Women Welfare Association
-
బాబు వ్యాఖ్యలు దారుణం
సాక్షి, అమరావతి: మహిళా పోలీసులు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్యభర్తల అక్రమ సంబంధాలపై సర్వే చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా అవమానించారని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే వ్యక్తి.. ఈ విధంగా మహిళలను కించపరచడం దారుణమని పేర్కొంది. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గురువారం మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ డి.మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ఎంవీఎన్ దుర్గా, గౌసియాబేగం, గీత తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. చదవండి: (Fact Check: ప్రాణాలు పోతున్నా టీడీపీ ప్రచార యావ.. ఈ వీడియోలే నిదర్శనం) -
బీబీనగర్ : నిరుపయోగంగా మండల సమాఖ్య భవనం
సాక్షి, బీబీనగర్ : మండల కేంద్రంలోని మహిళా సంఘాల సౌలభ్యం కోసం నిర్మించిన మండల సమాఖ్య భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భవనం కాస్త నిరుపయోగంగా మారింది. పోచంపల్లి చౌరస్తా సమీపంలో మండల సమాఖ్య భవన నిర్మాణానికి 2011లో బీఆర్జీఎఫ్ నిధుల నుంచి రూ.11లక్షలు మంజూరయ్యాయి. దీంతోఅప్పటి జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ భవన నిర్మాణం చివరి దశలో ఉండగా నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది. స్త్రీ శక్తి భవనం నిర్మించడంతో.. మండల సమాఖ్య భవనం నిర్మాణం జరుగుతున్న సమయంలో స్త్రీ శక్తి భవనం మంజూరైంది. దీంతో ఈ భవనం నిర్లక్ష్యానికి గురికాగా స్త్రీ శక్తి భవనం నిర్మాణ పూర్తి చేశారు. దీంతో మండల మహిళా సమాఖ్య సంఘాలు ఈ భవనాన్ని వినియోగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న మండల సమాఖ్య భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారి బూత్ బంగ్లాగా దర్శనమిస్తున్న భవనాన్ని మరో ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణాన్నిపూర్తిచేయాలి మండల సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయడంతో భవనం అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించాలని కోరుతున్నాం. – బెండ ప్రవీణ్, బీబీనగర్ -
ఆమె సంక్షేమమే ధ్యేయం
ఇల్లు, కాలేజీ తప్ప మరో లోకం లేకుండా ఇంటర్ పూర్తయింది. 17ఏళ్లకేపెళ్లయింది. అయితే అందరిలాతన జీవితం వంటింటికే పరిమితంకావొద్దని, తన కాళ్ల మీద తానునిలబడాలని నిర్ణయించుకుంది. భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. జీవితమంటే తానుబతకడం కాదు... పది మందినిబతికించడంలోనే అసలు అర్థం ఉందని భావించింది. సమాజాన్నిసరికొత్తగా చూడాలనుకుంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ‘ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ఆమే నిజాంపేట్‌కు చెందిన లతాచౌదరి. సాక్షి, సిటీబ్యూరో: జీవితంలోస్థిరపడిపోయిన లతాచౌదరి... అంతటితో రిలాక్స్ అయిపోకూడదని అనుకుంది.వివక్షపైపోరాడాలనుకుంది. అందుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో 2004లో ‘ఉమన్ వెల్ఫేర్సర్వీస్ ఆర్గనైజేషన్’ను స్థాపించింది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి, మహిళా సాధికారత, హక్కులు, సేవ్ ఏ చైల్డ్, డొమెస్టిక్వాయొలెన్స్పై ఈ సంస్థ పనిచేస్తోంది. వాట్సప్ గ్రూప్‌లో అవగాహన.. ‘ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చదివి పెళ్లయ్యాక వంటింటికి పరిమితమవుతున్నారు. ఈ సమయంలో చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారికి వ్యాపార ఆలోచనలున్నా.. పెట్టుబడికి ఇబ్బంది అవుతోంది. ఇంకొంత మందికి డబ్బుంటే... ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి? తెలియడం లేదు. ఇలాంటి వారికోసమే సంస్థ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అదే విధంగా లైంగిక దాడులకు గురైన ఆడపిల్లలకు మనోధైర్యాన్నిస్తూ... సమాజంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్‌లో వలంటరీ డాక్టర్లు, అడ్వొకేట్స్, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు... ఇలా ఎంతో మంది ఉన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, లోలోపల కుంగిపోయే వారికి పరిష్కారాలు చూపుతున్నామ’ని చెప్పారు లత. ఉపాధి శిక్షణ... మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ మేకింగ్, బేకింగ్, అల్లికలు, బొమ్మల తయారీ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణిస్తున్నాం. వారిని మోటివేట్ చేసి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మనోధైర్యాన్నిస్తున్నాం. విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేద గర్భిణీలకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ... ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? తదితర వివరిస్తున్నామ’ని చెప్పారు లతా చౌదరి. -
