event management
-
ఉరకలేసేలా.. ఊపునిచ్చేలా..
ఓ వైపు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే సంప్రదాయ నాట్యాలు.. మరోవైపు అత్యాధునికతకు పట్టం కట్టే అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్స్.. అంబరాన్ని తాకే అద్భుతమైన పెళ్లి వేడుకలు.. రంగుల హంగుల హోలీ వేదికలు.. నగరం అంటే ఇప్పుడో ఈవెంట్ల సాగరం. ఓ వైపు ఈవెంట్స్‌కు పెద్దన్న లాంటి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నూతన కాంతులీనాలని నగర ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం ఆకాంక్షిస్తోంది. అందుకు గాను ప్రభుత్వ సహాయ సహకారాలను కోరుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈవెంట్స్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రంగంలో ఈవెంట్ మేనేజర్లు, సౌండ్ లైట్ వీడియో ప్రొవైడర్లు, డెకరేటర్లు, డిజైనర్లు తదితర విభిన్న క్రాఫ్ట్‌లను కలిగి ఉన్న నగర ఈవెంట్ రంగం దేశంలోనే నంబర్ 1గా దూసుకుపోతోంది. పెద్ద సంఖ్యలో కళాకారులు, క్యాటరర్లు, ఈవెంట్ వేదికల యజమానులు, కన్వెన్షన్ కేంద్రాలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ఈవెంట్ రంగానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమ గుర్తింపు కావాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రతినిధులు కోరుతున్నారు. టీసీఈఐలో 400 మంది సభ్యులు, 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారికంగా ఈవెంట్ మార్కెట్ పరిమాణం రూ.800 కోట్ల అసంఘటిత రంగంలో కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగం ఏటా 16% చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది. కోర్సులకు శ్రీకారం.. విస్తృత అవసరాలను కలిగి ఉన్న ఈవెంట్ రంగం వైపు నిపుణులను ఆకర్షించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో టీసీఈఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సుల పట్ల యువతలో ఆసక్తి పెంచడానికి వీటిని ఉపాధి ఆధారితంగా మార్చడానికి, టీసీఈఐ ప్రభుత్వ సహకారం కోరుతోంది. సింగిల్ విండోతో సమస్యలకు చెక్... ఈవెంట్ నిర్వహణ కత్తిమీద సాము. ముఖ్యంగా ఇందులో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కాలం వృథా వల్ల కలిగే నష్టం ఒక్కోసారి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ల నిర్వహణకు కావాల్సిన అనుమతుల కోసం అనేక ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగే అవసరం తప్పించాల్సిందిగా టీసీఈఐ చాన్నాళ్లుగా కోరుతోంది. అన్ని రకాల అనుమతులూ ఒకే చోట క్లియర్ అయ్యేలాగా విండో క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తోంది. గత ప్రభుత్వం అందించిన సహకారంతో ఈవెంట్స్ రంగం కొత్త పుంతలు తొక్కిందనీ నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం అంతకు మించిన ప్రోత్సాహం అందిస్తుందని, ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే కృషిలో చేయూత అందిస్తుందని టీసీఈఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సిటీ ఏర్పాటు కావాలి.. నగరంలోని ఈవెంట్స్, మేనేజర్ల టాలెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. దీనికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు అవసరం. ప్రపంచ స్థాయి ఈవెంట్లు – కాన్ఫరెన్స్‌ల నిర్వహణను సులభతరం చేయడానికి, భారీ కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అరేనాలు, అవుట్డోర్ ఈవెంట్ అరేనాలు, మోటర్ స్పోర్ట్స్ రేసింగ్ ట్రాక్‌లు, హోటళ్లు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తుల హౌసింగ్ వంటివన్నీ ఒకే చోట నెలకొల్పే విధంగా ఒక ఈవెంట్ సిటీని ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీనిని నగరానికి 80–100 కి.మీ లోపల ఈవెంట్ సిటీని సృష్టించేందుకు వీలుంది. ఇలాంటి ప్రతిపాదనలతో కొత్త ప్రభుత్వ సారధులను త్వరలోనే కలవనున్నాం. – రవి కుమార్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ -
‘వెడ్డింగ్’ ఈవెంట్ ట్రెండింగ్.. ఈవెంట్ మేనేజ్మెంట్పై స్పెషల్ ఇంట్రెస్ట్
కర్నూలు (టౌన్): పెళ్లంటే పందిళ్లు.. తాళాలు..తలంబ్రాలే కాదు..సరికొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా వీటికి జత కలిసింది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లి చేయాలంటే హైరానా పడేవారు. సమయానికి ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాన్ని సులువు చేసింది. పెళ్లి ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు అంతా వారే చూసుకుంటున్నారు. జీవన శైలిలో మార్పుతో.. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధువులంతా తలా ఒక చేయి వేసి పెళ్లి తంతును నడిపించేవారు. వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలవుతుంది. నిశ్చితార్థం, మూహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, హోమం, అరుంధతీ నక్షత్ర దర్శనం ఇలా వివాహ వేడుకలో కీలక ఘట్టాలు ఉంటాయి. కుటుంబసభ్యులు, బంధువులు కలిస్తే తప్ప ఈ తంతు సజావుగా సాగదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. మారిన జీవన శైలితో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. వివాహ వేడుకల్లో పనిచేసే బంధువులు కరువయ్యారు. దీంతో చాలా మంది ఈవెంట్ మేనేజ్మెంట్పై ఆధారపడ్డారు. ( ఫైల్ ఫోటో ) సినిమాటిక్ ఈవెంట్‌లా.. భారీ సెట్టింగ్‌లు.. ఎల్ఈడీ స్క్రీన్లు..అర్కెస్ట్రా..తదితర హంగులతో సినిమాటిక్ ఈవెంట్‌లా వివాహాలు జరు గుతున్నాయి. మేకప్ ఆర్టిస్టులు, క్యాటరింగ్ సర్వీసెస్, వెల్కమ్ గర్ల్స్... ఇలా సరికొత్తగా వేడుక సాగుతోంది. గతంలో ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు వివాహ తంతును పర్యవేక్షణ చేసేవారు. నేడు యువతీయువకుల అభీష్టాల మేరకు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. క్యాటరింగ్లో వినూత్న మార్పులు పెళ్లి వేడుకలో షడ్రుచులతో భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీ. ఇప్పుడు క్యాటరింగ్లో మార్పులు వచ్చాయి. పనస పండు బిర్యానీ నుంచి రాయలసీమ రుచులు, కోనసీమ రుచులు, హైదరబాద్ బిర్యానీ వరకు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. వెడ్డింగ్, కార్పొరేట్, సోషల్ ఈవెంట్ క్యాటరింగ్‌లకు డిమాండ్ ఉంటోంది. కర్నూలు నగరంలో 10 వరకు పెద్ద స్థాయి క్యాటరింగ్‌లు ఉన్నాయి. వంట మనుషులను హైదరాబాద్ నుంచి కర్నూలు రప్పిస్తున్నారు. అతిథులకు ప్రత్యేక వంటకాలు అందించేందుకు కొంత మంది ఖర్చుకు వెనుకాడడం లేదు. సొంతంగా పెళ్లి మంటపాలు ఒకరు వాడిన మంటపాలు, షామియానాలు, సైడ్‌వాల్స్ కాకుండా ఉన్నస్థాయి వర్గాల వారు సొంతంగా పెళ్లి మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ఈవెంట్ మేనేజర్లు జర్మన్ హ్యాంగర్లు తెప్పిస్తున్నారు. బెస్ట్ ఫాక్ట్ వెడ్డింగ్ పేరుతో 3 వేల మంది నుంచి 10 వేల మందితో పెళ్లి తంతును