ఏప్రిల్ 26న కందవాడలో ఉచిత వైద్య శిబిరం | free medical camp on april 26th | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 26న కందవాడలో ఉచిత వైద్య శిబిరం

Published Sat, Apr 25 2015 7:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

free medical camp on april 26th

చేవెళ్ల (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడలో ఏప్రిల్ 26(ఆదివారం)న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్‌రెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్, అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. అన్ని రకాల జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

ఈ క్యాంపును ప్రారంభించడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రానున్నారని వివరించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement