మణిగాంధీ రాజీనామాకు డిమాండ్‌ | demond for manigandhi resignations | Sakshi
Sakshi News home page

మణిగాంధీ రాజీనామాకు డిమాండ్‌

Published Mon, Nov 28 2016 12:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

demond for manigandhi resignations

కోడుమూరు :  సొంత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో చేరి కార్యకర్తల మధ్య విభేదాలు పెంచుతున్న ఎమ్మెల్యే మణిగాంధీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ కోడుమూరు మండల కన్వీనర్‌ కేఈ మల్లిఖార్జునగౌడ్‌ డిమాండ్‌ చేశాడు. కోడుమూరులో ఆదివారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో కార్యకర్తలను ఉద్దేశించి మల్లికార్జున గౌడ్‌ మాట్లాడారు. మణిగాంధీ రాజీనామా చేసి ఏ పార్టీ నుంచి పోటీచేసినా డిపాజిట్‌ కూడా రాకుండా ఓడిస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ కల్గిన తెలుగుదేశం పార్టీ నియమనిబంధనలు పాటించకుండా ఎమ్మెల్యే మణిగాంధీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను వదిలేసి ఇతర పార్టీ నేతలకు కాంట్రాక్టు పనులను కమీషన్లకు అమ్ముకుంటున్నాడన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement