
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
గుంటూరు : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటనపై ఎస్పీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లు శ్రీదేవి, విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లో వెళితే తన భర్త వెస్లీతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకుని తనకు, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమావత్ శ్రీదేవి మంగళవారం పట్టాభిపురం పీఎస్ ఎదుట తన తల్లితో కలిసి ధర్నాకు దిగారు.
అంతకు ముందు ఇదే విషయమై మహిళా కానిస్టేబుళ్లు విజయలక్ష్మి, శ్రీదేవి మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్తా శ్రుతిమించి ఇరువురు కొట్టుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ విజయలక్ష్మి గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం తరలించి, శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త వెస్లీని అదుపులోకి తీసుకున్నారు.