మహిళలపై జరుగుతున్న దాడులు.. ఇబ్బందిపెట్టే ఆత్మన్యూనత ఆలోచనలు.. వారి రక్షణకుచిత్తూరు పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్త్ర్రీలకు కొండంత భరోసానిస్తున్నాయి. ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మీ భద్రతకు మేమున్నామంటూ పోలీసు యంత్రాంగం చూపుతున్న చొరవపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
చిత్తూరు అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల రక్షణకు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అయిదు చోట్ల మహిళా విభాగాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, పుత్తూరు ప్రాంతాల్లో 20 మందితో ఏర్పాటైన ఈ విభాగంలో ప్రస్తుతం 78 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ విభాగం పనితీరును మెచ్చుకున్న రాష్ట్ర పోలీసు శాఖ రూ.లక్ష రివార్డు కూడా అందజేసింది.
సైకిల్‌యాత్ర తెచ్చిన మార్పు..
చిత్తూరు జిల్లాలో మహిళా ఆత్మహత్యలు నివారించి వారికి మేమున్నామనే (పోలీసులు) భరోసా కల్పించడానికి గతేడాది అక్టోబరులో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు 56 మండలాల్లో 1200 కి.మీ దూరం సైకిల్ ర్యాలీ చేపట్టి మహిళలకు ఆత్మసై ్థర్యాన్ని నింపారు. 44 రోజులపాటు సాగిన ఈ యాత్ర జిల్లాలో మహిళల ఆత్మహత్యల శాతాన్ని తగ్గించిందని పోలీసులు చెబుతున్నారు. 2015లో జిల్లాలో 142 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే..ఈ సంఖ్య 2016లో 167కు, గతేడాది 70కు పరిమితమయ్యింది.
నిర్భయ పెట్రోలింగ్...
పట్టణ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడానికి నిర్భయ పెట్రోలింగ్ పేరిట చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. నాలుగు ఎలక్ట్రిక్ బ్యాటరీ సైకిళ్లతో జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ఇక్కడ పోలీసులున్నారనే వాస్తవాన్ని గుర్తించడానికి సైకిళ్లపై మహిళా కానిస్టేబుళ్లు కనిపిస్తుంటారు.
మా వాళ్లు విశ్వాసంతో ఉన్నారు..
మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వారి రక్షణకు మా ఎస్పీ గారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రతీ ఒక్క ప్రోగ్రామ్‌లో నాలుగు మీటింగ్‌లు పెట్టి.. రెండు మాటలు చెప్పడంతో మా బాధ్యత ముగిసిపోదు. ఫీల్డులో మహిళల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి. వాళ్లల్లో ఆత్మసై ్థర్యం నింపాలి. ఇందు కోసం ముందు మా మహిళా పోలీసు అధికా రులు, కానిస్టేబుళ్లకు కాన్ఫిడెంట్ కావాలి. వీరందరితోనూ ఇప్పటికే పలు మార్లు సమావేశమై ఎలా పనిచేయాలి..? సమస్యలు వస్తే ఎలా స్పందించాలని చెబుతుంటాను.– జిఆర్.రాధిక, ఏఎస్పీ, చిత్తూరు.
మార్పు వస్తుంది..
మూడు సంవత్సరాలకు పైనే ఈ విభాగంలో పనిచేస్తున్నా. అప్పటికి, ఇప్పటికి మహిళల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చింది. పల్లెలోకి మహిళలు సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పడం, చిన్న వాటికే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్‌కు పాల్పడవద్దని వివరిస్తా ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చేయడం వల్ల మాపై నమ్మకంగా ఉన్నారు. ఇది ఒకేసారి వచ్చే మార్పు కాదు. కొద్ది కొద్దిగా మొదలై ఒక రోజు తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. – సివి.హైమావతి,ఏఎస్‌ఐ, మహిళా స్టేషన్, చిత్తూరు.
ఈ సారి హాకథాన్..
వచ్చేనెల జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో హాకథాన్ అనే కొత్త కార్యక్రమాన్ని చిత్తూరు పోలీసు శాఖ పరిచయం చేయబోతోంది. మహిళల ప్రతీ ఒక్క సమస్య పరిష్కారానికి విస్తృత స్థాయిలో చర్చించడమే హాకథాన్ లక్ష్యం. ఆసియాలో తొలిసారిగా మహిళా భద్రతపై హాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తీర్పు ఇవ్వండి...
మహిళపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు బాధ్యత ఉన్న పౌరుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి సోషల్ మీడియా వేదికకగా చేపట్టిన మరో ప్రయత్నం ‘తీర్పుఇవ్వండి–మార్పుకోరండి’. ఠీఠీఠీ. ్చజ్చుఝట /ఛిజిజ్టీ్టౌౌటఞౌ జీఛ్ఛి అనే లింక్ ద్వారా కైజాలా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఓపీనియన్‌పోల్‌లో పౌరులు పాల్గొని అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment