మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు | Mehdipatnam to Kandawada TS RTC | Sakshi
Sakshi News home page

మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు

Published Tue, Jul 30 2024 10:16 AM | Last Updated on Tue, Jul 30 2024 10:16 AM

Mehdipatnam to Kandawada  TS RTC

సాక్షి, హైదరాబాద్‌: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్‌లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి. 

ఈ బస్సులు నానల్‌నగర్, లంగర్‌హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్‌ అకాడమీ జంక్షన్, గోల్డెన్‌ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి. 

మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు  తిరిగి మెహిదీపట్నంకు  బయలుదేరుతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement