kandawada
-
మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి. ఈ బస్సులు నానల్‌నగర్, లంగర్‌హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, గోల్డెన్‌ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి. మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు తిరిగి మెహిదీపట్నంకు బయలుదేరుతాయి. -
ఏప్రిల్ 26న కందవాడలో ఉచిత వైద్య శిబిరం
చేవెళ్ల (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కందవాడలో ఏప్రిల్ 26(ఆదివారం)న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాశంకర్‌రెడ్డి తెలిపారు. రోటరీ క్లబ్, అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. అన్ని రకాల జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ క్యాంపును ప్రారంభించడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రానున్నారని వివరించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.