మందమర్రి ఏరియా కాసిపేట గనిలో సర్ధార్ సారం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం పది రోజుల సస్పెండ్ ఉత్తర్వులు అందించి ఒక్కరోజు గడవగానే సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేశారు. సూపర్‌వైజర్, ఇంజినీర్‌లకు హెచ్చరికలతో వదిలి సర్ధార్‌ను సస్పెండ్ చేయడం మానసికంగా వేధించడమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో సర్ధార్ సారం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం పది రోజుల సస్పెండ్ ఉత్తర్వులు అందించి ఒక్కరోజు గడవగానే సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేశారు. సూపర్‌వైజర్, ఇంజినీర్‌లకు హెచ్చరికలతో వదిలి సర్ధార్‌ను సస్పెండ్ చేయడం మానసికంగా వేధించడమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15న గనిలో స్టార్టర్ మీదపడి కోట శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషీయన్ కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. మొదట సాధారణ గాయాలు అని సరిపెట్టుకున్న అధికారులు పరిస్థితి తీవ్రంగా ఉండి శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆపరేషన్ కావడంతో విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిబ్బంది కేటాయింపు పనుల పర్యవేక్షణలో సూపర్‌వైజర్, ఇంజినీరింగ్ అధికారుల బాధ్యత ఉండగా కేవలం సర్ధార్‌లను బలిచేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
వేధింపులు మానుకోవాలి
సింగరేణిలో అధికారులు, సూపర్‌వైజర్లు సర్ధార్‌లు, ఓర్‌మెన్‌లపై వేధింపులు మానుకోవాలని హెచ్‌ఎమ్మెఎస్ ఏరియా ఉపాద్యక్షుడు బోనాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ డిస్ట్రిక్ సర్దార్ పరిధిలో టెండల్, జనరల్ మజ్ధూర్, టింబర్‌మెన్, సఫోర్ట్‌మెన్, కోల్‌కట్టర్, ఎలక్ట్రీషీయన్, హాలర్ డ్రైవర్స్, ఎస్‌డీయల్ అపరేటర్స్, పుషర్స్, హెల్ఫర్స్, షార్ట్ ఫైరర్, ట్రామర్, బెలన్‌మజ్ధూర్ వివిధ విభాగాలకు చెందిన కార్మికులు వివిధ పనిస్థలాల్లో పనిచేస్తుంటారన్నారు. ఎవరికి ఏం జరిగిన సర్ధార్‌ను బాధ్యడిని చేయడం సరికాదన్నారు. సంభంధం లేని విషయంలో కాసిపేటగనిలో ఎలక్ట్రీషియన్‌కు గాయాలు కాగా సర్ధార్‌ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.