
నంద్యాల : పట్టణంలోని రైతు నగరంలో నేడు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ ఇమ్మడి అపర్ణ మాట్లాడుతూ..ఇమ్మడి వెంకటరామయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభించిందని తెలిపారు. వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, ప్రాథమిక పరీక్షలతో పాటు ఉచిత మందులు ఇచ్చారని శిబిరానికి వచ్చిన ప్రజలు తెలిపారు. ఇమ్మడి వెంకట రామయ్య సగర సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
సగర విద్యార్థులకు లాసెట్, పోలీస్, రైల్వే, డీఎస్సీ, ఆర్మీ పరీక్షలకు ఉచిత శిక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు నగరం సగర సంఘ పెద్దలు ఆది నారాయణ, సుబ్బరాయుడు, శంకర్, వెంకటేశ్వర్లు, రామసుబ్బయ్య, సగర న్యాయవాది కూరాకుల చంద్ర శేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment