we-empowerment
-
‘లేడీస్’ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీఏ ఆధ్వర్యంలోమహిళలకు లైసెన్స్ క్యాంపులు ఏర్పాటు చేశారు.ఖైరతాబాద్ కార్యాలయానికి సేవల కోసం వచ్చిన మహిళతో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ క్యాంపును ప్రారంభించగా.. బేగంపేట్, విద్యానగర్ రైల్వేస్టేషన్లను మహిళా స్టేషన్లుగా దక్షిణమధ్య రైల్వే జీఎంవినోద్కుమార్ ప్రకటించారు. వీటిలో పనిచేసే సిబ్బంది అందరూ మహిళలే కావడం విశేషం. ఈ సందర్భంగాదశాబ్దానికి పైగా లోకోపైలట్‌గా సేవలందిస్తున్నసత్యవతిని జీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా రైల్వేస్టేషన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ప్రారంభమయ్యాయి. నగరంలోని బేగంపేట్, విద్యానగర్‌తో పాటు, గుంతకల్ డివిజన్లోని చంద్రగిరి, గుంటూరు డివిజన్లోని న్యూ గుంటూరు రైల్వేస్టేషన్లలో కూడా పూర్తిస్థాయి మహిళా ఉద్యోగులు, అధికారులు ఉన్న రైల్వేస్టేషన్లుగా జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా బేగంపేట్ మహిళా రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్ నిర్వహణ బాధ్యతను పూర్తిగా మహిళలకే అప్పగించడం వల్ల విధి నిర్వహణలో వారు అంకితభావం, ఆత్మస్థైర్యంతో పని చేయగలరన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో మహిళా ఉద్యోగుల కృషి ఉంటుదని ఆయన అన్నారు. ప్రత్యేక సదుపాయాలు.. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలోనూ దక్షిణమధ్య రైల్వే ముందు వరుసలో ఉందని జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా మహిళల కోసం వెయిటింగ్ హాళ్లు, తల్లులు పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాచిగూడ, బేగంపేట్ తదితర రైల్వేస్టేషన్లలో శానిటరీ ప్యాడ్లను అందుబాటులో ఉంచామన్నారు. నగరంలోని అన్ని ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లలో ఆర్పీఎఫ్ మహిళా భద్రతా సిబ్బందితో ‘నిర్భయ బృందాల’ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సత్యవతికి అభినందన.. ఈ సందర్భంగా జీఎం.. లోకోపైలెట్ సత్యవతిని ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దానికి పైగా ఎంఎంటీఎస్ రైళ్లు నడుపుతున్న ఆమె సేవలను ప్రశంసించారు. సత్యవతి నడుపుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లోకి ఎక్కి ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వర్ధన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఏలో లేడీస్ స్పెషల్ డే..:850 మందికి పైగా ఎల్‌ఎల్‌ఆర్‌లు సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో ఆర్టీఏ నిర్వహించిన ‘లేడీస్ స్పెషల్ డే’కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘లెర్నింగ్ లైసెన్స్ మేళా’లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లైసెన్సులు తీసుకున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, బండ్లగూడ, మెహదీపట్నం, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం.. అన్నిచోట్లా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందజేశారు. అన్ని ఆర్టీఏల్లో సుమారు 850 మందికి పైగా ఎల్ఎల్ఆర్ తీసుకున్నారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేళాకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాహనం నడపాలంటే ప్రతి ఒక్కరు డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని, విధిగా లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. జేటీసీ పాండురంగ్ నాయక్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా మహిళల కోసం ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్, టీఎన్జీవోస్ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సామ్యూల్ పాల్ పాల్గొన్నారు. -
అమ్మతోడు.. అమ్మాయిగానే..
సాక్షి,సిటీబ్యూరో: మరో జన్మంటూ ఉంటే మళ్లీ అమ్మాయిగానే పుడతానంటున్నారు సిటీ అమ్మాయిలు. నిత్య జీవితంలో ప్రతిచోటా వివక్ష ఎదురైనా దానికి చరమగీతం పాడేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. కొందరు ఇంట్లో వివక్షను ఎదుర్కొంటే.. పాఠశాల.. కళాశాల స్థాయిలో తాము అధికమార్లు వివక్షకు గురైనట్లు ఇంకొందరు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో కెరీర్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు విరామమెరుగక శ్రమిస్తామని చాటిచెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా బుధవారం ‘సాక్షి’ బృందం సుమారు వెయ్యి మంది కళాశాలల విద్యార్థినుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలిలా ఉన్నాయి.. సాక్షి సర్వే 1. మళ్లీ జన్మంటూ ఉంటేఎలా పుడతారు ? ఎ.అమ్మాయి: 682 బి.అబ్బాయి: 187 సి.చెప్పలేం: 131 2. అమ్మాయిగా ఎప్పుడైనావివక్ష ఎదుర్కొన్నారా..? ఎ.అవును: 549 బి.లేదు: 401 సి. చెప్పను: 50 3. మీరు ఎక్కడ వివక్ష ఎదుర్కొన్నారు? ఎ.స్కూల్/కాలేజ్: 649 బి.ఇంట్లో: 309 సి.లేదు: 42 4. మీ ఆకాంక్షలకు అనుగుణంగాచివరి లక్ష్యాన్ని (లైఫ్‌గోల్) చేరుకోగలమనిభావిస్తున్నారా? ఎ.అవును: 730 బి.కాదు: 207 సి. చెప్పలేను: 63 5. సంప్రదాయకెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారా.. లేదాఛాలెంజింగ్ జాబ్ చేయాలనుకుంటున్నారా? ఎ. రిస్క్ ఎక్కువగా ఉండని జాబ్: 464 బి.ఛాలెంజింగ్ జాబ్: 489 సి.చెప్పలేను: 47 -
అతివలకు అండగా..
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మహిళా రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ–టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయసహకారాలు అందిస్తున్నారు. పోలీసు–ప్రజలకు వారధిగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్–ఐ’లోనూ ఇందుకు సంబంధించి ప్రత్యేక అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్–ఐ’లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మెబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు...జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందుపరిచిన నెంబర్లకూ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెస్ చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ... ప్రయాణాల్లో మహిళలకు ఉపకరించేందుకు ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. నిరంతర పర్యవేక్షణ పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూ చనలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. మహిళల కోస ం ఏర్పాటు చేసిన విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బ ంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటారు. – ఐటీ సెల్ అధికారులు మూడున్నరేళ్లుగా ‘షీ’ సేవలు... దేశంలోనే తొలిసారిగా షీ–బృందాల కాన్సెప్ట్ 2014 అక్టోబర్ 24న హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. యువతులు, మహిళల రక్షణ కోసం సుశిక్షితమైన కొన్ని బృందాలను పోలీసు విభాగం ద్వారా ప్రభుత్వం రంగంలోకి దింపింది. సాధారణంగా ఎవరైనా మహిళలను వేధిస్తూ దొరికినా అడ్డంగా బుకాయిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు వీడియో ఎవిడెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మాటువేసే షీ–బృందాలు తొలుత ఆకతాయిల వైఖరిపై వీడియో రికార్డింగ్ చేస్తాయి. ఆపైనే వారిని పట్టుకోవడంతో పాటు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ నగరం దేశంలోనే ఉత్తమం అంటూ ‘నెస్ట్ అవే అనే ఆన్లైన్’ సంస్థ గతేడాది నిర్వహించిన ఆన్లైన్ సర్వే తేల్చింది. ఈ ఘనత సాధించడం వెనుక షీ–టీమ్స్ పాత్ర ఎనలేనిది. వాటి పనితీరు, స్పందనపై అధికారులు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు. -
మహిళాభ్యున్నతి కోసం సాక్షి సంతకం!
-
ఆమె సంక్షేమమే ధ్యేయం
ఇల్లు, కాలేజీ తప్ప మరో లోకం లేకుండా ఇంటర్ పూర్తయింది. 17ఏళ్లకేపెళ్లయింది. అయితే అందరిలాతన జీవితం వంటింటికే పరిమితంకావొద్దని, తన కాళ్ల మీద తానునిలబడాలని నిర్ణయించుకుంది. భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. జీవితమంటే తానుబతకడం కాదు... పది మందినిబతికించడంలోనే అసలు అర్థం ఉందని భావించింది. సమాజాన్నిసరికొత్తగా చూడాలనుకుంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ‘ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ఆమే నిజాంపేట్‌కు చెందిన లతాచౌదరి. సాక్షి, సిటీబ్యూరో: జీవితంలోస్థిరపడిపోయిన లతాచౌదరి... అంతటితో రిలాక్స్ అయిపోకూడదని అనుకుంది.వివక్షపైపోరాడాలనుకుంది. అందుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో 2004లో ‘ఉమన్ వెల్ఫేర్సర్వీస్ ఆర్గనైజేషన్’ను స్థాపించింది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి, మహిళా సాధికారత, హక్కులు, సేవ్ ఏ చైల్డ్, డొమెస్టిక్వాయొలెన్స్పై ఈ సంస్థ పనిచేస్తోంది. వాట్సప్ గ్రూప్‌లో అవగాహన.. ‘ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చదివి పెళ్లయ్యాక వంటింటికి పరిమితమవుతున్నారు. ఈ సమయంలో చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారికి వ్యాపార ఆలోచనలున్నా.. పెట్టుబడికి ఇబ్బంది అవుతోంది. ఇంకొంత మందికి డబ్బుంటే... ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి? తెలియడం లేదు. ఇలాంటి వారికోసమే సంస్థ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అదే విధంగా లైంగిక దాడులకు గురైన ఆడపిల్లలకు మనోధైర్యాన్నిస్తూ... సమాజంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్‌లో వలంటరీ డాక్టర్లు, అడ్వొకేట్స్, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు... ఇలా ఎంతో మంది ఉన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, లోలోపల కుంగిపోయే వారికి పరిష్కారాలు చూపుతున్నామ’ని చెప్పారు లత. ఉపాధి శిక్షణ... మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ మేకింగ్, బేకింగ్, అల్లికలు, బొమ్మల తయారీ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణిస్తున్నాం. వారిని మోటివేట్ చేసి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మనోధైర్యాన్నిస్తున్నాం. విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేద గర్భిణీలకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ... ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? తదితర వివరిస్తున్నామ’ని చెప్పారు లతా చౌదరి. -
చిత్రాలతో మహిళా శక్తిని చాటుతున్న లలితాదాస్
-
మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం
చందానగర్: మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. చందానగర్ జనప్రియ 9 వ్యాలీలో శుక్రవారం ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ‘నేను శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశంలో 99 శాతం మంది మహిళలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు రావాలి.. సమాజంలో ప్రతి చోట మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బయటకొచ్చి తమ బాధలు చెప్పుకోవాలి. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. – సుజాత త్రిపాఠి చర్చ జరగాలి.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలి. ఇంట్లో, బయట ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది తమ సమస్యలను బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. – పూనం పారిక్ చైతన్యం వస్తుంది.. ఇలాంటి కార్యక్రమాలతో మహిళల్లో చైతన్యం వస్తుంది. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాటిని అధిగమించి నవ సమాజ నిర్మాణం కోసం పోరాడతారు. – మృణాల్ అభినందనీయం.. అందరూ మనకెందుకులే అని ఊర్కొంటే మహిళల్లో చైతన్యం రాదు. వేధింపులకు గురవుతున్న సమాజంలో కుటుంబ పరువు పోతుందనే భయంతో ఎందరో నిశ్శబ్దంగా బతుకుతున్నారు. ‘సాక్షి’ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. – జయశ్రీ ప్రశ్నించాలి.. వేధింపులకు తలవంచకుండా ప్రతి మహిళ ప్రశ్నించాలి. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ఎదగాలి. అప్పుడే మహిళా శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. – రజిని ఈ కార్యక్రమం నేడు ఉదయం 10గంటలకు ‘సాక్షి టీవీ’లో ప్రసారమవుతుంది. -
చదువుతోనే మార్పు
విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతమని.. ఇది అమలు కావడంతో అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. అయితే సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం.. వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉందని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదని.. మార్పు మొదలైందని.. అది మరింత వేగంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ పిలుపునిచ్చారు. ‘విజ్ఞానం పెంచుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.. విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం.’ అని అంటున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై తన అభిప్రాయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పద్మ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే.. విజ్ఞానం పెంచుకోవాలి.. గతంతో పోల్చితే ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. మగ పిల్లలకు పోటీగా ఆడ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నారు. గతంలో ఇంత చక్కని అవకాశం లేదు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకున్నప్పుడు మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఒత్తిడిని తగ్గించాలి.. మన కార్యాలయాలన్నీ పురుషుల పనితీరుకు తగ్గట్లుగానే ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ కష్టానికి తగ్గట్లుగా పని ప్రదేశాల్లో మార్పు రావాలి. ఇంటి దగ్గర వంటతో మొదలు పెట్టి ఆఫీసు పని.. మళ్లీ సాయంత్రం ఇంటి పని.. ఇలా పొద్దంతా కష్టపడతారు. వారికి ఒత్తిడి తగ్గేలా ఆఫీసులో వాతావారణం ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వెయిటింగ్ రూం అందుబాటులోకి తెచ్చాం. మధ్యాహ్నం లంచ్ చేసేందుకు మహిళా ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. కొంత ప్రైవసీ ఉంటుంది. ఈ కొంత ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. చేతల్లో చూపించాలి.. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనే స్లోగన్లు అనేక చోట్ల కనిపిస్తాయి. ఇలా మాటల్లో, రాతల్లో ఉండే వాటిని చేతల్లో చూపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతం. ఈ విధానం అమలు కావడం వల్ల అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం, వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదు. మార్పు మొదలైంది. అది మరింత వేగంగా జరగాలి. ఇప్పటికే స్థానిక సంస్థలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయ ప్రవేశం చేశారు. రానున్న రోజుల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
విద్యతోనే వికాసం
ఒకప్పుడు బాలికలకు చదువెందుకులే అనే భావన అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా వరకు మారిందని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే వృత్తివిద్యా కోర్సుల ద్వారా.. అమ్మాయిల ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలని సూచించారు. ప్రతీఒక్కరి ఎదుగుదలలో చదువుదే ప్రథమ స్థానమని స్పష్టంచేశారు. మహిళా సాధికారతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి, వికారాబాద్ : ‘మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని గండేడ్ మండలం మహ్మదాబాద్. జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఉండేది. తల్లిదండ్రులు సరళాదేవి, ఆంజనేయులు. ఇద్దరూ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ పొందారు. నా విజయంలో వీరితో పాటు మా అన్నయ్య పాత్ర ఎంతో ఉంది. పదో తరగతి వరకు మా ఊరిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదివా. ఇంటర్, డిగ్రీ మహబూబ్‌నగర్‌లో పూర్తిచేశా. ప్రభుత్వ ఎంబీఎస్ కాలేజీలో డిగ్రీ అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో లా, పీజీ చదివా. న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలోనే (2007లో) గ్రూప్– 1 పరీక్ష రాయగా ఉద్యోగం వచ్చింది. దీంతో బొంరాస్‌పేట్‌లో ఎంపీడీఓగా విధుల్లో చేరా. అనంతరం డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఉద్యోగం చేస్తూనే పరీక్ష రాశా. 2009లో డిప్యూటీ ఈఓ ఎంపికయ్యా. మొదటి పోస్టింగ్ జనగాంలో.. ఇక్కడే ఎనిమిది సంవత్సరాలకు పైగా పనిచేశాను. అనంతరం గత సంవత్సరం పదోన్నతిపై వికారాబాద్ జిల్లా విద్యాధికారిగా వచ్చా. ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి.. మహిళలకు అన్నింటికన్నా విద్య ప్రధానం. ఆ తర్వాత ఆర్థిక స్వావలంబనకు అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించాలి. సాంకేతికపరమైన అంశాల్లో సమాజం అతివేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. ఇలాంటి అంశాల్లో మహిళలకు అవకాశాలు ఉండేలా చూడాలి. పాఠశాలలు, కళాశాల స్థాయిల్లోనే బాలికలకు వృత్తి విద్యాకోర్సుల్లో తర్ఫీదునివ్వాలి. దీంతో స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చదువులేని మహిళలకు కూడా కొన్ని రంగాల్లో ఆసక్తి, నైపుణ్యం ఉంటుంది. ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. ఒకప్పుడు బాలిలకు చదువెందుకులే.. అనే భావన ఉండేది ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, తదితర ఒకేషనల్ కోర్సులు విరివిగా ప్రవేశపెడితే మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించడానికి ఎంతో దోహద పడుతుంది. చాపలు అల్లడం, చీరలు నేయడం తదితర స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలి. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి మహిళలకు అవకాశం కల్పించాలి. బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయాలు మంచి ఫలితాలు రాబడుతున్నాయి. బాలికల పాఠశాలలో టైలరింగ్, ఒకేషనల్ కోర్సులు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నా. ఒకేచోట అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సంబంధించి భార్యాభర్తలకు (వర్కింగ్ ఉమెన్) ఒకేచోట పనిచేసేలా అవకాశం కల్పించాలి. లేదంటే పిల్లల పోషణ భారం, ఇంటిపని వర్కింగ్ ఉమెన్పైనే అధికంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేస్తే పని ఒత్తిడిని ఇరువురు పంచుకునే వీలుంటుంది. దీనికి సంబంధించి జీవోలు ఉన్నా సక్రమంగా అమలు కావడంలేదు’.-జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
మహిళల ఆరోగ్యం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో మంది నగర మహిళలు ఉద్యోగ వ్యాపకాల్లో తీరికలేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యమే సమాజ సౌభాగ్యంగా భావించిన ‘‘సాక్షి’ మీడియా గ్రూప్.. ‘నేను శక్తి’ పేరుతో జుహీ ఫెర్టిలిటీ సెంటర్‌తో కలిసి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 24న జేఎన్టీయూ సమీపంలోని మంజీరామాల్ వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనిక్ కన్సల్టేషన్, రక్త పరీక్షలు (గ్రూప్, షుగర్), బీపీ చెకప్, బీఎండీ (ఎముకల దృఢత్వ పరీక్షలు) ఉచితంగా చేయనున్నారు. కేపీహెచ్‌బీలోని ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్ వద్ద మామోగ్రఫీపై 50 శాతం, ఐవీఎఫ్, లాప్రోస్కోపిక్ సర్జరీపై రూ.10 వేల రాయితీతో సేవలు అందించనున్నారు.అపాయింట్మెంట్ కోసం 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
సింగర్ కౌసల్యతో ఇంటర్వ్యూ
-
మేమున్నామని..
మహిళలపై జరుగుతున్న దాడులు.. ఇబ్బందిపెట్టే ఆత్మన్యూనత ఆలోచనలు.. వారి రక్షణకుచిత్తూరు పోలీసులు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్త్ర్రీలకు కొండంత భరోసానిస్తున్నాయి. ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మీ భద్రతకు మేమున్నామంటూ పోలీసు యంత్రాంగం చూపుతున్న చొరవపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. చిత్తూరు అర్బన్: జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల రక్షణకు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అయిదు చోట్ల మహిళా విభాగాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కుప్పం, పుత్తూరు ప్రాంతాల్లో 20 మందితో ఏర్పాటైన ఈ విభాగంలో ప్రస్తుతం 78 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈ విభాగం పనితీరును మెచ్చుకున్న రాష్ట్ర పోలీసు శాఖ రూ.లక్ష రివార్డు కూడా అందజేసింది. సైకిల్‌యాత్ర తెచ్చిన మార్పు.. చిత్తూరు జిల్లాలో మహిళా ఆత్మహత్యలు నివారించి వారికి మేమున్నామనే (పోలీసులు) భరోసా కల్పించడానికి గతేడాది అక్టోబరులో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు 56 మండలాల్లో 1200 కి.మీ దూరం సైకిల్ ర్యాలీ చేపట్టి మహిళలకు ఆత్మసై ్థర్యాన్ని నింపారు. 44 రోజులపాటు సాగిన ఈ యాత్ర జిల్లాలో మహిళల ఆత్మహత్యల శాతాన్ని తగ్గించిందని పోలీసులు చెబుతున్నారు. 2015లో జిల్లాలో 142 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే..ఈ సంఖ్య 2016లో 167కు, గతేడాది 70కు పరిమితమయ్యింది. నిర్భయ పెట్రోలింగ్... పట్టణ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడానికి నిర్భయ పెట్రోలింగ్ పేరిట చిత్తూరులో దీన్ని ప్రారంభించారు. నాలుగు ఎలక్ట్రిక్ బ్యాటరీ సైకిళ్లతో జనావాసం ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో ఇక్కడ పోలీసులున్నారనే వాస్తవాన్ని గుర్తించడానికి సైకిళ్లపై మహిళా కానిస్టేబుళ్లు కనిపిస్తుంటారు. మా వాళ్లు విశ్వాసంతో ఉన్నారు.. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, వారి రక్షణకు మా ఎస్పీ గారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రతీ ఒక్క ప్రోగ్రామ్‌లో నాలుగు మీటింగ్‌లు పెట్టి.. రెండు మాటలు చెప్పడంతో మా బాధ్యత ముగిసిపోదు. ఫీల్డులో మహిళల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలి. వాళ్లల్లో ఆత్మసై ్థర్యం నింపాలి. ఇందు కోసం ముందు మా మహిళా పోలీసు అధికా రులు, కానిస్టేబుళ్లకు కాన్ఫిడెంట్ కావాలి. వీరందరితోనూ ఇప్పటికే పలు మార్లు సమావేశమై ఎలా పనిచేయాలి..? సమస్యలు వస్తే ఎలా స్పందించాలని చెబుతుంటాను.– జిఆర్.రాధిక, ఏఎస్పీ, చిత్తూరు. మార్పు వస్తుంది.. మూడు సంవత్సరాలకు పైనే ఈ విభాగంలో పనిచేస్తున్నా. అప్పటికి, ఇప్పటికి మహిళల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చింది. పల్లెలోకి మహిళలు సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పడం, చిన్న వాటికే డిప్రెషన్లోకి వెళ్లిపోయి సూసైడ్‌కు పాల్పడవద్దని వివరిస్తా ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీర్చేయడం వల్ల మాపై నమ్మకంగా ఉన్నారు. ఇది ఒకేసారి వచ్చే మార్పు కాదు. కొద్ది కొద్దిగా మొదలై ఒక రోజు తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. – సివి.హైమావతి,ఏఎస్ఐ, మహిళా స్టేషన్, చిత్తూరు. ఈ సారి హాకథాన్.. వచ్చేనెల జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో హాకథాన్ అనే కొత్త కార్యక్రమాన్ని చిత్తూరు పోలీసు శాఖ పరిచయం చేయబోతోంది. మహిళల ప్రతీ ఒక్క సమస్య పరిష్కారానికి విస్తృత స్థాయిలో చర్చించడమే హాకథాన్ లక్ష్యం. ఆసియాలో తొలిసారిగా మహిళా భద్రతపై హాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తీర్పు ఇవ్వండి... మహిళపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు బాధ్యత ఉన్న పౌరుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి సోషల్ మీడియా వేదికకగా చేపట్టిన మరో ప్రయత్నం ‘తీర్పుఇవ్వండి–మార్పుకోరండి’. ఠీఠీఠీ. ్చజ్చుఝట /ఛిజిజ్టీ్టౌౌటఞౌ జీఛ్ఛి అనే లింక్ ద్వారా కైజాలా యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ చేసుకుని ఓపీనియన్పోల్లో పౌరులు పాల్గొని అభిప్రాయాలను తెలియజేయవచ్చు. -
అమ్మే ఆదర్శం..
మొదటి నుంచి కష్టపడే తత్వం.. ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడవని వైనం.. అమ్మ నేర్పిన క్రమ శిక్షణతో చదువులో రాణింపు.. నాన్న లేకున్నా నలుగురు ఆడ పిల్లలున్న కుటుంబాన్ని ఒంటెద్దు బండిలా లాగిన తల్లిని ఆదర్శంగా తీసుకొని.. స్టెనోగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ.. అనతికాలంలోనే ఉన్నస్థానానికి ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ముదిగొండ తహసీల్దార్ రమాదేవి.. ఖమ్మం, ముదిగొండ: కొత్తగూడేనికి చెందిన మద్దెల సరోజిని, హనుమయ్యకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మద్దెల రమాదేవి, రెండో కూతురు శ్రీదేవి అంగన్వాడీ టీచర్, మూడో కుమార్తె పద్మజ ఎంఎస్సీ బీఈడీ, నాలుగో కుమార్తె అవంతి బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. తల్లి సరోజిని ఇంటర్ వరకు చదువుకొని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. తండ్రి హనుమయ్య సింగరేణి ఉద్యోగి. తండ్రి మరణానంతరం కుటుంబ భారం సరోజినిపై పడింది. ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూనే కుటుంబాన్ని సాకింది. కుమార్తెలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడింది. రమాదేవి కొత్తగూడెంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేటు గర్ల్స్ హైస్కూల్లో.. ప్రైవేటు కాలేజీలో ఇంటర్.. సింగరేణి డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం జూనియర్ స్టెనోగా 1999లో ఖమ్మంలోని కలెక్టరేట్లో ఉద్యోగం సంపాదించారు. చండ్రుగొండలో యూడీసీగా, దమ్మపేటలో ఆర్ఐగా, పెనుబల్లి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా, పని చేశారు. వరంగల్, అశ్వారావుపేటలో ఎలక్షన్ ఆఫీసర్, అనంతరం ముల్కలపల్లి, టేకులపల్లి మండల తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం ముదిగొండ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రమాదేవి భర్త ప్రసాద్ సివిల్ çసపై డీటీగా అశ్వారావుపేటలో పని చేస్తున్నారు. ఇదంతా అమ్మ వల్లే.. నేను చిరు ఉద్యోగి నుంచి తహసీల్దార్ స్థాయికి చేరుకోవడంలో నా తల్లి పాత్ర ఎనలేనిది. చిన్ననాటి నుంచి ఎంతో శ్రద్ధతో నన్ను చదివించింది. నాన్న లేకున్నా మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నలుగురు ఆడ పిల్లలని ఏ నాడు భయపడలేదు. నేను ఉన్నతంగా ఆలోచించడానికి కారణం మా అమ్మతో ఉన్న సాన్నిహిత్యమే.. ఆమె చూపిన మార్గంలో నడవడం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా.. విధుల విషయానికి వస్తే.. మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో, అధికారులతో మమేకమైపోతుంటా. నాకు సాధ్యమైనంత వరకు న్యాయం జరిగే విధంగా చూస్తా. నేను ఎక్కడినుంచి వచ్చానో నాకు తెలుసు.. నా మూలాలు మరిచిపోలేదు. కిందస్థాయి నుంచి వచ్చిన నేను పేదల సమస్యల పరిష్కారంలో ఎన్నటికీ రాజీపడను.. -
వైకల్యానికి నేస్తం.. ఆమె ఆత్మవిశ్వాసం..
జూబ్లీహిల్స్: వైకల్యంతో బాధపడేవారిని చూసి కొందరు ‘అయ్యో పాపం’ అని జాలి చూపిస్తారు. మరి కొందరు తోచిన సాయం చేస్తారు. ఓ రోజు సాయం చేసినందుకే ఎంతో ఆనందపడిపోతాం.. కానీ అలాంటివారి బతుకుకు భరోసా ఇచ్చేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఈ కోవకు చెందినవారే సామాజికవేత్త, సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మీరా షెనాయ్. వికలాంగులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇతరుల్లా వారూ కుటుంబానికి ఆసరాగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆత్మవిశ్వాసంతో బతిలేలా జీవితాలను మారుస్తున్నారు. ఇందుకోసం మీరా సమాజంతో ఓ యుద్ధమే చేశారు. వారి జీవితాల్లో వెలుగు నింపాలని.. మన దేశంలో సుమారుగా 2 కోట్ల మంది వివిధ రకాల శారీరక వైకల్యం, అంధత్వంతో బాధపడుతున్నారని ఓ అంచనా. వారిలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. సరైన అవగాహన, ప్రోత్సాహం లేక చాలా మంది చీకట్లోనే మగ్గిపోవడం బాధాకరం. వీరిలో సాధ్యమైనంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మేం పనిచేస్తున్నాం. మా ఈ కృషికి యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్, నాస్కామ్ ఫౌండేషన్, కాప్ జెమినీ తదితర కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. 2020 నాటికి కనీసం లక్ష మందికి శిక్షణ, ఉద్యోగాలు లభించేలా ప్రణాళిక రూపొందించాం. – మీరా షెనాయ్, ‘యూత్ 4 జాబ్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అభిరుచి.. సంస్థల అవసరం మేరకు.. మీరా జర్నలిజం చదువుకున్నారు. కార్పొరేట్ రంగంతో సంబంధాలున్నాయి. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్‌కు సారధ్యం వహించిన అనుభవమూ ఉంది. తన అనుభవాన్ని.. పరిచయాలను వికలాంగులకు చేయూతనిచ్చేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం ‘యూత్ 4 జాబ్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నారు. అంతేకాదు.. తనుకున్న కార్పొరేట్ పరిచయాలతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పైతం ఇప్పిస్తున్నారు. శారీరక వైకల్యం ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నా మీరా దారి చూపిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి ప్రభుత్వ అ«ధికారుల సాయం సైతం తీసుకుంటున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పూర్తిచేసి 18 నుంచి 31 ఏళ్ల లోపు వయసుండి 40 శాతం శారీరక వైకల్యం, 50 శాతం మూగ, చెవుడు ఉన్నవారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి కంటే తక్కువ చదువుకున్నవారి కోసం ఇటీవల ప్రత్యేక శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభించారు. వీరికి స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై రెండు నెలలు శిక్షణ ఉంటుంది. వారికి హాస్టల్, భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్నవారికి వివిధ కంపెనీల్లో వారి అభిరుచి, అవసరం బట్టి ఉపాధి చూపుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంటర్లో శిక్షణ పొందినవారు గూగుల్, అమెజాన్, వెబైనర్, యాక్సిస్ బ్యాంక్, లైఫ్‌స్టైల్, కేఎఫ్‌సీ, వింద్యా టెక్నాలజీస్, గీతాంజలి జెమ్స్ తదితర కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస ప్రారంభ వేతనం రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. సిటీలో మొదలై..ఆపై విస్తరించి.. మీరా షెనాయ్ 2012లో ‘యూత్ 4 జాబ్స్’ సంస్ధను ఏసీ గార్డ్స్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 22 శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది వికలాంగులు ఉద్యోగాలు పొందారు. ఇక్కడ సుశిక్షితులైన టీచర్లతో పాటు కార్పొరేట్ ప్రముఖులు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు స్వచ్ఛందంగా తరగతులు చెబుతుంటారు. ఈ సంస్థ రాకతో వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టయింది. నా జీవితమే మారిపోయింది.. మాది వరంగల్. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ వరకే చదివాను. యూత్ 4 జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ప్రస్తుతం వింద్యా టెక్నాలజీస్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తున్నా. శిక్షణ నా జీవితాన్ని మార్చేసింది. నాలో ఆత్మవిశ్వాసం నింపింది. నాకు ఉపాధి చూపించింది. – అశ్వని, కంప్యూటర్ ఆపరేటర్, వింద్యా టెక్నాలజీస్ భవిష్యత్ పై నమ్మకం పెరిగింది.. మాది లంగర్‌హౌజ్. మాటలు రావు. కనీసం వినబడదు. డిగ్రీ వరకు చదివుకున్నా. స్నేహితుల ద్వారా ఈ సంస్థలో చేరాను. గతంలో నిరాశ నిస్పృహల్లో బతికిన నాకు శిక్షణ పూర్తి పాజిటివ్ శక్తినిచ్చింది. త్వరలో శిక్షణ పూర్తి చేసుకొని మంచి జాబ్ సాధిస్తానని పూర్తి నమ్మకంతో ఉన్నాను. (ఈ వివరాలు సైగలతో చెప్పింది) – కె.ప్రియాంక (మూగ, చెవిటి), లంగర్‌హౌజ్ ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ,స్టాన్ఫోర్డ్ సోషల్ రివ్యూ తదితర జర్నల్స్ యూత్ 4 జాబ్స్ చేస్తున్న సేవలను కొనియాడాయి. మీరా ఆలోచనతో వికలాంగుల జీవితాల్లో వచ్చిన మార్పును ప్రపంచానికి చాటిచెప్పాయి -
పెరుగుతున్న గృహహింస మరణాలు
-
చదువు.. స్వేచ్ఛ
సూర్యాపేటటౌన్ : ‘‘ప్రస్తుతం ఉన్న సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించాలి.. తనకు నచ్చిన రంగంలో స్థిరపడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.. కుటుంబంనుంచి వారి పట్ల వివక్ష లేకుండా ఉండాలి.. అసమానతలు.. వేధింపులు.. అవమానాలు.. ఈ మూడింటిని అధిగమించినప్పు డే మహిళ ధైర్యంగా ముందుకెళ్తుంది’ అంటున్నారు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ. సాక్షి మహిళా క్యాం పెయిన్లో భాగంగా మహిళా సాధికారతపై ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే... తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని లక్ష్యం చేరే వరకు పోరాడాలి. దీనికి కుటుంబం నుంచి ప్రోత్సహం తప్పకుండా ఉండాలి. అమ్మాయిలపై కుటుంబంనుంచి వివక్ష లేకుండా చూడాలి. సమాజంలో అమ్మాయిలకు ఒక తీరు.. అబ్బాయిలకు ఒక తీరు.. కాకుండా సమానంగా హక్కులు కల్పించాలి. మహిళలపై వేధింపులు లేని సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కొంత మేరకు మహిళలపై వేధింపులు ఆపడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చినా.. అవి నామమాత్రంగా కాకుండా బలంగా అమలు చేయాలి. మహిళలపై వేధింపులు జరిగినప్పుడు మహిళలు బయటకు వచ్చి చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి. అలా కాకుండా మహిళలపై వేధింపులు జరిగినప్పుడు తక్షణమే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ప్రభుత్వం చూడాలి. చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడానికి షీటీం, తదితర చట్టాలను తీసుకొచ్చింది. కానీ షీటీం లాంటి చట్టాలపై మహిళలకు చైతన్యం తీసుకురావాలి. చట్టం ప్రకారం ఎంతటి వారినైనా శిక్షించాలి. ముఖ్యంగా మహిళలల్లో తమకు తాము తక్కువ అనే భావన పోవాలి. సమయ సందర్భాలను బట్టి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి. విద్య ద్వారానే విజ్ఞానం ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. కావున మహిళలు విద్యావంతులవ్వాలి. విద్యతోనే అందలం.. మహిళా సాధికారిత కోసం మహిళలు ఉన్నత చదువులు విద్యనభ్యసించాలి. విద్య ముఖ్యమైన సాధనం. ఆడిపిల్లలను వారి తల్లిదండ్రులు బాగా చదివించాలి. ఎలాంటి బేధాలు చూపించకూడదు. విద్య ద్వారానే విద్యావంతులవుతారు. జ్ఞానం సంపాదించినప్పుడే ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు. ఆడ పిల్లలను చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయవద్దు. శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహం జరిపించాలి. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. -
జీవామృతమే జీవనాధారం!
భర్తను కోల్పోయిన యువతికి బతుకుబాట చూపిన ప్రకృతి వ్యవసాయం. జీవామృతాల ఉత్పత్తులతో దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలందుకుంటున్న యువ మహిళా రైతు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన మహిళా రైతు కొండా ఉషారాణి విజయగాథ ఇది. ‘‘పదోతరగతి పూర్తికాగానే పదిహేడేళ్ల వయసులో పెళ్లి పేరుతో అత్తింట కాలు మోపాను. మూడున్నరేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగారు. సాఫీగా సాగుతున్న నా జీవితంలో భర్త సుధాకర్‌రెడ్డి ఆకస్మిక మరణం నాకో పెద్ద షాక్. ఏం చేయాలో తెలీదు. చంటిపిల్లలు. అర ఎకరం భూమి తప్ప ఆస్తులు లేవు. చదువు పెద్దగా లేదు. బిడ్డల్ని ఎలా సాకాలో దిక్కుతోచేది కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే మా అమ్మ సాయంతో సమీప గ్రామం కాజలో పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాను. రోజూ 12 గంటల డ్యూటీ చేసినా నెలాఖరుకు చేతిలో పడేవి రూ.1500. అవి ఏమూలకూ వచ్చేవి కావు. ఇలా కాదని రూ.20 వేలు పెట్టుబడితో చీరలు తెచ్చి, ఇంట్లోనే అమ్మసాగాను. కొన్ని రోజులు ఫర్వాలేదు అనిపించింది. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులతో పాటు చీరలూ ఎత్తుకుపోయారు. దీంతో మళ్లీ నా బతుకు ప్రశ్నార్ధకమైంది. ఉపాధి కోసం వెతుకులాట. బయో ఎరువుల మార్కెటింగ్ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. చుట్టు పక్కల రైతులు కొందరు సొంతంగా జీవామృతాలను తయారుచేసి వాడటం చూసేదాన్ని. బయో ఎరువుల కంపెనీ నుంచి అలాంటి మార్కెటింగ్ చేస్తే బాగుంటుందనిపించింది. ప్రయత్నించి చూద్దామని షాపుల వాళ్లను కలిసి, ఎరువుల శాంపిల్స్ తీసుకున్నాను. సంచిలో ఆ శాంపిల్స్ పెట్టుకొని ఆటోలో మంగళగిరి చుట్టుపక్కల 14 గ్రామాలు తిరుగుతూ మార్కెటింగ్ చేసేదాన్ని. సూర్యోదయంతో పాటే నా ప్రయాణం మొదలయ్యేది. ఉదయం 6.30 గంటలకు బయట కాలుపెడితే తిరిగొచ్చే సరికి చీకటి పడేది. చంటి బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోతున్నాను అనే నిస్సహాయత గుండెను పిండేస్తుండేది. కానీ, ఈ పని మానుకొంటే నా పిల్లల నోటికి నాలుగు మెతుకులు అందించేదెలా? అమ్మానాన్నలు ఎన్నాళ్లని సాయం చేస్తారు? అందుకే నా నడక ఆగేది కాదు. ఆశల సాగు ఈ క్రమంలోనే 2007–08లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. నా జీవితానికో ఆలంబన దొరుకుతుందన్న ఆశ మొలకెత్తింది. కాకినాడ, గుంటూరు, తిరుపతిలో శిక్షణ తరగతులకు హాజర య్యాను. ప్రతి అంశాన్నీ నోట్స్ రాసుకుని సొంతంగా ప్రకృతి సేద్య ప్రయోగాలు ఆరంభించాను. జీవామృత తయారీకి ఆవు కావాలి. కొనాలంటే డబ్బు లేక కొన్ని గోశాలల నుంచి గో మూత్రం, పేడ సేకరించేదాన్ని. ఉమ్మెత్త, వేపాకు, రావి, జిల్లేడు.. వంటి ఆకులను సేకరించి వీటితో జీవామృత కషాయాల తయారీని మొదలుపెట్టాను. వీటిని రైతులకు ఎలా అమ్మాలి.. నేను ఆచరణలో పెడితేనే నలుగురూ నమ్ముతారు. అందుకే మా ఆయన మిగిల్చి వెళ్లిన అర ఎకరం పొలం, పుట్టింటి వాళ్లిచ్చిన 40 సెంట్ల పొలంలో దొండ పందిరి, మినుము వేశాను. తర్వాత మునగ, అంతర పంటగా మిర్చి సాగు చేశాను. నా కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారున్నారు. సాధ్యమయ్యే పనికాదని నిరుత్సాహపరిచిన వారున్నారు. కానీ, మా అమ్మ నాకు అండగా నిలిచింది. పంటలకు నేను తయారు చేసిన జీవామృత కషాయాలను వాడాను. దిగుబడులు బాగానే వచ్చాయి. పంట మార్పిడి కోసం కాలీఫ్లవర్ వేశాను. ధరలు తగ్గిపోవడంతో నష్టం వచ్చింది. నాలుగేళ్లుగా మునగ, పసుపు, వరి పంటలు సాగు చేస్తున్నాను. తర్వాత 80 సెంట్లలో మినుము 4.5 క్వింటాళ్ల దిగుబడి రావడంతో అంతరపంటగా కూరఅరటి, చిక్కుళ్లు సాగు చేశాను. కిందటి సీజనులో 40 సెంట్లలో వేసిన మునగ నెలన్నర ముందుగానే దిగుబడినిచ్చింది. టన్నుకు పైగా మునగ కాయల దిగుబడి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మునగ, పసుపు, వరి పైర్లు సాగులో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర రెండు ఆవులు ఉన్నాయి. వీటి మూత్రం, పేడ, ఆకులతో చేసిన జీవామృతం మా పొలం వరకు సరిపోతాయి. నేను సాగుచేస్తున్న విధానాలు చూసిన రైతులు ఘన, ద్రవ జీవామృతాన్ని తయారుచేసిమ్మన్నారు. రైతుల ఆదరణతో కషాయాల ఉత్పత్తి రెండేళ్ల క్రితం ఊరి బయట మా సొంత స్థలంలోనే శ్రీవాసవీ దుర్గా ప్రకృతి వ్యవసాయ కషాయాల ఉత్పత్తుల యూనిట్‌ను స్థాపించాను. ప్రభుత్వం ఎన్‌పీఎం యూనిట్ కింద రూ.40 వేలు సబ్సిడీ ఇచ్చారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, దశపర్ణిక కషాయం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం సొంతంగా యూనిట్లో తయారీ చేస్తున్నాను. వీటికి కావల్సిన గోమూత్రం, పేడ గోశాలల నుంచి సేకరిస్తున్నాను. 2 కేజీల నుంచి 50 కేజీల వరకు వీటి ప్యాకింగ్ ఉంటుంది. వీటిని దాదాపు 150 మంది రైతుల వరకు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యంలో వినియోగిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. పూల నర్సరీల నిర్వాహకులు, మేడలపై ఇంటిపంటల సాగుదారులు, పల్నాడు రైతులు కూడా ఈ ఉత్పత్తులను కొని తీసుకెళుతున్నారు. ఒక్కోసారి డిమాండుకు సరిపడా సరఫరా చేయలేకపోయానే అనుకునే సందర్భాలూ ఉన్నాయి. ఇద్దరు పనివారిని పెట్టుకుని స్వయంగా ఈ పనులను చేస్తుంటాను. మా అమ్మ, పిల్లలూ ఈ పనిలో సాయం చేస్తుంటారు. ఖర్చునెలకు రూ.65 వేల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. నిపుణుల ప్రశంసలు ఈ విజయంతో ప్రకృతి వ్యవసాయ సలహాదారు విజయకుమార్, కెన్యాలోని వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీకి చెందిన నిపుణులు సహా పలువురు విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు మా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి, అభినందించారు. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం’’ అంటూ తన విజయగాథను వివరించారు ఉషారాణి. ఆమె (94948 49622) కల నెరవేరాలని ఆశిద్దాం. ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటునందిస్తే 500 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయించాలని, సమీప ఊళ్లలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలనేది నా ఆశయం – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
మహిళా మేలుకో..
రాయచోటి రూరల్ : ఈమె పేరు ఝాన్సీ లక్ష్మీ. రాయచోటి పురపాలక సంఘం కార్యాలయంలో జనన,మరణ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేతత్వం ఆమెది. అందుకోసం జిల్లా కేంద్రంలోని చైతన్య మహిళా సంఘంలో 16 ఏళ్ల క్రితం చేరింది. వరకట్న వేధింపులకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మార్చి 8వ తేది మహిళా దినోత్సవం పురస్కరించుకుని సాక్షి ఆమెతో మాట్లాడింది. నేటి సమాజంలో మహిళ చేస్తున్న పోరాటాలు, ఎదురవుతున్న అడ్డంకులపై తీవ్రంగా స్పందించారు.మాటలకే పరమితమైన ప్రభుత్వాలపై పోరాడాలని, హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్న : మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ? ఝాన్సీ : 1910లో యూరప్‌లో మహిళల పని గంటలను తగ్గించాలంటూ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ పోరాటంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కూడా కోల్పోయారు. 1910 మార్చి 8వ తేదిన క్లారాజెట్కిన్ అనే ఉద్యమ నాయకురాలు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపు నిచ్చింది. అప్పటి నుంచి పలు దేశాల్లో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. ప్రశ్న : నేటి సమాజంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు ? ఝాన్సీ :పాఠశాల బాలిక నుంచి కళాశాలల విద్యార్థినుల వరకు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ప్రతి నిత్యం ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలని, మోజు పడిన మహిళ తన సొంతం కావాలంటూ పలువురు ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బరితెగించి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం . ప్రశ్న : ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా ? ఝాన్సీ :ఎక్కడ తీసుకుంటున్నారు.. వాకపల్లి సంఘటనలో 11 మంది ఆదివాసీ మహిళలపై 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేస్తే, వారికి న్యాయం చేయాలని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయేషా హత్యలో ఒక కాంగ్రెస్ నాయకుడి బంధువు హస్తం ఉందని తెలిసి చట్టం కూడా మూగబోయింది . స్త్రీకి అన్ని విషయాల్లో సమానత్వం ఉండాలని నాయకులు సమావేశాల్లో చెబుతుంటారు. అయితే అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. కొన్ని సంధర్బాల్లో అధికారాల్లో ఉన్న పెద్దలు సైతం మహిⶠలను అగౌరవ పరస్తూ మాట్లాడుతున్నారు. ఇటువంటి వారు మహిళలకు ఏం న్యాయం చేస్తారు . ప్రశ్న : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై మీరేమంటారు ? ఝాన్సీ :ప్రస్తుతం విస్తారంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా బాలికలను, మహిళలను కించ పరిచే విధంగా వీడియోలు, ఫొటోలు ఉంటున్నాయి. దీని వల్ల కూడా యువత పక్కదారి పట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మహిళలపై, ముఖ్యంగా విద్యార్థినులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశ్న : మహిళలకు మీరిచ్చే సందేశం ? ఝాన్సీ :మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు . తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలి . హక్కుల కోసం, స్వేచ్ఛ సమానత్వం, సోషలిజం కోసం పోరాడి సాధించుకున్న శ్రామిక మహిళా పోరాటం స్పూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో స్త్రీ ముందుండాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించాలి. ఆకాశంలో సగం మనం ... పోరాటం చేద్దాం . ప్రశ్న : విద్యార్థినుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటి ? ఝాన్సీ : దేశ వ్యాప్తంగా ..ముఖ్యంగా రాష్ట్రంలోని పలు కళాశాలల్లో, మన జిల్లాలోని చైతన్య , నారాయణ కళాశాలల విద్యార్థినులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కళాశాలల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు చదువుకోవాంటూ ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం ఒక కారణం. విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్‌తో పాటు లైంగిక వేధింపులు కూడా మరో కారణంగా తెలుస్తోంది. దీని వెనుక అసలు విషయాలు ఏం ఉన్నాయో విచారించి ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పాటు ప్రభుత్వానికి కొమ్ము కాచే ఆయా కళాశాలలపై చర్యలు తీసుకోరు.