
న్యూ జెర్సీ: ఉత్తర అమెరికా తెలుగుసంఘం(నాట్స్), న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠంతో కలసి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 450 మందికి పైగా ఈ వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ, సాయిదత్త పీఠం బోర్డు ఛైర్మన్ రఘు శర్మ శంకరమంచి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణ చందర్ సిరికొండ, డా. సూర్యం గంటి, డాక్టర్ రమణశ్రీ గుమ్మకొండ, డా. విజయ నిమ్మ, డా. లక్ష్మీ దేవళరాజు, డా.రమేష్ అడబాల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ విలువైన సేవలను అందించారు. చాలా మంది రోగులకు ఈ వైద్య శిబిరంలో ప్లూ షాట్స్ ఇచ్చారు. గతంలో లాగే ఈ సారి కూడా శైలజ నాళం, శ్యామ్ నాళం.. బీపీ, షుగర్ పేషంట్లకు ఉచితంగా చెకింగ్ మిషన్లు కూడా అందించారు. ఈ సారి ప్రత్యేకంగా ఎంపిక చేసిన డయాబెటిస్, రక్త పోటు, కొలెస్ట్రాల్, నొప్పులు తదితర వ్యాధులకు సంబంధించి 15 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పాటు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులపై పలు సలహాలు, సూచనలు చేశారు. నాట్స్ ఉపాధ్యక్షులు శ్యామ్ నాళం, రమేష్ నూతలపాటి ల నాయకత్వంలో, నాట్స్ డైరెక్టర్స్ మన్నవ మోహన కృష్ణ, రంజిత్ చాగంటి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం దిగ్విజయంగా జరిగింది. మురళీకృష్ణ మేడిచెర్ల, శ్యాం నాళం, రాజ్ అల్లాడ, చక్రధర్ వోలేటి, చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, శ్రీహరి మందాడి, వంశీ కృష్ణ వెనిగళ్ల, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ వెంకట్, శేషగిరి కంభంమెట్టు, కిరణ్ తవ్వ, గురు దేసు, లక్ష్మి మోపర్తి తదితర నాట్స్ నాయకులు ఈ ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. లాస్ ఏంజెల్స్ నుండి నాట్స్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కృష్ణ మల్లిన, స్థానిక తెలుగు కళా సమితి (టీఎఫ్‌ఏఎస్) అధ్యక్షుడు సుధాకర్ ఉప్పల, కార్యదర్శి మధు రాచకుళ్ల కూడా విచ్చేసి తమ మద్దతు తెలియచేశారు.
ఫ్లూ షాట్స్, డయాబిటిక్ కిట్స్‌ను ఉచితంగా అందించిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళంను నాట్స్ టీం సత్కరించింది. అవేంటిక్ మెడికల్ ల్యాబ్ నుండి యోగిని రాథోర్ తన బృందంతో వచ్చి ఏ1సి డయాబెటిస్, కొలెస్ట్రాల్ పై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు చేసి, సలహాలు కూడా అందించారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచిని, శిబిరం ఏర్పాటులో తోడ్పాటు అందించిన మురళీకృష్ణ మేడిచర్లను నాట్స్ టీం సత్కరించింది. సాయిదత్త పీఠం ఈ వైద్య శిబిరం నిర్వహణలో కావాల్సిన వసతి సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లను చేసింది. నాట్స్ ఇప్పటికే అమెరికాలో 70 కి పైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవే తన గమ్యమని చాటింది. ఇదే రోజు.. ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం సిపిఎ వెంకట్ ల పుట్టినరోజు కూడా కావడంతో మోహన కృష్ణ, రఘుశర్మలు శాలువా కప్పి సత్కరించారు. గత 25 సం. లుగా న్యూ జెర్సీ ప్రాంతంలో చిన్న పిల్లల వైద్యులు గా పేరుగాంచిన డా. సిరికొండ, టెక్సాస్ లోని ఫ్రెస్కో ప్రాంతానికి బదిలీ కానున్న సందర్భంలో స్థానిక నాట్స్ సభ్యులు, సాయి దత్త పీఠం బృందం కేక్ కట్ చేయించి, పుష్ప గుచ్చం, దుశ్శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా రఘుశర్మ మాట్లాడుతూ, నాట్స్ సంస్థతో సాయి దత్త పీఠంకు గతంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మున్ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం వాలంటీర్లను, నాట్స్ బృందాన్ని అభినందించారు.









Comments
Please login to add a commentAdd a comment