సాక్షి, ముంబై: మాతృ దినోత్సవం సందర్భంగా వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి (పీఎస్‌ఎస్‌ఎం) ప్రాంగణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెవెన్ హిల్స్ ఆస్పత్రికి చెందిన వైద్యబృందం పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో దాదాపు 150 మంది పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో భాగంగా ఈసీజీ, కిడ్నీ, క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స నిర్వహించే ఏర్పాట్లు కూడా చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పల్లవి, డాక్టర్ రాజేంద్ర రోగులకు పరీక్షలు నిర్వహించారన్నారు.
ముఖ్య అతిథిగా లైఫ్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ తెర్లేడ్‌నర్, గౌరవ అతిథిగా సమర్థ్ ఫౌండేషన్ ప్రతినిధి రాజేశ్ బాసూట్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాలను అజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గుజ్జేటి గంగాధర్ అధ్యక్షులుగా వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, కార్యాధ్యక్షుడు చింతకింది ఆనందం, ధర్మకర్తల చైర్మన్ మంతెన రమేష్, కార్యదర్శి డాక్టర్ వీరబత్తిని చంద్రశేఖర్, సభ్యులు అశోక్, గాజంగి రమేష్, శేర్ల ప్రహ్లాద్, చావ పరమేశ్వర్, బొమ్మకంటి కైలా్‌ష్, నర్సింగ్, దుడుక అనురాధ, చిల్వేరి విజయ తదితరులు పాల్గొన్నారు.
బ్లెస్డ్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో....
అంధేరీలోని పంప్‌హౌజ్ ‘బ్లెస్డ్ యూత్’ సంస్థ ఆధ్వర్యంలో మదర్స్‌డే సందర్భంగా ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజోలులోని ‘రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డంబ్’లో బియ్యం, కందిపప్పు నూనె, బిస్కట్ ప్యాకెట్లను అక్కడి విద్యార్థులకు అందజేశారు.
పీఎస్‌ఎస్‌ఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
Published Mon, May 12 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement