రుణమాఫీకి డబ్బెక్కడుంది | where is the money for debt waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి డబ్బెక్కడుంది

Published Tue, Dec 2 2014 2:11 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

రుణమాఫీకి డబ్బెక్కడుంది - Sakshi

రుణమాఫీకి డబ్బెక్కడుంది

కోడుమూరు: రుణమాఫీ అంటూ రైతులను మోసం చేయడమే తప్ప అందుకు డబ్బెక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చెప్పే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘‘ప్రజలకు నువ్వు కట్టే సింగపూర్ అవసరంలేదు. సక్రమంగా రోడ్లు వేసి మరుగుదొడ్లు కట్టించి, తాగునీళ్ల సమస్య లేకుండా చేసి, సాగునీటి వనరులు పెంచేదిశగా పనులను చేస్తే చాలు’’. అని కోరారు.

వైఎస్సార్‌సీపీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూల్ చేసి బదిలీలు చేస్తుందని ఆరోపించారు. కర్నూలు నుంచి రోజుకు 150లారీల ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలిపోతున్న అడ్డుకునే అధికారేలేరని ఆరోపించారు. బీసీ సెల్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు లాయర్‌ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణారెడ్డి, రామకృష్ణ, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement