ముంబై: జాలి లేకుండా కొందరు యువకులు ఒక కొండ చిలువను హింసించి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఘటన బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. ముంబైలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా జోరుగా వానలు కురుస్తుండటంతో కొన్ని వన్యప్రాణులు వాటి స్థావరాలను వదిలి పొడి ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక కొండ చిలువలువ నీరు లేని ఒక ప్రాంతానికి వెళ్లాలనుకుంది. అలా వెళుతున్న క్రమంలో ఆ మూగజీవి కొందరు ఆకతాయిల కంటపడింది. వారు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు కాళ్లతో తన్ని, చేతులతో కొట్టి అది వాళ్లకు లొంగాక దానితో సెల్ఫీలు తీసుకున్నారు.
సెల్ఫీలు తీసుకున్న అనంతరం 8.5 అడుగుల కొండచిలువను ఓ సంచిలో పెట్టి దగ్గర్లోని అడవిలో వదిలేశారు. కొండచిలువను కొడుతున్నవీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ ఆ వీడియో ఆధారంగా అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: నాగుల పంచమి: కొండచిలువ కలకలం
Comments
Please login to add a commentAdd a comment