు సమాచారం అందించారు. గంటలపాటు గాలింపు చర్యలు సాగాయి. చివరికి రాత్రి సమయంలో ప్రీతి మృతదేహం లభించింది. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.