women constables
-
చిల్డ్రన్ కేర్: పనిచోటే లాలిపాట
‘ఎంతైనా తల్లి మనసు’ అనేది మనం తరచుగా వినే మాట. తల్లి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం పిల్లలపైనే ఉంటుంది. ఆ పిల్లలు పసి పిల్లలు అయితే? ఆ బాధ తల్లికే తెలుస్తుంది. పసిపిల్లలను ఇంట్లో ఎవరికో ఒకరికి అప్పగించి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు చాలామంది మహిళా ఉద్యోగులకు లేదు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలను తమతోపాటు తమ పని ప్రదేశానికి తీసుకువస్తారు. అలా అని వారు అక్కడ నిశ్చింతగా... సంతోషంగా ఉంటున్నారా... అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిని గమనించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. ‘చైల్డ్ కేర్ సెంటర్’ ద్వారా తల్లీబిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు.పసిబిడ్డలను తీసుకుని ఉద్యోగ విధులకు హాజరు అవుతున్న మహిళా ఉద్యోగులుపాలివ్వడం నుంచి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఆఫీసులో పిల్లలు ఏడిస్తే తోటి ఉద్యోగులు చిరాకు పడతారు. కొందరైతే ముఖం మీదే ‘పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి రావచ్చుగా’ అని గట్టిగా మాట్లాడతారు. కామారెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఏఆర్ కానిస్టేబుల్స్ కు తమ వెంట పిల్లలను తీసుకువచ్చి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించడం పెద్ద సవాలుగా మారింది.ఆఫీసులో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన జిల్లా ఎస్పీ సింధుశర్మ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ ఏర్పాటు చేయించారు. పిల్లలకుపాలు ఇవ్వడం నుంచి వారిని ఆడించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’లో ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను సెలవులు ఉన్న రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు ఎవరూ లేక చాలా మంది ఉద్యోగులు వారిని తీసుకొని ఆఫీసుకు వస్తుంటారు. అలాంటి పిల్లలు కూడా ‘చైల్డ్ కేర్ సెంటర్’లో సంతోషంగా గడుపుతున్నారు.ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గార్డ్ డ్యూటీ ఉంటుంది. షిఫ్టుల వారీగా వారికి బాధ్యతలు కేటాయిస్తారు. అలాంటి సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ఎంతో ఊరట ఇస్తోంది. ‘పిల్లల కంటే ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం మానేయ్’లాంటి కరుకు మాటలు...‘నువ్వు హాయిగా డ్యూటీకి వెళ్లిపోతే పిల్లాడిని పట్టుకొని నేను నానా చావులు చావాలా!’లాంటి ఈసడింపులు ఇక ముందు వినిపించకపోవచ్చు. ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎన్నో సమస్యలు అడ్డుగోడగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ‘చైల్డ్ కేర్ సెంటర్’ అనేది తల్లీబిడ్డల కన్నుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రధనుస్సు అవుతుంది. నిశ్చింతగా ఉద్యోగం చేసుకోవడానికి అసరమైన ఆసరాను, ధైర్యాన్నీ ఇస్తుంది. – సేపూరి వేణుగోపాలాచారి ,సాక్షి, కామారెడ్డిఅందుకే... చైల్డ్ కేర్ సెంటర్మహిళాపోలీసులు పిల్లలతో డ్యూటీకి వచ్చిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు తల్లిదగ్గరే ఉండగలుగుతారు. తల్లే వారిని చూసుకుంటుంది.పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ళ్లుగా 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వు అవడంతో ఆయా విభాగాల్లో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరిగింది. ఏఆర్ కానిస్టేబుల్స్ హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేస్తుంటారు. వారు గార్డు డ్యూటీతో సహా అన్నిరకాల విధులకు హాజరు కావలసిందే. అలాంటి సందర్భంలో పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదనే చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను. – సింధుశర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీఇబ్బందులు తీరాయిఏఆర్ విభాగంలో దాదాపు అందరు మహిళా కానిస్టేబుళ్లకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి రాలేని పరిస్థితి ఉంటుంది. వెంట తీసుకుని వస్తాం. అయితే పిల్లలతో డ్యూటీ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు ఏడుస్తుండడాన్ని చూసిన ఎస్పీ మేడం పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. – ఏ.మానస, మహిళా కానిస్టేబుల్, ఏఆర్ విభాగంపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు...జిల్లాపోలీసు కార్యాలయంలో డ్యూటీ చేసేవారితోపాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ వెంట ఉండే చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లో వదిలేస్తే అక్కడ ఆడుకుంటున్నారు. బెడ్‌పై నిద్రపోతున్నారు. తీరిక సమయంలో మేం కూడా వారితో కాసేపు గడపడానికి చైల్డ్‌కేర్ సెంటర్ అనుకూలంగా ఉంది. – వై.భార్గవి, మహిళా కానిస్టేబుల్, దేవునిపల్లి పీఎస్ -
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
టీడీపీ దౌర్జన్యంపై మహిళా పోలీసుల ఫిర్యాదు
-
మద్య నిషేధంలో మహిళల భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: దశల వారీగా మద్యపాన నిషేధం అమల్లో మహిళల్ని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మహిళా కానిస్టేబుళ్లను నియమించి మద్యం రక్కసిని తరిమికొట్టనుంది. మహిళా పోలీసింగ్‌తో గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పని చేసేందుకు ప్రత్యేకంగా 14,944 మంది మహిళా కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేసింది. గ్రామాల్లో 11,158 పోస్టులు, వార్డుల్లో 3,786 పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. ఈ తరుణంలో మద్యం షాపులు, బార్లపై మహిళలు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గ్రామాలు, పట్టణ/నగర వార్డుల్లో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మహిళా కానిస్టేబుళ్లకు ఫిర్యాదు చేయొచ్చు. బెల్టు షాపులను నిర్మూలించేందుకు, అక్రమ మద్యం అరికట్టేందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మద్యం బాటిళ్ల కొనుగోలుపైనా పలు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్ల వరకే కొనుగోలుకు, తన ఆధీనంలో ఉంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. విదేశీ మద్యం అయినా మూడు బాటిళ్లకు మించి కొనుగోలు చేయకూడదు. స్పిరిట్ మూడు బల్క్ లీటర్లు, కల్లు 2 బల్క్ లీటర్లు, బీరు 650 ఎం.ఎల్ బాటిళ్లు ఆరు వరకు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ ఆంక్షల్ని ఉల్లంఘిస్తే ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ నిబంధనలు అమలయ్యేలా గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేకంగా మహిళలను భాగస్వాములు చేస్తున్నారు. బార్ల సమయం త్వరలో తగ్గింపు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయనున్నాయి. అయితే బార్లకు మాత్రం రాత్రి 11 గంటల వరకు సమయముంది. అయితే ఫుడ్ సర్వింగ్ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బార్ల సమయాన్ని కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. బార్ల యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టేలా ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ కావడం గమనార్హం. 678 కానిస్టేబుళ్ల పోస్టులకు ప్రతిపాదనలు ఎక్సైజ్ శాఖలో మొత్తం వెయ్యి వరకు కానిస్టేబుళ్ల ఖాళీలున్నాయి. వీటిలో 678 పోస్టులను కొత్తగా భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీటిని భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ భర్తీలోనూ మహిళా కోటాకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అక్రమ మద్యం, సారా తయారీ దూరం చేయడంతో పాటు తాగుడు వ్యసనాన్ని మాన్పించడమే మహిళా పోలీసింగ్ లక్ష్యం. -
మహిళా కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్‌లు: వైఎస్ జగన్
-
దేశంలో తొలిసారి విధుల్లో చేరిన మహిళా కమాండో టీం
-
మేమున్నామని..
మహిళలపై జరుగుతున్న దాడులు.. ఇబ్బందిపెట్టే ఆత్మన్యూనత ఆలోచనలు.. వారి రక్షణకుచిత్తూరు పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్త్ర్రీలకు కొండంత భరోసానిస్తున్నాయి. ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మీ భద్రతకు మేమున్నామంటూ పోలీసు యంత్రాంగం చూపుతున్న చొరవపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. చిత్తూరు అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల రక్షణకు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అయిదు చోట్ల మహిళా విభాగాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, పుత్తూరు ప్రాంతాల్లో 20 మందితో ఏర్పాటైన ఈ విభాగంలో ప్రస్తుతం 78 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ విభాగం పనితీరును మెచ్చుకున్న రాష్ట్ర పోలీసు శాఖ రూ.లక్ష రివార్డు కూడా అందజేసింది. సైకిల్‌యాత్ర తెచ్చిన మార్పు.. చిత్తూరు జిల్లాలో మహిళా ఆత్మహత్యలు నివారించి వారికి మేమున్నామనే (పోలీసులు) భరోసా కల్పించడానికి గతేడాది అక్టోబరులో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు 56 మండలాల్లో 1200 కి.మీ దూరం సైకిల్ ర్యాలీ చేపట్టి మహిళలకు ఆత్మసై ్థర్యాన్ని నింపారు. 44 రోజులపాటు సాగిన ఈ యాత్ర జిల్లాలో మహిళల ఆత్మహత్యల శాతాన్ని తగ్గించిందని పోలీసులు చెబుతున్నారు. 2015లో జిల్లాలో 142 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే..ఈ సంఖ్య 2016లో 167కు, గతేడాది 70కు పరిమితమయ్యింది. నిర్భయ పెట్రోలింగ్... పట్టణ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడానికి నిర్భయ పెట్రోలింగ్ పేరిట చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. నాలుగు ఎలక్ట్రిక్ బ్యాటరీ సైకిళ్లతో జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ఇక్కడ పోలీసులున్నారనే వాస్తవాన్ని గుర్తించడానికి సైకిళ్లపై మహిళా కానిస్టేబుళ్లు కనిపిస్తుంటారు. మా వాళ్లు విశ్వాసంతో ఉన్నారు.. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వారి రక్షణకు మా ఎస్పీ గారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రతీ ఒక్క ప్రోగ్రామ్‌లో నాలుగు మీటింగ్‌లు పెట్టి.. రెండు మాటలు చెప్పడంతో మా బాధ్యత ముగిసిపోదు. ఫీల్డులో మహిళల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి. వాళ్లల్లో ఆత్మసై ్థర్యం నింపాలి. ఇందు కోసం ముందు మా మహిళా పోలీసు అధికా రులు, కానిస్టేబుళ్లకు కాన్ఫిడెంట్ కావాలి. వీరందరితోనూ ఇప్పటికే పలు మార్లు సమావేశమై ఎలా పనిచేయాలి..? సమస్యలు వస్తే ఎలా స్పందించాలని చెబుతుంటాను.– జిఆర్.రాధిక, ఏఎస్పీ, చిత్తూరు. మార్పు వస్తుంది.. మూడు సంవత్సరాలకు పైనే ఈ విభాగంలో పనిచేస్తున్నా. అప్పటికి, ఇప్పటికి మహిళల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చింది. పల్లెలోకి మహిళలు సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పడం, చిన్న వాటికే డిప్రెషన్లోకి వెళ్లిపోయి సూసైడ్‌కు పాల్పడవద్దని వివరిస్తా ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చేయడం వల్ల మాపై నమ్మకంగా ఉన్నారు. ఇది ఒకేసారి వచ్చే మార్పు కాదు. కొద్ది కొద్దిగా మొదలై ఒక రోజు తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. – సివి.హైమావతి,ఏఎస్ఐ, మహిళా స్టేషన్, చిత్తూరు. ఈ సారి హాకథాన్.. వచ్చేనెల జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో హాకథాన్ అనే కొత్త కార్యక్రమాన్ని చిత్తూరు పోలీసు శాఖ పరిచయం చేయబోతోంది. మహిళల ప్రతీ ఒక్క సమస్య పరిష్కారానికి విస్తృత స్థాయిలో చర్చించడమే హాకథాన్ లక్ష్యం. ఆసియాలో తొలిసారిగా మహిళా భద్రతపై హాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తీర్పు ఇవ్వండి... మహిళపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు బాధ్యత ఉన్న పౌరుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి సోషల్ మీడియా వేదికకగా చేపట్టిన మరో ప్రయత్నం ‘తీర్పుఇవ్వండి–మార్పుకోరండి’. ఠీఠీఠీ. ్చజ్చుఝట /ఛిజిజ్టీ్టౌౌటఞౌ జీఛ్ఛి అనే లింక్ ద్వారా కైజాలా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకుని ఓపీనియన్పోల్లో పౌరులు పాల్గొని అభిప్రాయాలను తెలియజేయవచ్చు. -
ఆపదలో పోలీసులే దేవుళ్లు
సాక్షి, రంగారెడ్డి: ఆపద సమయంలో బాధితులకు పోలీసులే దేవుళ్లని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించే వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. బుధవారం రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్ టీఎస్పీఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. సివిల్ 452, ఏఆర్ 283 మహిళా కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పాసింగ్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపటిలా పరిస్థితులు లేవని, ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందన్నారు. చట్టానికి లోబడి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఆపదలో పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కే మహిళలను ఒక స్త్రీగా ఓపికతో సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల్లో టీఎస్పీఏ ఒకటని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ స్టేషన్ దేవాలయంలా కనిపిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మెరుగైన సేవలు అందిస్తే పోలీస్‌ని దేవుడిలా చూస్తారన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించి.. వారిని యజమానులుగా భావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ అందజేశామని పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్ పేర్కొన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా చట్టం, ఆయుధాల వాడకం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చామని వివరించారు. -
మహిళా కానిస్టేబుళ్లు అంతంతమాత్రమే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరగడం లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు సరిపడనంత మహిళా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయి. పురుష అధికారులతో పోల్చి చూస్తే కింది స్థాయి సిబ్బందిలో మాత్రమే మహిళలు కనిపిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌లోనూ, ఎలాట్మెంట్లోనూ 33శాతం రిజర్వేషన్ ఉండాలన్న పోలీస్ శాఖ నిబంధన జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 82మంది మహిళలే పని చేస్తున్నారు. హోంగార్డుల్లో మహిళలున్నా అది పరిగణనలోకి రాదని పోలీస్ అధికారులే చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగానే పోలీస్ శాఖ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 33శాతం రిజర్వేషన్ కనిపించడం లేదు. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య క్రమేణ తగ్గిపోవడంతో భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తప్పవని సంఘాల సభ్యులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... 1977లో జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించింది. అప్పటికి కేవలం పదిలోపే మహిళా సిబ్బంది ఉండేవారు. 1995 తరువాత పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది విధుల్లోకి వచ్చారు. అయినా జిల్లాలో వారి సంఖ్య ఇప్పటికీ 82 దాటలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది ఉంటే వారిలో 33శాతం మహిళలు ఎక్కడా లేరు. విచిత్రమేమిటంటే జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పోలీస్స్టేషన్లోనూ పురుష అధికారే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ మహిళా ఎస్ఐ, సీఐ, డీఎస్పీ లేరంటే బాధాకరమే. మహిళా సమస్యలు తీర్చేందుకు, ధర్నాలు, బందోబస్తుకు సంబంధించి మహిళల ఉద్యమాలు, ఆందోళనల్లో విధులు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది లేకపోవడంతో పురుష పోలీస్ అధికారులు నానా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో మూడు సబ్ డివిజన్లు, 42పోలీస్స్టేషన్లు ఉన్నాయి. మహిళా సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ ఒక మహిళా పోలీస్‌స్టేషన్ తప్పనిసరిగా ఉండాలని గతంలోనే నివేదికలు వెళ్లాయి. జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న మహిళల్లో 82మంది మహిళా సిబ్బంది ఉన్నారు. బెటాలియన్ అవసరమే... జిల్లాకు ప్రత్యేక మహిళా బెటాలియన్ అవసరం ఉందని గతంలోనే గుర్తించారు. రాష్ర్ట విభజన తరువాత ఇప్పటి వరకూ ఈ జిల్లాకు రిక్రూట్మెంట్, సిబ్బంది మంజూరీ జరగలేదు. జిల్లాలో 40మందికి పైగా కానిస్టేబుళ్లు, 12మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్ఐలు మాత్రమే చలాకీగా ఉన్నట్టు పోలీస్‌శాఖ అంతర్గత సమావేశంలో తేల్చినట్టు తెలిసింది. ఉన్న 82మంది సిబ్బందిలో మిగిలిన వారంతా ఫిట్‌నెస్‌కు దూరంగానే ఉన్నారని ఓ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. ఉమెన్ పోలీస్స్టేషన్లోనూ సరిపడా మహిళా సిబ్బంది లేరు. మహిళా బాధితుల కష్టాల్ని వినే నాధు డే కరువయ్యాడు. జిల్లా జనాభా 25 లక్షలు దాటింది. మహిళా పోలీసుల సంఖ్య మాత్రం 100 లోపే ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని, జిల్లాలో మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ఎస్పీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. -
అంతర్మథనంలో మహిళా కానిస్టేబుళ్లు
-
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
-
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
గుంటూరు : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటనపై ఎస్పీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లు శ్రీదేవి, విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లో వెళితే తన భర్త వెస్లీతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని తనకు, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమావత్ శ్రీదేవి మంగళవారం పట్టాభిపురం పీఎస్ ఎదుట తన తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అంతకు ముందు ఇదే విషయమై మహిళా కానిస్టేబుళ్లు విజయలక్ష్మి, శ్రీదేవి మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్తా శ్రుతిమించి ఇరువురు కొట్టుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ విజయలక్ష్మి గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం తరలించి, శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త వెస్లీని అదుపులోకి తీసుకున్నారు.