ప్రజల సొమ్ము దోచుకోవడం చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని శ్రీశైలం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కొదమూరు ఎమ్మెల్యే మణిగాంధీ విమర్శించారు.
కర్నూలు : ప్రజల సొమ్ము దోచుకోవడం చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని శ్రీశైలం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కొదమూరు ఎమ్మెల్యే మణిగాంధీ విమర్శించారు. శనివారం వారు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజల ఆస్తులను లాక్కుంటున్నారని విమర్శించారు. రాజధాని కోసం భూ సేకరణలో అనుసరిస్తున్న విధానాలను వారు తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుండ్రేవుల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం విచారకరమని మణిగాంధీ అన్నారు.