చెల్లెమ్మలకు టోకరా
ఏడాదైనా మాఫీ కాని డ్వాక్రా రుణాలు రుణాలు చెల్లించాలంటూ మహిళలపై అధికారుల ఒత్తిడి రుణాలు మాఫీ కాకపోవటంతో కొత్త రుణాలు ఇవ్వని వైనం మొదట్లో మాఫీ రూ.10 వేలన్నారు.. ఇప్పుడు రూ.3 వేలకు తగ్గించారు బాబు జమానాలో.. దగాపడ్డ పొదుపుమహిళ నా పేరు వాకాటి రాజేశ్వరమ్మ, మాది కల్లూరు కొత్తపాళెం. నేను సాయినాథ పొదుపు గ్రూపు లీడర్‌గా ఉన్నాను. మండలంలోనే మంచి గ్రూపుగా అధికారులచే మన్ననలు పొందిన మేం ఇప్పుడు బాబు పుణ్యమా అంటూ ఇబ్బం దులు పడుతున్నాం. రూ. 3 లక్షలు రుణం తీసుకుని రూ.75 వేలు వడ్డీ కడుతున్నాం. ఇచ్చే ఆ రూ.3 వేలు నువ్వే ఉంచుకో. సింగపూర్, చైనా పర్యాటనకైనా పనికొస్తుంది. నా పేరు యర్రమతి వజ్రమ్మ. మాది వాకాడు మండలం కొత్తపాళెం నేను గణపతి గ్రూపులో ఉన్నాను. మా గ్రూపు తరఫున రూ.3 లక్షలు రుణం తీసుకున్నాం. రుణమాఫీ పేరుతో కట్టడం మానేశాం. రుణమాఫీ జరగకపోగా మా గ్రూపునకు రూ.70 వేలు వడ్డీభారం పడింది. మేం దాచుకున్న పొదుపు డబ్బంతా నిలువునా జమ చేసుకున్నారు. తెలివైన మోసగాడు ఎవరని అడిగితే చంద్రబాబేనని చెప్పాలి. సాక్షిప్రతినిధి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు అధికారం కోసం ‘పొదుపు మహిళలూ మీరు తీసుకున్న రుణాలు బ్యాంకులకు కట్టొద్దు. మనం అధికారంలోకి వస్తున్నాం. వచ్చాక మీ రుణాలన్నీ నేను తీరుస్తాను. మీకు టీడీపీ తరుఫున భరోసా ఇస్తున్నాను. నన్ను నమ్మండి. టీడీపీకి ఓటేయండి’ అని హామీ ఇచ్చారు. బాబు మాటలు నమ్మిన జనం ఆయనకు ఓట్లేసి.. తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ కూడా కట్టకుండా నిలిపేశారు. దీంతో అసలు, వడ్డీ పెరిగి పోయింది. సాధారణ రుణాలకు మొదటి ఏడాదికి వడ్డీ మొత్తం రూ.39.06 కోట్లు. చంద్రబాబు ప్రకటనతో ఏప్రిల్ వరకు అదనంగా చెల్లించాల్సినమొత్తం రూ.98.12 కోట్లు. అసలు, వడ్డీలు చెల్లించాలంటూ ఇటీవల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకున్న రుణాలు చెల్లించేలా డ్వాక్రా లీడర్లు కృషిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశా రు. దీంతో బ్యాంకు అధికారులు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో తిరిగారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే గ్రూపును రద్దుచేస్తామని హెచ్చరించారు కూడా. మాఫీ హామీతో నష్టపోయిన మహిళలు బాబు ఇచ్చిన హామీతో డ్వాక్రాసభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరులో ఓ మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.3లక్షలు రుణం తీసుకున్నారు. ఎన్నికల ముందు బాబు మాఫీ వాగ్దానం చేయడంతో అప్పటి నుంచి రుణాలు కట్టడం మానేశారు. ఏడాది కావస్తుండటంతోనెలకు రూ.18వేల చొప్పున రూ.2.16 లక్షలతో పాటు వడ్డీ చెల్లించమని అధికారులు మహిళలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా చేస్తామని హెచ్చరిస్తున్నట్లు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 2014-2015కి జిల్లాలోని డ్వాక్రా సభ్యులకు వివిద బ్యాంకులు రూ.665 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రుణమాఫీ ప్రకటనతో డ్వాక్రా సభ్యులు అసలు, వడ్డీ చెల్లించకపోవటంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వకపోవటం గమనార్హం. మొన్న రూ.10 వేలు.. నేడు రూ.3 వేలు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాకపోవటంతో మహిళల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో సీఎం చంద్రబాబు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. అదికూడా చెల్లించటం ఇష్టం లేక కొద్దిరోజులకు రూ.3వేలకు తగ్గించారు. గత ఏడాది మార్చి 31 నాటికి సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి మాత్రమే రూ.3వేలు చెల్లిస్తామని ప్రభుత్వం నిబంధనపెట్టింది. అదే విధంగా సంఘంలో సభ్యురాలిగా ఉంటూ మొబైల్ బుక్కీపింగ్, డేటాబేస్‌లో వారి పేరు లేకుంటే రూ.3వేలు ఇవ్వరు. ఆధార్‌ను అన్లై న్లో సీడింగ్ చేయకపోయినా అనర్హులే. ప్రభుత్వం ఇచ్చే రూ.3 వేలును నేరుగా సభ్యులకు ఇవ్వరు, వ్యక్తిగత ఖాతాలో జమచేయరు. సంబంధిత గ్రూపు ఖాతాలో మాత్రమే జమచేస్తారు. తీసుకున్న రూ.3వేలకు వడ్డీ చెల్లిస్తుండాల్సిందే.