ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్ | two ysrcp mlas suspended from ap assembly | Sakshi
Sakshi News home page

ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్

Published Tue, Aug 26 2014 12:23 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్ - Sakshi

ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభనుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగినంత కాలం.. వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు అడ్డం తగలడంతో పాటు స్పీకర్ మీద దాడిచేశారని, స్పీకర్ ముందున్న మైకులు విరిచేసి అసెంబ్లీ ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు.

వారి సస్పెన్షన్ తీర్మానాన్ని అధికారపక్షం తక్షణం ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెల్లోకి దూసుకొచ్చి 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ, స్పీకర్నే అగౌరవపరిస్తే సభ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దళితుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement