మహిళల ఆరోగ్యం కోసం.. | free medical camp for women | Sakshi
Sakshi News home page

మహిళల ఆరోగ్యం కోసం..

Published Wed, Feb 21 2018 8:28 AM | Last Updated on Wed, Feb 21 2018 8:28 AM

free medical camp for women - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎంతో మంది నగర మహిళలు ఉద్యోగ వ్యాపకాల్లో తీరికలేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యమే సమాజ సౌభాగ్యంగా భావించిన ‘‘సాక్షి’ మీడియా గ్రూప్‌.. ‘నేను శక్తి’ పేరుతో జుహీ ఫెర్టిలిటీ సెంటర్‌తో కలిసి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తోంది.

ఈ నెల 24న జేఎన్‌టీయూ సమీపంలోని మంజీరామాల్‌ వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనిక్‌ కన్సల్టేషన్, రక్త పరీక్షలు (గ్రూప్, షుగర్‌), బీపీ చెకప్, బీఎండీ (ఎముకల దృఢత్వ పరీక్షలు) ఉచితంగా చేయనున్నారు. కేపీహెచ్‌బీలోని ఎస్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ వద్ద మామోగ్రఫీపై 50 శాతం, ఐవీఎఫ్, లాప్రోస్కోపిక్‌ సర్జరీపై రూ.10 వేల రాయితీతో సేవలు అందించనున్నారు.అపాయింట్‌మెంట్‌ కోసం 95055 55020 నంబర్‌లో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement