sivaprasad reddy
-
భయానక వాతావరణం సృష్టించేందుకే..
సాక్షి టాస్‌్కఫోర్స్: వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్ కాంట్రాక్ట్ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్‌చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ కాల్చివేత
వేముల: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీసును శనివారం రాత్రి కాల్చివేశారు. టీడీపీ వారు తన ఆఫీసును కాల్చివేసినట్లు కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్‌లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపివేయాలని, తమకు అప్పజెప్పాలని ఒత్తిడి తెచ్చారaన్నారు.రెండు కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ, నాలుగు కిలోమీటర్లూ తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసును కాల్చివేశారని తెలిపారు. సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మండల పరిషత్ సమావేశంలో టీడీపీ బరితెగింపు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రొటోకాల్ ప్రకారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డినే అడ్డుకొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి రసాభాస చేశారు. శుక్రవారం దొనకొండలో మండల పరిషత్ సర్వసభ్య ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. అధికారుల ఆహ్వానం మేరకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అక్కడికి వచ్చారు.పథకం ప్రకారం ముందుగానే అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలు గేట్లు మూసివేసి వారిద్దరినీ అడ్డుకున్నారు. ఎంపీడీవో గేటువద్దకు వచ్చి వారిని లోపలికి పంపాలని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మూకలు ఆయన్ని బెదిరించి లోపలకు పంపేశారు. బూచేపల్లిపై దాడి చేయడానికి టీడీపీ మూకలు రాళ్లు కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. ‘మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మీకేం పని’ అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించారు. ఉద్రిక్తత సృష్టించారు. గంటన్నరకుపైగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను గేటు బయటే నిలబెట్టారు. సీఐ సుబ్బారావు పోలీసు సిబ్బందితో వచ్చి వారిద్దరినీ లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను సైతం అసభ్య పదజాలంతో దూషించారు. జై చంద్రబాబు అని నినాదాలు చేస్తూ కార్యాలయంలో రాళ్లు పెట్టుకుని హంగామా సృష్టించారు. సీఐ సుబ్బారావు పోలీస్ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను లోనికి తీసుకెళ్లారు. వారు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని సత్కరించారు. -
చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ, డీఎస్పీ
ప్రొద్దుటూరు టౌన్: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారి, ఆర్డీఓ వినాయకం, డీఎస్పీ భక్తవత్సలం పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లకు సీట్ల కేటాయింపును పరిశీలించారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతోపాటు ఎక్స్అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్సీపీ గ్యాలరీని, టీడీపీ తరపున గెలిచిన 22 మందికి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒకే బెంచీలో ఇద్దరు కూర్చోడానికి ఇబ్బంది కరంగా ఉంటుందని కొందరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఒక్కో బెంచీని ఒక్కరికి ఏర్పాటు చేయాలని కమిషనర్ వెంకటశివారెడ్డికి సూచించారు. కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. డీఈ రామచంద్రప్రభు, టౌన్‌ప్లానింగ్ అధికారి శివగురుమూర్తిలకు ఎన్నికల అధికారులు పలు సూచనలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 3వ గ్యాలరీ ఏర్పాటుకు అనుమతి నో 3వ గ్యాలరీ ఏర్పాటు చేయాలని కొందరు కౌన్సిలర్లు ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు, టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు మూడో గ్యాలరీలో కూర్చుంటామని కోరడంతో దానిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. -
ఇద్దరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
-
ఇద్దరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
► కెమెరాలకు అడ్డుగా ఉన్నారని సస్పెన్షన్ ► వెంటనే సభ శుక్రవారానికి వాయిదా కెమెరాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)లను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు కలగజేసుకుని, ప్రతిపక్ష నాయకులకు ఉన్నది కమ్యూనికేషన్ సమస్య కాదని, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చర్చ ప్రారంభించమన్నప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు చర్చకు అంగీకరించడం లేదన్నారు. సభ్యులను కావాలని రెచ్చగొట్టి వెల్‌లోకి పంపించడం దౌర్భాగ్యస్థితి అని విమర్శించారు. కెమెరాలకు అడ్డు పడుతున్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. దాంతో సభ్యులపై చర్య తీసుకోడానికి తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడికి స్పీకర్ సూచించారు. శాసనసభలో జరిగే ప్రతి విషయం కెమెరాల ద్వారా ప్రజలకు అందాలని, దానికి సభ్యులు అడ్డుపడుతున్నారని యనమల అన్నారు. కెమెరాలకు, సభకు అడ్డుపడటం సంప్రదాయాలకు వ్యతిరేకమని, కెమెరాలకు అడ్డుపడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)లను సస్పెండ్ చేయాలని కోరుతున్నానన్నారు. దీంతో స్పీకర్ వారిద్దరినీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రకటించి, వారిద్దరూ సభను వదిలి వెళ్లిపోవాలని సూచించారు. -
శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. వీరు ఇరువురు గురువారం క్షమాపణ చెప్పటంపై వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రకటించారు. కాగా తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప త జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే నిన్న ఈ ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఉదయం వారిపై సస్పెన్షన్ తొలగింది. -
ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్
-
ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభనుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగినంత కాలం.. వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు అడ్డం తగలడంతో పాటు స్పీకర్ మీద దాడిచేశారని, స్పీకర్ ముందున్న మైకులు విరిచేసి అసెంబ్లీ ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు. వారి సస్పెన్షన్ తీర్మానాన్ని అధికారపక్షం తక్షణం ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెల్‌లోకి దూసుకొచ్చి 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ, స్పీకర్నే అగౌరవపరిస్తే సభ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దళితుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. -
బాబూ.. రెండు నాల్కల ధోరణి విడనాడు
దర్శి (తాళ్లూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం శోచనీయమని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన చేపట్టిన నిరహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర డీఈడీ కళాశాల విద్యార్థినులు వచ్చిన ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. పలు రాజకీయ పార్టీల దోబూచులాటతో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే తాము నిరుద్యోగులమవుతామని డీఈడీ కళాశాల విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని ఆయన చెప్పిన మాటలు తమకు ధైర్యాన్నిచ్చాయని విద్యార్థిని రాజేశ్వరి చెప్పారు. సంతకాల సేకరణ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ దీక్ష శిబిరం వద్ద సంతకాలు సేకరించారు. శివప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, చీమకుర్తి మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మలు తొలి సంతకాలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీటీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రం రెండుగా విడిపోతోందని దుయ్యబట్టారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలంగాణ ప్రక్రియ ఆగేదన్నారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు మండలాల పార్టీ కన్వీన ర్లు వెన్నపూస వెంకటరెడ్డి, మారం వెంకటరెడ్డి, సుంకర బ్రహ్మానందరెడ్డి, నారపరెడ్డి, రావులపల్లి పుల్లయ్య, నాయకులు పి.ధనలక్ష్మి, అనిల్‌కుమార్‌రెడ్డి, అంజిరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, గంగిరెడ్డి యలమందారెడ్డి, వెంకటేశ్వర్లు, దుర్గారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, వెంకటప్పారెడ్డి, అన్నపురెడ్డి భిక్షాల్రెడ్డి, సుబ్బారావు, పులి ప్రసాద్‌రెడ్డి, డీఈడీ కళాశాల డెరైక్టర్ డీవీ కృష్ణారెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సమైక్యం కోసం కృషి చేస్తున్నది వైఎస్సార్సీపీయే: బూచేపల్లి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు నిజాయితీగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పొత్తుల కోసం టీడీపీ పైరవీలు చేస్తోందని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మరోసారి ఢిల్లీలో బేరం పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఒక దివాలాకోరు అని, తెలంగాణ నోట్ వచ్చే ఈ సమయంలోనైనా చంద్రబాబు మనసు మారాలని శివప్రసాద్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు యాత్రల్లో ఆత్మగౌరవం లేదని, ఉన్నదంతా ఆత్మవంచనేనని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.