సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వం నియమించిన సాధికార మిత్రపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా, పంచాయతీరాజ్ స్పూర్థికి వ్యతిరేకంగా సాధికార మిత్రలను నియమించారని గతంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం ధర్మాసన విచారించింది. దీనిపై పిటిషన్‌ర్ వాదనలు విన్న కోర్టు దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సొమ్ముతో అధికారులను నియమించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు.
ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రలను నియమించి ఆయా కుటుంబాలు ఏ పార్టీ వైపు ఉన్నారో తెలుసుకుని అధికార పార్టీకి సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. సాధికార మిత్రలకు వేతనం ఇవ్వడం లేదంటూనే వెయ్యి కోట్ల రూపాయలతో స్మార్ట్ ఫోన్లను ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని విమర్శించారు. తమ వాదనతో సుప్రీంకోర్టు ఏకభవించలేదని.. దీనిపై మరోసారి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment