టెన్త్‌లో తప్పిన విద్యార్థులు వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నుంచి 12 రోజులు గడువు ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి తెలిపారు. గురువారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వేచి ఉండకుండా వెంటనే అడ్వాన్స్డ్‌సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టాలని సూచించారు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 ఫీజును డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తును హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌కు పంపించాలని సూచించారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 ఫీజు చలాన్ రూపంలోనే కట్టాలి. డీడీలను అంగీకరించరు. www.bsep.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమూనా పొందవచ్చు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 12 రోజుల గడువు
Published Fri, May 16 2014 1:57 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement
Advertisement