మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారి, ఆర్డీఓ వినాయకం, డీఎస్పీ భక్తవత్సలం పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, కౌన్సిల్ హాల్‌లో కౌన్సిలర్లకు సీట్ల కేటాయింపును పరిశీలించారు.
ప్రొద్దుటూరు టౌన్: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎన్నికల అధికారి, ఆర్డీఓ వినాయకం, డీఎస్పీ భక్తవత్సలం పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, కౌన్సిల్ హాల్‌లో కౌన్సిలర్లకు సీట్ల కేటాయింపును పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్‌సీపీ గ్యాలరీని, టీడీపీ తరపున గెలిచిన 22 మందికి ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒకే బెంచీలో ఇద్దరు కూర్చోడానికి ఇబ్బంది కరంగా ఉంటుందని కొందరు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఒక్కో బెంచీని ఒక్కరికి ఏర్పాటు చేయాలని కమిషనర్ వెంకటశివారెడ్డికి సూచించారు. కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. డీఈ రామచంద్రప్రభు, టౌన్‌ప్లానింగ్ అధికారి శివగురుమూర్తిలకు ఎన్నికల అధికారులు పలు సూచనలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
3వ గ్యాలరీ ఏర్పాటుకు అనుమతి నో
3వ గ్యాలరీ ఏర్పాటు చేయాలని కొందరు కౌన్సిలర్లు ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు, టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు మూడో గ్యాలరీలో కూర్చుంటామని కోరడంతో దానిని ఎన్నికల అధికారి తిరస్కరించారు.