దర్శి (తాళ్లూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం శోచనీయమని దర్శి నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన చేపట్టిన నిరహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర డీఈడీ కళాశాల విద్యార్థినులు వచ్చిన ఆయనకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. పలు రాజకీయ పార్టీల దోబూచులాటతో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే తాము నిరుద్యోగులమవుతామని డీఈడీ కళాశాల విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని ఆయన చెప్పిన మాటలు తమకు ధైర్యాన్నిచ్చాయని విద్యార్థిని రాజేశ్వరి చెప్పారు.
సంతకాల సేకరణ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ దీక్ష శిబిరం వద్ద సంతకాలు సేకరించారు. శివప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, చీమకుర్తి మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మలు తొలి సంతకాలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీటీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రం రెండుగా విడిపోతోందని దుయ్యబట్టారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలంగాణ ప్రక్రియ ఆగేదన్నారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు మండలాల పార్టీ కన్వీన ర్లు వెన్నపూస వెంకటరెడ్డి, మారం వెంకటరెడ్డి, సుంకర బ్రహ్మానందరెడ్డి, నారపరెడ్డి, రావులపల్లి పుల్లయ్య, నాయకులు పి.ధనలక్ష్మి, అనిల్‌కుమార్‌రెడ్డి, అంజిరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, గంగిరెడ్డి యలమందారెడ్డి, వెంకటేశ్వర్లు, దుర్గారెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, వెంకటప్పారెడ్డి, అన్నపురెడ్డి భిక్షాల్‌రెడ్డి, సుబ్బారావు, పులి ప్రసాద్‌రెడ్డి, డీఈడీ కళాశాల డెరైక్టర్ డీవీ కృష్ణారెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.
బాబూ.. రెండు నాల్కల ధోరణి విడనాడు
Published Sat, Oct 5 2013 4:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement