బంగారమంటే ఇష్టపడని స్త్రీలు దాదాపు ఉండరనేది వాస్తవం.. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది తమ సంపాదనను గోల్డ్ కొనడం కంటే కూడా మంచి లాభాలను అందించే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
23 నుంచి 45 సంవత్సరాల మహిళలలో 40 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, మరో 40% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపుతున్నారని బ్యాంక్ బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ అధ్యయనంలో వెల్లడించింది.
కొందరు మహిళలు బంగారం కొనడం వంటివి పక్కన పెట్టి రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వర్కింగ్ ఉమెన్స్ ఆర్థిక రంగంలో మంచి అవగాహన పొందుతున్నారని, ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులను గురించి ఆరా తీస్తూనే ఉన్నారని స్పష్టమవుతోంది.
నిజానికి బంగారంలో పెట్టె పెట్టుబడి కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరింత లాభాలను అందిస్తాయని, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తాయి.
ఇదీ చదవండి: ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టినప్పుడు 12 నుంచి 15 శాతం పొటెన్షియల్ రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు, తప్పకుండా వాటిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment