భివండీ, న్యూస్‌లైన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం డోబీ గ్రామంలో భివండీ ప్రాంతానికి చెందిన తెలుగు వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండలా జిల్లా నైనాపూర్ తాలూకా డోబీ గ్రామంలో బీద ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు.
కాగా, ఇక్కడ కొలువైన బసవరాజలింగేశ్వర స్వామి మందిర వార్షికోత్సవం ఇటీవల జరిగింది. దాన్ని పురస్కరించుకుని భివండీకి చెందిన వైద్యులు శ్రీపాల్ జైన్, మంచికట్ల వెంకటేశ్, ఆడెపు భగవాన్, క ళ్యాడపు భూమేశ్, ఎం.బి. రాజ్, జక్కని గణపతి, మెనగందుల సాయిబాబా తదితరులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
డోబీలో తెలుగు డాక్టర్ లఉచిత వైద్యశిబిరం
Published Tue, Nov 4 2014 11:30 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement