Free medical camp
-
రైతు నగరంలో ఉచిత వైద్య శిబిరానికి మిశ్రమ స్పందన
నంద్యాల : పట్టణంలోని రైతు నగరంలో నేడు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ ఇమ్మడి అపర్ణ మాట్లాడుతూ..ఇమ్మడి వెంకటరామయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభించిందని తెలిపారు. వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, ప్రాథమిక పరీక్షలతో పాటు ఉచిత మందులు ఇచ్చారని శిబిరానికి వచ్చిన ప్రజలు తెలిపారు. ఇమ్మడి వెంకట రామయ్య సగర సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సగర విద్యార్థులకు లాసెట్, పోలీస్, రైల్వే, డీఎస్సీ, ఆర్మీ పరీక్షలకు ఉచిత శిక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు నగరం సగర సంఘ పెద్దలు ఆది నారాయణ, సుబ్బరాయుడు, శంకర్, వెంకటేశ్వర్లు, రామసుబ్బయ్య, సగర న్యాయవాది కూరాకుల చంద్ర శేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
నాట్స్, సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
న్యూ జెర్సీ: ఉత్తర అమెరికా తెలుగుసంఘం(నాట్స్), న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠంతో కలసి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 450 మందికి పైగా ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ, సాయిదత్త పీఠం బోర్డు ఛైర్మన్ రఘు శర్మ శంకరమంచి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణ చందర్ సిరికొండ, డా. సూర్యం గంటి, డాక్టర్ రమణశ్రీ గుమ్మకొండ, డా. విజయ నిమ్మ, డా. లక్ష్మీ దేవళరాజు, డా.రమేష్ అడబాల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలను అందించారు. చాలా మంది రోగులకు ఈ వైద్య శిబిరంలో ప్లూ షాట్స్ ఇచ్చారు. గతంలో లాగే ఈ సారి కూడా శైలజ నాళం, శ్యామ్ నాళం.. బీపీ, షుగర్ పేషంట్లకు ఉచితంగా చెకింగ్ మిషన్లు కూడా అందించారు. ఈ సారి ప్రత్యేకంగా ఎంపిక చేసిన డయాబెటిస్, రక్త పోటు, కొలెస్ట్రాల్, నొప్పులు తదితర వ్యాధులకు సంబంధించి 15 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పాటు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులపై పలు సలహాలు, సూచనలు చేశారు. నాట్స్ ఉపాధ్యక్షులు శ్యామ్ నాళం, రమేష్ నూతలపాటి ల నాయకత్వంలో, నాట్స్ డైరెక్టర్స్ మన్నవ మోహన కృష్ణ, రంజిత్ చాగంటి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం దిగ్విజయంగా జరిగింది. మురళీకృష్ణ మేడిచెర్ల, శ్యాం నాళం, రాజ్ అల్లాడ, చక్రధర్ వోలేటి, చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, శ్రీహరి మందాడి, వంశీ కృష్ణ వెనిగళ్ల, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ వెంకట్, శేషగిరి కంభంమెట్టు, కిరణ్ తవ్వ, గురు దేసు, లక్ష్మి మోపర్తి తదితర నాట్స్ నాయకులు ఈ ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. లాస్ ఏంజెల్స్ నుండి నాట్స్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కృష్ణ మల్లిన, స్థానిక తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) అధ్యక్షుడు సుధాకర్ ఉప్పల, కార్యదర్శి మధు రాచకుళ్ల కూడా విచ్చేసి తమ మద్దతు తెలియచేశారు. ఫ్లూ షాట్స్, డయాబిటిక్ కిట్స్‌ను ఉచితంగా అందించిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళంను నాట్స్ టీం సత్కరించింది. అవేంటిక్ మెడికల్ ల్యాబ్ నుండి యోగిని రాథోర్ తన బృందంతో వచ్చి ఏ1సి డయాబెటిస్, కొలెస్ట్రాల్ పై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు చేసి, సలహాలు కూడా అందించారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచిని, శిబిరం ఏర్పాటులో తోడ్పాటు అందించిన మురళీకృష్ణ మేడిచర్లను నాట్స్ టీం సత్కరించింది. సాయిదత్త పీఠం ఈ వైద్య శిబిరం నిర్వహణలో కావాల్సిన వసతి సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లను చేసింది. నాట్స్ ఇప్పటికే అమెరికాలో 70 కి పైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవే తన గమ్యమని చాటింది. ఇదే రోజు.. ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం సిపిఎ వెంకట్ ల పుట్టినరోజు కూడా కావడంతో మోహన కృష్ణ, రఘుశర్మలు శాలువా కప్పి సత్కరించారు. గత 25 సం. లుగా న్యూ జెర్సీ ప్రాంతంలో చిన్న పిల్లల వైద్యులు గా పేరుగాంచిన డా. సిరికొండ, టెక్సాస్ లోని ఫ్రెస్కో ప్రాంతానికి బదిలీ కానున్న సందర్భంలో స్థానిక నాట్స్ సభ్యులు, సాయి దత్త పీఠం బృందం కేక్ కట్ చేయించి, పుష్ప గుచ్చం, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రఘుశర్మ మాట్లాడుతూ, నాట్స్ సంస్థతో సాయి దత్త పీఠంకు గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం వాలంటీర్లను, నాట్స్ బృందాన్ని అభినందించారు. -
మహిళల ఆరోగ్యం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో మంది నగర మహిళలు ఉద్యోగ వ్యాపకాల్లో తీరికలేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యమే సమాజ సౌభాగ్యంగా భావించిన ‘‘సాక్షి’ మీడియా గ్రూప్.. ‘నేను శక్తి’ పేరుతో జుహీ ఫెర్టిలిటీ సెంటర్‌తో కలిసి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 24న జేఎన్టీయూ సమీపంలోని మంజీరామాల్ వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనిక్ కన్సల్టేషన్, రక్త పరీక్షలు (గ్రూప్, షుగర్), బీపీ చెకప్, బీఎండీ (ఎముకల దృఢత్వ పరీక్షలు) ఉచితంగా చేయనున్నారు. కేపీహెచ్‌బీలోని ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్ వద్ద మామోగ్రఫీపై 50 శాతం, ఐవీఎఫ్, లాప్రోస్కోపిక్ సర్జరీపై రూ.10 వేల రాయితీతో సేవలు అందించనున్నారు.అపాయింట్మెంట్ కోసం 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
వీరులను స్మరించుకుందాం
ఉచిత వైద్య పరీక్షలు:మాజీ సైనికుల సమ్మేళనానికి హాజరైన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మెడికల్, సర్జికల్, ఈఎన్టీ నిపుణులు పాల్గొన్నారు. ఈసీజీ, ఎకో పరీక్షలు చేసి తగు సూచనలు ఇచ్చారు. తరగని సంపదను ఆర్జించిన వారైనా తుదకు వట్టి చేతులతో మట్టిలో కలవాల్సిందే. కీర్తిని ఆర్జించిన వారు ఆచంద్రతారార్కం గుండెల్లో గుడి కట్టుకుంటారు. భారతజాతి స్వేచ్ఛా వాయువుల కోసం నిరంతరం పరితపించి వీర మరణం పొందిన జవాన్లు అలాంటి వారే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మాజీ సైనికుల సమ్మేళనంలో అమరవీరుల ఆత్మీయుల కళ్లు కన్నీటి సుడులయ్యాయి. ఈ సందర్భంగా అందజేసిన బహుమతుల్లో తమ వారిని బలిగొన్న తూటాల శబ్దాలు వినిపించాయో ఏమో బావురుమని విలపించారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సాయుధ దళాల వీరుల గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి బంధువుల సమస్యలు తెలుసుకునేందుకు మహాసమ్మేళనం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అర్కెలరీ సెంటర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, అమర జవానుల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆర్మీ బ్యాండ్ దేశభక్తిని పెంపొందించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణ సబ్ ఏరియా మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. సైనిక్ వెల్ఫేర్ ఏపీ డైరెక్టర్, ఎంవీఎస్ కుమార్, విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి వీరుల బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సమస్యలు, రుణాలు ఇతర అంశాలను పరిష్కరించేందుకు బ్యాంకు స్టాల్స్ ఏర్పాటుచేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే ఆనంద్ మాట్లాడుతూ మాజీ సైనికులు, యుద్ధ వితంతువులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలోని మాజీ సైనికులు, యుద్ధ వితంతువులను కలిసి సమస్యలు తెలుసుకుంటామన్నారు. -
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వైవీ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్బంగా గురువారం ఉదయం స్థానిక వన్‌టౌన్ స్వాతి రోడ్డులో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో 20 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. రూ.5లక్షల విలువ గల మందులు ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, పుణ్యశీల, శేఖర్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
మావోయిస్టులకు రెండే దారులు
లొంగిపోవడమా.. చావడమా: ఎస్పీ భాస్కరన్ చిట్యాల: ‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు.. తుప్పుపట్టిన సిద్ధాంతాలు అవలంభిస్తున్న మావోయిస్టు పార్టీలో ఉన్న వారికి లొంగిపోవ డమా.. లేదా చనిపోవడమా అనే మార్గాలే ఉన్నాయని’’జయశంకర్ భూపాల పల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. జిల్లాలోని చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని అందుగుతండాలో రెండు మండలాలకు చెందిన ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. -
మహేష్‌బాబు దత్తత గ్రామంలో ...
సిద్ధాపూర్(కొత్తూరు): సినీహీరో మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్న హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగి న ఈ శిబిరాన్ని ఎంపీడీఓ జ్యోతి ప్రారంభించా రు. విద్యార్థులతోపాటు, గ్రామస్తులకు పలురకా ల వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు ఇచ్చారు. లోపాలు ఉన్నవారిని శస్త్రచికిత్స చేరుుం చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శర్వానీ, ఈఓ పీఆర్డీ సాధన, అని ల్, సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బాల య్య, జంగయ్య, యువజన సంఘాలు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
7 నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలు
శ్రీకాకుళం అర్బన్: ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7వతేదీ నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి కె.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతపట్నం మండలం సోదా గ్రామంలో 7న, కంచిలి మండలం ముండావా గ్రామంలో 8న, ఎల్.ఎన్.పేట మండలం కడగండి గ్రామంలో 21న, మెళియాపుట్టి మండలం జెర్రిబద్ర గ్రామంలో 22న, మందస మండలం కొంకడాపుట్టి గ్రామంలో 28న ఈ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. -
బోడుప్పల్ లో రేపు ఉచిత వైద్యశిబిరం
హైదరాబాద్ : బోడుప్పల్ శ్రీనివాస్ నగర్ కాలనీ, అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్డులో ఉన్న మేథ ఇ-టెక్నో స్కూల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద ఉన్న స్పార్క్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఈ శిబిరంలో బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు, చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. వివరాలకు ఫోన్: 9912076200లో సంప్రదించాలని నిర్వాహకులు పేర్కొన్నారు. -
మావో ప్రభావిత ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం
జీకే వీధి (విశాఖపట్నం) : మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన జీకే వీధి మండలం సిరిబాలలో సోమవారం చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 500 మంది రోగులకు ఉచితంగా వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ఆరుగురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపడాలి : వెంకయ్యనాయుడు
వెంకటాచలం (నెల్లూరు) : దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల శిశువు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వైద్యం వెనుకబడి ఉందన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు వైద్యం, విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. -
లయన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో ఆదివారం నంద్యాల లయన్‌క్లబ్, కిమ్స్(సికింద్రాబాద్)వారి సహకారంతో లయన్‌క్లబ్(బేతంచర్ల) ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించింది. ఈ వైద్యశిబిరాన్ని అనంతపురం జిల్లా గుత్తి కోర్టు సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వైద్యశిబిరానికి పట్టణంలోని 300 మంది రోగులు వచ్చి చికిత్స తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు రోగులకు మందులు అందజేశారు. అట్టడగువర్గాల వారు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని లయన్‌క్లబ్ నిర్వాహకులు కోరారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కరీంనగర్ (మంథని) : కరీంనగర్ జిల్లా మంథనిలో వైఎస్సార్సీపీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ శిబిరంలో దాదాపు 500 మంది పేదలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే పలువురు రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. -
ఏప్రిల్ 26న కందవాడలో ఉచిత వైద్య శిబిరం
చేవెళ్ల (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడలో ఏప్రిల్ 26(ఆదివారం)న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్‌రెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్, అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. అన్ని రకాల జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ క్యాంపును ప్రారంభించడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రానున్నారని వివరించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. -
డోబీలో తెలుగు డాక్టర్ ల ఉచిత వైద్యశిబిరం
భివండీ, న్యూస్‌లైన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం డోబీ గ్రామంలో భివండీ ప్రాంతానికి చెందిన తెలుగు వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండలా జిల్లా నైనాపూర్ తాలూకా డోబీ గ్రామంలో బీద ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. కాగా, ఇక్కడ కొలువైన బసవరాజలింగేశ్వర స్వామి మందిర వార్షికోత్సవం ఇటీవల జరిగింది. దాన్ని పురస్కరించుకుని భివండీకి చెందిన వైద్యులు శ్రీపాల్ జైన్, మంచికట్ల వెంకటేశ్, ఆడెపు భగవాన్, క ళ్యాడపు భూమేశ్, ఎం.బి. రాజ్, జక్కని గణపతి, మెనగందుల సాయిబాబా తదితరులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. -
పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
సాక్షి, ముంబై: మాతృ దినోత్సవం సందర్భంగా వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి (పీఎస్ఎస్ఎం) ప్రాంగణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెవెన్ హిల్స్ ఆస్పత్రికి చెందిన వైద్యబృందం పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో దాదాపు 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో భాగంగా ఈసీజీ, కిడ్నీ, క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స నిర్వహించే ఏర్పాట్లు కూడా చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పల్లవి, డాక్టర్ రాజేంద్ర రోగులకు పరీక్షలు నిర్వహించారన్నారు. ముఖ్య అతిథిగా లైఫ్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ తెర్లేడ్నర్, గౌరవ అతిథిగా సమర్థ్ ఫౌండేషన్ ప్రతినిధి రాజేశ్ బాసూట్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాలను అజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గుజ్జేటి గంగాధర్ అధ్యక్షులుగా వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, కార్యాధ్యక్షుడు చింతకింది ఆనందం, ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్, కార్యదర్శి డాక్టర్ వీరబత్తిని చంద్రశేఖర్, సభ్యులు అశోక్, గాజంగి రమేష్, శేర్ల ప్రహ్లాద్, చావ పరమేశ్వర్, బొమ్మకంటి కైలా్ష్, నర్సింగ్, దుడుక అనురాధ, చిల్వేరి విజయ తదితరులు పాల్గొన్నారు. బ్లెస్డ్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో.... అంధేరీలోని పంప్‌హౌజ్ ‘బ్లెస్డ్ యూత్’ సంస్థ ఆధ్వర్యంలో మదర్స్‌డే సందర్భంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజోలులోని ‘రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డంబ్’లో బియ్యం, కందిపప్పు నూనె, బిస్కట్ ప్యాకెట్లను అక్కడి విద్యార్థులకు అందజేశారు. -
పత్రం.. పుష్పం.. ‘కలం’.. తోయం
అయినవిల్లి, న్యూస్‌లైన్ : ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం..’ ఇదీ సాధారణంగా దైవాన్ని అర్చించే క్రమం. అయితే.. అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రంలో బుధవారం ఈ క్రమంలో ‘కలం’ చేరింది. గత ఆరేళ్లుగా ఏటా పరీక్షలకు ముందు చేస్తున్న మాదిరే ఈ ఏడాది కూడా స్వామిని పెన్నులతో అభిషేకించారు. తొలుత ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు వివిధ ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. పండితులు ‘చదువుల పండుగ’ పేరుతో సరస్వతీ యాగం నిర్వహించి, లక్ష గరిక పూజ చేశారు. అనంతరం స్వామిని రెండు లక్షల పెన్నులతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు స్వామిని దర్శించుకుని పరీక్షల్లో విజయం వరించాలని వేడుకున్నారు. ‘చదువుల పండుగ, పెన్నుల అభిషేకం’ సందర్భంగా గర్భాలయంలో గరిక గడ్డితో సిద్ధివినాయకుని ఆకృతిని తీర్చిదిద్దారు. అర్చకులు మాచరి వినాయకరావు రెండు గంటల పాటు శ్రమించి ఈ గరిక గణపతిని రూపుదిద్దారు. స్వామికి కలువ రేకులతో నామాలు, పుష్పాలతో నేత్రాలు, నుదుట బొట్టు, దంతాలు అమర్చిన స్వామి ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నేడు విద్యార్థులకు పంపిణీ స్వామివారిని అభిషేకించిన పెన్నులను గురువారం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. పంపిణీని ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి ప్రారంభిస్తారన్నారు. పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఆలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత వైద్య శిబిరం వంటి సదుపాయాలకు ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు ఎండదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు నిర్మించారు. పెన్ను తీసుకున్న ప్రతి విద్యార్థీ అన్నదాన సత్రంలో స్వామివారి ప్రసాదం స్వీకరించాలని ఈఓ కోరారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు. ఆకట్టుకుంటున్న కళాకండాలు పురాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని తులాభారం, గజేంద్ర మోక్షం, హిరణ్యాక్షకుడనే రాక్షసు న్ని సంహరించి భూదేవిని కాపాడుతున్న శ్వేత వరాహస్వామి, మారువేషంలో వచ్చి సీతమ్మను భిక్షమడిగే రావణాసురుడు, మహిరావణుడనే రాక్షసున్ని సంహరించి రామలక్ష్మణులను భుజంపై తీసుకెళ్తున్న హనుమంతుడు వంటి సన్నివేశాలకు సంబంధించిన కళాకండాలు ఆకట్టుకుంటున్నాయి. పూలతో అలంకరించిన ఏనుగు బొమ్మ, కూరగాయలతో చేసిన కళాకృతులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి.