పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య! | Couple commits suicide in police custody in Ranchi | Sakshi
Sakshi News home page

పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య!

Published Tue, Mar 15 2016 8:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య! - Sakshi

పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య!

రాంచి: జార్ఖండ్ లోని  పోలీసుల అదుపులో  ప్రేమికుల జంట ఆత్మహత్య కలకలం రేపింది.   పోలీసుల అదుపులో ఉన్న ముస్లిం యువకుడు, హిందూ యువతి అనుమానాస్పద  స్థితిలో మరణించారు, రాంచీలోని అర్గోరా  పోలీస్ స్టేషన్ లో మంగళవారం  ఘటన  చోటు చేసుకుంది.  ఈ  జంట ఆత్మహత్యలపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

గొడ్డాజిల్లాకు చెందిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ గఫర్, హిందూ మతానికి చెందిన అమ్మాయి (15)  నెలన్నర క్రితం పారిపోయి మతాంతర వివాహం చేసుకున్నారు. దీంతో   తమ కూతురుని కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడంటూ అమ్మాయి తరపు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే  అంతకుముందే గఫర్ కు వివాహమైనట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో సోమవారం  ఈ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో వుంచారు.  ఏం జరిగిందో తెలియదుకానీ తెల్లవారేసరికి ఇద్దరూ శవాలై తేలారు.  మృతదేహాలను పోస్ట్మార్టం  నిమిత్తం తరలించిన అధికారులు విచారణ  చేపట్టారు.

అటు గుర్తు తెలియని విషపదార్థం సేవించడం వల్లనే చనిపోయి వుంటారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని రాంచీ ఏఎస్పీ  కులదీప్ ద్వివేది తెలిపారు.    విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణకు ఆదేశించామన్నారు.  ఈ ఘటనలో  ఒక మహిళా ఏఎస్ఐ సహా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని అధికారి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement