పోస్టుమాన్‌ ఉద్యోగ దరఖాస్తుల ఆహ్వానం | applications for postman job | Sakshi
Sakshi News home page

పోస్టుమాన్‌ ఉద్యోగ దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Aug 9 2016 11:34 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

applications for postman job

అమలాపురం : ఆంధ్రప్రదేశ్‌ తపాలాశాఖ సర్కిల్‌ ఆదేశానుసారం పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో పోస్టుమాన్‌ ఉద్యోగాల భర్తీ ప్రారంభించారని అమలాపురం డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టుమాస్టర్‌ కె.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 133 ఉద్యోగాలు ఉన్నాయని, వీటిలో డివిజన్‌కు మూడు చొప్పున ఖాళీ ఉన్నాయని తెలిపారు. కనీస విద్యా అర్హత ఎస్‌ఎస్‌సీ/ మెట్రిక్యులేషన్‌ ఉండాలన్నారు. దరఖాస్తు రూ.100, పరీక్షా రుసుం రూ.400 అని, అమలాపురం హెడ్‌పోస్టు ఆఫీస్‌లో చెల్లించాలన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా కూడా స్వీకరిస్తామని, వచ్చే నెల 4వ తేదీలోగా పంపాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement