లత, విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న లత
ఇల్లు, కాలేజీ తప్ప మరో లోకం లేకుండా ఇంటర్ పూర్తయింది. 17ఏళ్లకేపెళ్లయింది. అయితే అందరిలాతన జీవితం వంటింటికే పరిమితంకావొద్దని, తన కాళ్ల మీద తానునిలబడాలని నిర్ణయించుకుంది.
భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించింది. జీవితమంటే తానుబతకడం కాదు... పది మందినిబతికించడంలోనే అసలు అర్థం ఉందని భావించింది. సమాజాన్నిసరికొత్తగా చూడాలనుకుంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ‘ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ఆమే నిజాంపేట్‌కు చెందిన లతాచౌదరి.
సాక్షి, సిటీబ్యూరో: జీవితంలోస్థిరపడిపోయిన లతాచౌదరి... అంతటితో రిలాక్స్ అయిపోకూడదని అనుకుంది.వివక్షపైపోరాడాలనుకుంది. అందుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో 2004లో ‘ఉమన్ వెల్ఫేర్‌సర్వీస్ ఆర్గనైజేషన్’ను స్థాపించింది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి, మహిళా సాధికారత, హక్కులు, సేవ్ ఏ చైల్డ్, డొమెస్టిక్‌వాయొలెన్స్‌పై ఈ సంస్థ పనిచేస్తోంది.
వాట్సప్ గ్రూప్‌లో అవగాహన..
‘ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చదివి పెళ్లయ్యాక వంటింటికి పరిమితమవుతున్నారు. ఈ సమయంలో చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారికి వ్యాపార ఆలోచనలున్నా.. పెట్టుబడికి ఇబ్బంది అవుతోంది. ఇంకొంత మందికి డబ్బుంటే... ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి? తెలియడం లేదు. ఇలాంటి వారికోసమే సంస్థ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అదే విధంగా లైంగిక దాడులకు గురైన ఆడపిల్లలకు మనోధైర్యాన్నిస్తూ... సమాజంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్‌లో వలంటరీ డాక్టర్లు, అడ్వొకేట్స్, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు... ఇలా ఎంతో మంది ఉన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, లోలోపల కుంగిపోయే వారికి పరిష్కారాలు చూపుతున్నామ’ని చెప్పారు లత.
ఉపాధి శిక్షణ...
మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ మేకింగ్, బేకింగ్, అల్లికలు, బొమ్మల తయారీ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణిస్తున్నాం. వారిని మోటివేట్ చేసి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మనోధైర్యాన్నిస్తున్నాం. విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేద గర్భిణీలకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ... ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? తదితర వివరిస్తున్నామ’ని చెప్పారు లతా చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment