ఐసీపీఎస్, శిశుగృహలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Sat, Aug 20 2016 11:47 PM | Last Updated on Wed, Apr 3 2019 8:29 PM
హన్మకొండ చౌరస్తా : స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వరంగల్ కార్యాలయ పరిధిలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసేందుకు పలు ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 13, 2015 నాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల పైబడి 40 ఏళ్లలోపు వారై ఉండాలని, శిశుగృహలో ఖాళీగా ఉన్న సోషల్‌వర్కర్ పోస్టుకు జూన్ 13, 2015 నాటికి 25 నుంచి 40 ఏళ్ల వయసు కలి గి ఉండాలని, ఓసీలైతే 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు.
అర్హులైన వా రు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇవే పోస్టులకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్, ఔట్‌రీచ్ వర్కర్, సోషల్‌వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆయా పోస్టులకు ఎంఎస్‌డబ్ల్యూ, బీకాం ఫైనాన్స్, బ్యాచ్‌లర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసి, గత అనుభవం ఉండాలని వివరించారు. పూర్తి వివరాలకు ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా స్త్ర్రీ, శిశు అభివృద్ధి సంస్థ వరంగల్ కార్యాలయం, ఇంటి నంబర్ 1–7–967, రాజ్‌హోటల్ ఎదురుగా, ఏకశిల సొసైటీ కాలనీ, హంటర్‌రోడ్, హన్మకొండ, 506001లో సంప్రదించవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement