
రోజా సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎమ్మెల్యే రోజా రాసిన లేఖను స్పీకర్‌కు పంపామని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ లేఖ తమకు అందలేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం ఆ లేఖను కోర్టులోనే ఇప్పించింది. లేఖను సంబంధిత శాఖలకు పంపించి, తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.