mani gandhi
-
టీడీపీకి షాక్ మీద షాక్‌లు!
కడప వైఎస్సార్ సర్కిల్/ఎమ్మిగనూరు టౌన్/రేణిగుంట(చిత్తూరు): ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రోజు రోజుకు ఆ పార్టీ నుంచి ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూ ఉంది. తాజాగా శనివారం కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సాయి ప్రతాప్ టీడీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా కార్యదర్శి మురళీధర్‌నాయుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి దేవ స్థానం మాజీ చైర్మన్, టీడీపీ కీలక నేత కొం డుగారి శ్రీరామ్మూర్తి టీడీపీని వీడి వైఎస్సా ర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతోపాటు టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా చేరారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షం లో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. అవమానించారు: సాయిప్రతాప్ టీడీపీలో ఉన్న మూడు సంవత్సరాల కాలం అజ్ఞాతంగా, అరణ్యవాసంగా గడిపానని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజంపేటకు ఇన్చార్జ్గా ఉండమని చెప్పి, ఘోరంగా అవమానించారని చెప్పారు. అమరావతికి రమ్మని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావు మొహం తిప్పుకుని చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధ కలిగించిందన్నారు. టీడీపీలో డబ్బులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. సొంత ఇంటికి వచ్చా: మణిగాంధీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీకి వెళ్లి పెద్ద తప్పు చేశానని కర్నూలు జిల్లా, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు. -
టీడీపీకి మరో షాక్.. వైఎస్సార్సీపీలోకి మణిగాంధీ
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మణిగాంధీకి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. కాగా ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్యనాయకులు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసెందే. టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు పట్ల పలువురు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫారుఖ్ వర్గాన్ని భూమా బ్రహ్మానంద రెడ్డి పట్టించుకోవడంలేదని ఆ వర్గ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం దశాబ్దాలుగా సేవచేస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి కనీస పిలుపు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మండల పరిధిలోని 15 గ్రామాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 15గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సమావేశమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు నచ్చకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు వాళ్ల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో పశ్చాత్తాపం
-
మణిగాంధీ రాజీనామాకు డిమాండ్
కోడుమూరు : సొంత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో చేరి కార్యకర్తల మధ్య విభేదాలు పెంచుతున్న ఎమ్మెల్యే మణిగాంధీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ కోడుమూరు మండల కన్వీనర్ కేఈ మల్లిఖార్జునగౌడ్ డిమాండ్ చేశాడు. కోడుమూరులో ఆదివారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో కార్యకర్తలను ఉద్దేశించి మల్లికార్జున గౌడ్ మాట్లాడారు. మణిగాంధీ రాజీనామా చేసి ఏ పార్టీ నుంచి పోటీచేసినా డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ కల్గిన తెలుగుదేశం పార్టీ నియమనిబంధనలు పాటించకుండా ఎమ్మెల్యే మణిగాంధీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను వదిలేసి ఇతర పార్టీ నేతలకు కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకుంటున్నాడన్నారు. -
ఎమ్మెల్యేకు రూ.8 కోట్ల ఆఫర్
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు ఏకంగా రూ. 8 కోట్ల ఆఫర్ మధ్యవర్తులుగా అధికార పార్టీ నేతలు టీడీపీ రాజకీయాలను ఈసడించుకుంటున్న ప్రజలు సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టిదన్నుగా ఉన్న కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల కొనుగోలుకు అధికార పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కూడా కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారీగా ప్యాకేజీని ఆఫర్ చేసి మరీ టీడీపీలోకి చేర్చుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోడుమూరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అలాంటి చోట గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన మణిగాంధీకి ప్రజలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం.. అధినేత వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో గెలిచిన కోడుమూర ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక.. కేవలం నన్ను చూసే జనం ఓట్లేశారని చెప్పుకోవడంపై కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. మధ్యవర్తులుగా టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొద్దిమంది ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి మధ్యవర్తులు (దళారులు)గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలానా ఎమ్మెల్యేకు రూ. 9 కోట్లు ఇస్తే వస్తారంటూ... ఎమ్మెల్యేకు రూ 5-6 కోట్లు చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు కోట్లు ఇచ్చేందుకు ఒప్పించిన ఓ నేత డీల్ కుదిర్చినందుకు తాను రూ. 3 కోట్లు దక్కించుకోవాలని ఎత్తుగడ వేశాడు. అయితే, ఈ కథ తెలిసి సదరు ఎమ్మెల్యే కాస్తా.. నేను పార్టీ మారను అంటూ మొండికేయడంతో కథ అడ్డం తిరిగినట్లు సమాచారం. దీంతో సదరు నేతను ఆయన సోదరుడు, మాజీ మంత్రి మందలించినట్లు తెలిసింది. ఇలాంటి చోటా కక్కుర్తి పడటం సరికాదని హెచ్చరించి.. సదరు ఎమ్మెల్యేతో మాట్లాడి రూ. 6 కోట్లకు ఒప్పందం కుదుర్చినట్లు సమాచారం. ఈ ముడుపుల వ్యవహారం అంతా గుంటూరుకు చెందిన నేతలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డ నేతలు.. నిన్నమొన్నటి వరకు పార్టీ మారేది లేదు.. ప్రాణం పోయే వరకు పార్టీలోనే ఉంటామని.. ఇప్పుడు కేవలం డీల్ కోసమే పార్టీ మారడం పట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. అండగా ఉన్న వ్యక్తిని మోసగించి.. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని తన కుటుంబ సభ్యునిగా భావించి సహాయం అందించిన వ్యక్తిని, పార్టీని కాదని వెళ్లిపోవడం పట్ల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా విమర్శల పరంపర కొనసాగుతోంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతిమాలిన రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మణిగాంధీ కుటుంబానికి వైఎస్ జగన్ ఎంతో సహాయం చేశారని, అలాంటి వ్యక్తిని మోసగించడం సబబు కాదని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఇక మణిగాంధీకి పుట్టగతులుండవని ప్రజలు మండిపడుతున్నారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.... వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారన్న వార్తలను ఖండించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మణిగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించకోక తప్పదన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతినిజాయితీ గురించి సమావేశాల్లో పదేపదే మాట్లాడుతుండటంపై కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవహారశైలి శోచనీయంగా ఉందన్నారు. ఆదివారం కర్నూలులో పార్టీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సంఖ్యాబలం ఉన్న చోట పోటీ పెట్టకుండా ఉండాని వారు సూచించారు. అలాగే వైఎస్ఆర్ సీపీ సంఖ్యా బలం తక్కువగా ఉన్న చోట పోటీకి నిలబడటం లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒంగోలు, కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి సంఖ్యా బలం ఉందని వారు స్పష్టం చేశారు. అయితే కర్నూలు జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభపెట్టే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు, పోలీసులపై నమ్మకం లేదన్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
'ప్రజల ఆస్తులతోనే చంద్రబాబు వ్యాపారం'
కర్నూలు : ప్రజల సొమ్ము దోచుకోవడం చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని శ్రీశైలం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కొదమూరు ఎమ్మెల్యే మణిగాంధీ విమర్శించారు. శనివారం వారు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజల ఆస్తులను లాక్కుంటున్నారని విమర్శించారు. రాజధాని కోసం భూ సేకరణలో అనుసరిస్తున్న విధానాలను వారు తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుండ్రేవుల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం విచారకరమని మణిగాంధీ అన్నారు. -
రుణమాఫీకి డబ్బెక్కడుంది
కోడుమూరు: రుణమాఫీ అంటూ రైతులను మోసం చేయడమే తప్ప అందుకు డబ్బెక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చెప్పే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘‘ప్రజలకు నువ్వు కట్టే సింగపూర్ అవసరంలేదు. సక్రమంగా రోడ్లు వేసి మరుగుదొడ్లు కట్టించి, తాగునీళ్ల సమస్య లేకుండా చేసి, సాగునీటి వనరులు పెంచేదిశగా పనులను చేస్తే చాలు’’. అని కోరారు. వైఎస్సార్సీపీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూల్ చేసి బదిలీలు చేస్తుందని ఆరోపించారు. కర్నూలు నుంచి రోజుకు 150లారీల ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలిపోతున్న అడ్డుకునే అధికారేలేరని ఆరోపించారు. బీసీ సెల్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు లాయర్ప్రభాకర్, వైఎస్సార్సీపీ నేతలు కృష్ణారెడ్డి, రామకృష్ణ, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలపై రెండు రోజుల క్రితం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ సస్పెన్షన్ తొలగింపు విషయాన్ని స్పీకర్ దృష్టికి తెచ్చారు. సభ్యులు సభకు వచ్చి క్షమాపణ చెబితే ఎత్తివేయవచ్చని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి యనమల చెప్పడంతో సభ్యులు సిద్ధంగా ఉన్నారన్న నెహ్రూ వారిని సభలోకి తీసుకువచ్చారు. సభాసంప్రదాయాలకు ఆటంకం కలిగించారన్న ఆరోపణపై తనను, మణిగాంధీని గత మంగళవారం సస్పెండ్ చేశారని, అయితే తాము ఉద్దేశపూర్వకంగా సంప్రదాయాలను ఉల్లంఘించలేదని, సభలో తొలిసారి ఇలా మాట్లాడాల్సి వస్తోందని శివప్రసాదరెడ్డి అన్నారు. ఏదిఏమైనా జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. మణిగాంధీ మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని భావించి అలా వ్యవహరించామని, ఇందుకు సారీ చెబుతున్నానన్నారు. యనమల ప్రతిపాదించిన సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. -
వైఎస్సార్సీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
సభకు వచ్చి క్షమాపణలు చెప్పినప్పటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాదరెడ్డి, మణిగాంధీపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్‌ను తొల గించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప నేత జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్‌కు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మం త్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సభ్యులు అందుబాటులో లేకపోవడంతో, వారు సభకు వచ్చి క్షమాపణ చెప్పిన వెంటనే సస్పెన్షన్ తొలగిపోతుందని స్పీకర్ చెప్పారు. -
ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్
-
ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యుల సస్పెన్షన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభనుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగినంత కాలం.. వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభా కార్యకలాపాలకు అడ్డం తగలడంతో పాటు స్పీకర్ మీద దాడిచేశారని, స్పీకర్ ముందున్న మైకులు విరిచేసి అసెంబ్లీ ఆస్తులను ధ్వంసం చేశారని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు. వారి సస్పెన్షన్ తీర్మానాన్ని అధికారపక్షం తక్షణం ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెల్‌లోకి దూసుకొచ్చి 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ, స్పీకర్నే అగౌరవపరిస్తే సభ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దళితుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.