వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. వీరు ఇరువురు గురువారం ...
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. వీరు ఇరువురు గురువారం క్షమాపణ చెప్పటంపై వారిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రకటించారు. కాగా తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప త జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
అలాగే సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే నిన్న ఈ ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఉదయం వారిపై సస్పెన్షన్ తొలగింది.