ఘనంగా జరిపిస్తున్నారు. కర్నూలు నగరంలో 3 వేల మందితో ఎన్నో వివాహ కార్యక్రమాలు జరిగాయి. పెళ్లి మంటపాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిర్మిస్తారు. డెకరేషన్ కోసం బెంగళూరు నుంచి పూలను తెప్పిస్తున్నారు. కాక్టెయిల్ పారీ్టలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్ లైటింగ్.. ఇలా వివాహ తంతులో అధునికత కనిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సంప్రదాయాలను కొనసాగిస్తూ ఘనంగా వివాహం చేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ మార్కెట్లోకి వచ్చింది. సినిమా ఈవెంట్స్ తరహాలో వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – సందీప్, ఈవెంట్ మేనేజర్, కర్నూలు కోరిన భోజనం అందిస్తున్నాం పెళ్లిళ్లలో క్యాటరింగ్ సంస్కృతి పెరిగింది. నిర్వాహకులు కోరిన విధంగా వంటకాలు తయారు చేస్తున్నాం. రైస్, పలావ్, 24 రకాల టిఫిన్స్, 53 రకాల స్వీట్. 25 రకాల నార్త్ ఇండియన్ ఐటమ్స్, నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, నాటుకోడి..ఇలా 30 రకాల వంటకాలు అందిస్తున్నాం. హైదరాబాద్ నుంచి వంటవారిని రప్పిస్తున్నాం. – ఆవుల లింగన్న, క్యాటరింగ్ నిర్వాహకుడు. -
ఐపీఎల్‌కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్‌ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్‌కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్‌తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్‌లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో... 15న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
రూమ్‌లో బంధించి నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..
సాక్షి, రంగారెడ్డి : పుట్టిన రోజు పార్టీలో ఈవెంట్ మేనేజర్ (మహిళ)ను నగ్నంగా నృత్యం చేయాలని వేధించిన నిందితులపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ అశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 202 సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అమీర్ తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. వ్యాపారి అయిన అమీర్ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఇందుకు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా ఈవెంట్ మేనేజర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ మహిళ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో తమకు మహిళా డ్యాన్సర్ కావాలంటూ అమీర్, రాజావలీ, సుల్తాన్ సలీంలు కోరారు. ఇందుకు ఈవెంట్ మెనేజర్ తమ వద్ద నృత్యం చేసే మహిళలు లేరంటూ వెల్లడించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఈవెంట్ మేనేజర్‌ను నువ్వే నగ్నంగా నృత్యం చేయాలంటూ వేధించారు. వినకపోవడంతో రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ ఇంటికి వెళ్లి విషయాన్ని భర్తకు తెలిపింది. భార్యాభర్తలు ఉదయం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్లగా అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. ముగ్గురు యువకుల సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేసి ఉన్నాయి. బర్త్‌డే పార్టీకి ఎవరెవరు వచ్చారన్న విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ అశోకచక్రవర్తి తెలిపారు. -
చీటింగ్ ఆరోపణలపై స్పందించిన సోనాక్షి బృందం
సాక్షి, న్యూఢిల్లీ : ఈవెంట్లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే తాము ఎన్ని సార్లు గుర్తు చేసినా సోనాక్షికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని ఈవెంట్ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఆరోపించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు ప్రచారం చేసుకునేందుకు వారు ప్రస్తుతం మీడియాను వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ఈవెంట్ ముగియగానే సోనాక్షి, ఆమె బృందానికి తిరుగు ప్రయాణం టికెట్లు పంపలేదని సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వాహకులు స్పందించకపోవడంతో సోనాక్షి, ఆమె బృందం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వెనుతిరిగిందని సోనాక్షి ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈవెంట్‌ను మరోసారి నిర్వహించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై పలుసార్లు నిర్వాహకులతో తాము కోరినా వారి నుంచి స్పందల లేదని సోనాక్షి మేనేజ్మెంట్ టీం ఆవేదన వ్యక్తం చేసింది.తమపై దుష్ర్పచారం మానకుంటే సోనాక్షి సహా ఆమె బృందం చట్టపరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది -
హీరోయిన్‌పై చీటింగ్ కేసు
సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో హల్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. బద్రి, నాని లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ భామ చిక్కుల్లో ఇరుక్కుంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న అమీషా, ఆ వేడుకకు హాజరు కాకపోవటంతో ఆమె పై చీటింగ్ కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదబాద్లో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్వాహకుడు పవన్ శర్మ ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసేందుకు అమీషాతో ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా 11 లక్షల రూపాయలు చెల్లించారు. కానీ అమీషా ఆ వేడుకకు హాజరు కాకుండా మరో రెండు లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేస్తున్నారు. 2016లో జరిగిన ఈ సంఘటన కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు పవన్ శర్మ. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అమీషాను కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. హీరోయిన్ అమీషా పటేల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు... మార్చి 12లోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. -
చదువుల తల్లికి ‘సోషల్’ వేధింపులు
కొచ్చి: హానన్ హమీద్ ... ఉన్నట్టుండి ఈ పేరు కేరళలోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేరళలోని త్రిసూరుకి చెందిన డిగ్రీ చదువుతోన్న 19 ఏళ్ళ ఈ అమ్మాయి బతుకుబండిని లాగేందుకు చేపలు అమ్మింది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ట్యూషన్లు చెప్పింది. రేడియో ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంకా చెప్పాలంటే తను బతకడం కోసం, తన తల్లిని బతికించుకోవడం కోసం తనకొచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. తన కాళ్ళపై తాను నిలబడేందుకు హానన్ హమీద్ చేసిన బతుకు పోరాటాన్ని కొనియాడుతూ కేరళ ‘మాతృభూమి’ దిన పత్రిక కథనం ప్రచురించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. పలువురు రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు హానన్‌కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రంగంలోకి పోకిరీలు హానన్ పేరు పత్రికల్లో రావడం సహించలేని కొందరు వ్యక్తులు ఆమెను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్‌లోకి చొరబడి ఆమె ఫొటోలు, ప్రముఖులతో దిగిన సెల్ఫీలూ, డబ్స్మాష్ వీడియోలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్ట్‌లు పెట్టి వ్యక్తిగతంగా దాడికి దిగారు. హానన్ నిజంగా పేదరాలైతే ఆమె వేలికున్న ఉంగరం ఎక్కడిది? అని ఒకరు, ప్రచారం కోసం ఇదంతా చేస్తోందని మరొకరు. ఇలా నానా రకాలుగా ఆమెను వేధించారు. చివరికి తనకు ఎవ్వరి సాయం అక్కర్లేదనీ, తన మానాన తనను వదిలేయాలని హానన్ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అర్థించినా ఈ నీచులు వెనక్కి తగ్గలేదు. హానన్‌కు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ మద్దతు.. ఆకతాయిలు ఓ యువతిని లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రంగా స్పందించారు. ‘కేరళ సొర చేపల్లారా.. హానన్‌పై దాడిచేయడాన్ని ఆపండి. మీ చర్యల పట్ల నేను సిగ్గుపడుతున్నా. చెదిరిన తన జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఆ యువతి పోరాడుతుంటే మీరు మాత్రం రాబందుల్లా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఫేస్బుక్లో మండిపడ్డారు. హానన్‌ను సోషల్‌మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసుల్ని ఆదేశించారు. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్‌తో తాను చేయబోయే సినిమాలో హానన్‌కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపి ప్రకటించారు. ఎంబీబీఎస్ చదవాలన్నదే లక్ష్యం.. ఎర్నాకులం జిల్లా ఇడుక్కి తోడుకోళలోని అల్ అజహర్ కాలేజ్‌లో హనన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఉదయాన్నే చేపల్ని కొనుక్కుని వచ్చి ఫ్రిజ్‌లో దాచడం, కాలేజీకి వెళ్లివచ్చిన వెంటనే వాటిని చంపెక్కరా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మడం ఆమె దినచర్య. ఈ చేపల అమ్మకాలతో వచ్చిన డబ్బులతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పోషిస్తూ హానన్ చదువుకుంటోంది. కేవలం చేపలే కాదు.. యాంకరింగ్, ట్యూషన్లు, రేడియో ప్రోగ్రాములు ఒక్కటేమిటీ వీలైన ప్రతివిభాగంలో హానన్ పనిచేసింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ రాణించింది. ఎప్పటికైనా ఎంబీబీఎస్ చదవడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్న హానన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. చేపలు అమ్ముతున్న హానన్ (ఫైల్). -
ఆమె సంక్షేమమే ధ్యేయం
ఇల్లు, కాలేజీ తప్ప మరో లోకం లేకుండా ఇంటర్ పూర్తయింది. 17ఏళ్లకేపెళ్లయింది. అయితే అందరిలాతన జీవితం వంటింటికే పరిమితంకావొద్దని, తన కాళ్ల మీద తానునిలబడాలని నిర్ణయించుకుంది. భర్త సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. జీవితమంటే తానుబతకడం కాదు... పది మందినిబతికించడంలోనే అసలు అర్థం ఉందని భావించింది. సమాజాన్నిసరికొత్తగా చూడాలనుకుంది. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ‘ఉమన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేసింది. ఆమే నిజాంపేట్‌కు చెందిన లతాచౌదరి. సాక్షి, సిటీబ్యూరో: జీవితంలోస్థిరపడిపోయిన లతాచౌదరి... అంతటితో రిలాక్స్ అయిపోకూడదని అనుకుంది.వివక్షపైపోరాడాలనుకుంది. అందుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో 2004లో ‘ఉమన్ వెల్ఫేర్సర్వీస్ ఆర్గనైజేషన్’ను స్థాపించింది. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి, మహిళా సాధికారత, హక్కులు, సేవ్ ఏ చైల్డ్, డొమెస్టిక్వాయొలెన్స్పై ఈ సంస్థ పనిచేస్తోంది. వాట్సప్ గ్రూప్‌లో అవగాహన.. ‘ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చదివి పెళ్లయ్యాక వంటింటికి పరిమితమవుతున్నారు. ఈ సమయంలో చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారికి వ్యాపార ఆలోచనలున్నా.. పెట్టుబడికి ఇబ్బంది అవుతోంది. ఇంకొంత మందికి డబ్బుంటే... ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి? తెలియడం లేదు. ఇలాంటి వారికోసమే సంస్థ పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. వారికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అదే విధంగా లైంగిక దాడులకు గురైన ఆడపిల్లలకు మనోధైర్యాన్నిస్తూ... సమాజంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్‌లో వలంటరీ డాక్టర్లు, అడ్వొకేట్స్, సైకాలజిస్టులు, సామాజిక కార్యకర్తలు... ఇలా ఎంతో మంది ఉన్నారు. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, లోలోపల కుంగిపోయే వారికి పరిష్కారాలు చూపుతున్నామ’ని చెప్పారు లత. ఉపాధి శిక్షణ... మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యువెలరీ మేకింగ్, బేకింగ్, అల్లికలు, బొమ్మల తయారీ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణిస్తున్నాం. వారిని మోటివేట్ చేసి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా మనోధైర్యాన్నిస్తున్నాం. విభిన్న అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేద గర్భిణీలకు తగిన కౌన్సెలింగ్ ఇస్తూ... ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? తదితర వివరిస్తున్నామ’ని చెప్పారు లతా చౌదరి. -
రంగస్ధలంపై మేము సైతం
సాక్షి, సిటీబ్యూరో : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు నగర మహిళలు అడుగుపెట్టని రంగం అనేది లేనేలేదు.. కొన్ని వృత్తుల్లో మగవాళ్లను తోసిరాజంటూ దూసుకుపోతున్నారు. ఏ ప్రొఫెషన్ అయినా మేము సైతం.. అంటూ మహిళా గొప్పతనాన్ని చాటుతున్నారు. ఒకటా.. రెండా అనేక రంగాల్లో రాణిస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్...ఆమె వెంటే... 15 యేళ్ల నుంచి ఊపందుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళాధిపత్యం సుస్పష్టం. రాష్ట్ర స్థాయిలో పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన రచనోత్సవ్ను నిర్వహిస్తున్న రాఖీకంకారియా ప్రస్తుతం ఈ రంగంలో రాణించాలనుకునే వారి కోసం ఒక అకాడమీని కూడా నెలకొల్పారు. ‘‘ఇరవై ఏళ్ల క్రితం ఈ రంగంలోకి వచ్చాను. అప్పట్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలే ఒకటీ అరా. అప్పుడు విభిన్న రకాల రంగాల సమ్మేళనం లాంటి ఈవెంట్ మేనేజ్మెంట్లో మహిళలా అంటూ అవహేళన చేశారు. అలాంటి పరిస్థితుల్లో స్థిరంగా నిలబడి... ఈవెంట్ మేనేజ్మెంట్ అనే రంగం ఒక పూర్తి స్థాయి పరిశ్రమగా మారే క్రమంలో నేను సైతం పాలు పంచుకున్నాను. ఇప్పుడు ఈ రంగంలో మహిళలే దూసుకుపోతున్నారనేది ఆనందం కలిగించే విషయం’’అంటారు రాఖీ కంకారియా. ‘ఎక్స్పో’జర్...ఫర్ హర్ సిటీలోని స్టార్ హోటల్స్, క్లబ్స్... వంటి చోట్ల దుస్తులు సహా విభిన్న రకాల ఉత్పత్తులు విక్రయించే ఎక్స్‌పోల నిర్వహణలో మహిళలదే పైచేయి. ఈ తరహా ఎక్స్పోలకు కామిని షరాఫ్ ‘ఫ్యాషన్ యాత్ర’తో శ్రీకారం చుడితే... ఆ ట్రెండ్‌ను మరెందరో సిటీ మహిళలు అందిపుచ్చుకున్నారు. శశినెహతా, శిల్పాచౌదరి, నిఖితారెడ్డి... ఇలా పలువురు ఎక్స్‌పోల నిర్వహణలో దూసుకుపోతున్నారు. ‘‘సిటీలో ఎక్స్‌పోలు నిర్వహించాలంటే విభిన్న రంగాలకు చెందిన వ్యాపారాలను, కొనుగోలుదారులను మేళవించాలి. అంటే అటు వ్యాపారుల అవసరాలపై, ఇటు కొనుగోలు దారుల అభిరుచులపై అవగాహన ఉండాలి. షాపింగ్‌లో మగవారి కన్నా చురుకుగా ఉండే ఆడవారే ఈ ఎక్స్‌పోల నిర్వహణకు సరైనవారు’’ అంటారు కామినిష్రాఫ్. ప్రమోటర్... సూపర్ పలు ఈవెంట్లలో, పెద్ద పెద్ద సమావేశాల్లో అతి«థులను పలకరిస్తూ, వారికి అవసరమైన సరంజామాను అందిస్తూ చిరునవ్వుతో సందడి చేస్తారు ప్రమోటర్స్. నగరంలో వేల సంఖ్యలో ప్రమోటర్స్ ఉన్నారు. అయితే ఈ రంగంలో కూడా అమ్మాయిలకే డిమాండ్ ఎక్కువ అని ఈవెంట్ మేనేజర్ రాజ్‌కిషోర్ చెప్పారు. ఒక ఈవెం ట్లో పాల్గొన్నందుకు మగవాళ్లకి ఇచ్చే మొత్తానికి రెట్టింపు.. అంతకన్నా ఎక్కువే యువతులకి చెల్లిస్తున్నారు. ‘‘ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రమోటర్ డ్యూటీ చేశాను. కేవలం నాలుగు రోజుల్లోనే నాకు నెల ఖర్చులకు సరిపడా పాకెట్ మనీ వచ్చే సింది’’అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది కళాశాల విద్యార్ధిని ప్రేక్ష. అదే విధంగా ప్రోగ్రామ్స్‌లో ప్రేక్షకులకు, కార్యక్రమాలకు మధ్య సమన్వయం నెరపే మాస్టర్ ఆఫ్ సెర్మనీ (ఎం.సి) ప్రొఫెషన్‌లోనూ మహిళదే హవా. ‘‘చక్కని ప్రవర్తన, ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తి, సంభాషణా చాతుర్యం, ప్రేమగా స్పందించే తీరు... యాంకర్‌గా, ఎంసీగా అమ్మాయిలను అందలాలకు ఎక్కిస్తున్నాయి. మేగ్జైన్...మేల్‌కు నో ప్లేస్... కొంతకాలం క్రితం దాకా హైదరాబాద్‌లో సిటీ మేగ్జైన్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. దశాబ్దమున్నర క్రితం వావ్ హైదరాబాద్ పేరుతో నగర మహిళ దీప్తిరెడ్డి ప్రారంభించిన మేగ్జైన్ విజయం సాధించంతో... అక్కడి నుంచి సిటీ విశేషాలను అందించే మేగ్జైన్ల పరంపర మొదలైంది. ప్రస్తుతం సిటీ విశేషాలతో ప్రచురితమవుతున్న మేగ్జైన్ల సంఖ్య షుమారు 20కిపైనే..‘‘సామాజిక అవగాహన పెంచుకుంటూ పరిశీలన చేయడంలో ఇప్పుడు మహిళలు ముందున్నారు. అందుకే మేగ్‌జైన్స్ నిర్వహణలో విజయం సాధించగలుగుతున్నారు’’అని అంటున్నారు హైదరాబాద్ పాస్ మేగ్‌జైన్‌ను నిర్వహిస్తున్న శర్వాణీ చౌదరి. ఆర్జే.. జేజే ‘‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’’ అంటూ పలకరింపులు మొదలుపెట్టి ‘‘ఇది చాలా హాట్ గురూ’’ వంటి చమత్కారాలతో శ్రోతలను అలరించే రేడియో జాకీల హవా మొదలై... దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ రంగంలో మగవాళ్లు సైతం ఉన్నప్పటికీ సిటీలో అత్యధిక ఆదాయం ఆర్జించే ఆర్జేల్లో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పాలి. అమ్మాయిల కంఠస్వరం ఆకట్టుకునేలా ఉండడం ఈ విషయంలో వారికి వరంగా మారుతోంది. అందుకే పురుష ఆర్జేలతో పోలిస్తే అనతి కాలంలోనే మహిళా ఆర్జేలు సెలబ్రిటీలుగా మారిపోతూన్నారు. వారధి...ఆమెది... మీడియాకు, ప్రజలకు మధ్య వారధిగా, చెరగని చిరునవ్వుతో ఆకట్టుకునే సంభాషణా చాతుర్యంతో విధులు నిర్వర్తించే పిఆర్వో రంగంలో మహిళల హవా నడుస్తోంది. నగరంలో ఉన్న పీఆర్ ఏజెన్సీలలో అమ్మాయిలే అధిక సంఖ్యలో కనిపిస్తారు. ‘‘సహజంగానే అమ్మాయిల మాట తీరు సున్నితంగా ఉంటుంది. మీడియాతో వ్యవహరించే విధానంలో అత్యంత అవసరమైన మర్యాద, మన్ననలు అందించడంలో యువతులు మరింత ముందుండడమే ఈ రంగంలో మహిళాధిపత్యానికి కారణం’’ అని సిటీకి చెందిన ఎన్రైట్ ఏజెన్సీలో పనిచేసే షీలా చెప్పారు. -
ఆన్లైన్ వేదిక ..కళా వీచిక
మహా నగరంలో వేడుకలు సర్వసాధారణంగా మారాయి. హ్యాపెనింగ్ హైదరాబాద్ రోజురోజుకూ తన ప్రతిష్ట పెంచుకుంటోంది. ఇదే క్రమంలో ఈవెంట్, ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, ఆర్టిస్టులకు మధ్య వారధి రూపుదిద్దుకుంటోంది. నగరానికి చెందిన విభిన్న రంగాల ప్రముఖుల ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా త్వరలోనే ప్రత్యేక వేదిక వెలుగులోకి రానుంది. గూగుల్, యాహూ తరహాలో ఆర్టిస్ట్‌ల కోసం ఇదో ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ అని నిర్వాహకులు దీనిని నిర్వచిస్తున్నారు. నగరానికి చెందిన బిజినెస్ మ్యాన్ తన కూతురు బర్త్‌డే పార్టీ గ్రాండ్‌గా చేయాలనుకున్నారు. ఇందుకు ఓ ఈవెంట్ మేనేజర్‌ను కలిస్తే అన్ని పనులూ అయిపోతాయన్నారు. అయితే సదరు ఈవెంట్ మేనేజర్ ఎవరు? గత అనుభవం ఏమిటి? ఎలా నమ్మాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన మదిలో మెదిలాయి. ఓ యువతి ఈవెంట్ నిర్వహణను వృత్తిగా చేపట్టాలనుకుంది. అయితే ఈవెంట్‌ను రక్తికట్టించే డెకరేటర్లు, డీజేలు, మోడల్స్, డ్యాన్సర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్, ఫొటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ తదితరులంతా ఎక్కడ? వారి సమాచారం ఎవరిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే పనిలో నిమగ్నమయ్యారు నగరానికి చెందిన భిన్న రంగాల ప్రముఖులు. ఈవెంట్ నిర్వహణ, దాని సక్సెస్‌కు అవసరమైన ఎన్నో వృత్తులు, ఎందరో వ్యక్తులు, మరెన్నో సంస్థలు... అన్నింటినీ ఒకే చోటకు చేర్చనున్నారు. ఇందుకు తెలంగాణ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (www.tartists.in) పేరుతో సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలోచన.. ఆచరణ ‘సిటీలో ఈవెంట్స్ బాగా పుంజుకున్నాయి. ఇతర నగరాల నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం సర్వసాధారణంగా మారింది. అలాగే ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నా.. వారికి నగరంలో జరిగే ఈవెంట్లలో చోటు దక్కడం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు షరాన్ ఇనాయహ్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవెంట్ మేనేజర్లు ఒక్క క్లిక్‌తో ఆర్టిస్టులను బుక్ చేసుకునే అవకాశాన్ని తమ వేదిక అందిస్తోందన్నారామె. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని, మోసాలు, వివాదాలు కూడా ఉండబోవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ ఇప్పటికే 150 మంది ఆర్టిస్టులు తమ పేర్లు నమోదుకు సై అన్నారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ బృందం గతంలో మోడల్‌గా, నగరానికి చెందిన తొలి మహిళా డీజేగా వార్తల్లో నిలిచిన షరాన్... ఈ వేదికకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సిటీలో ప్రస్తుతం టాప్ డీజేగా కొనసాగుతున్న డీజే పియూష్ వైస్ ప్రెసిడెంట్‌గా, దేశవ్యాప్త ప్రాచుర్యం పొందిన, నగరానికి చెందిన తొలి కొరియోగ్రాఫర్ ఇమ్రాన్‌ఖాన్ జనరల్ సెక్రటరీగా ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రముఖ నటి జమున కుమార్తె, చిత్రకారిణి స్రవంతి జల్లూరి జాయింట్ సెక్రటరీగా, మేకప్ కళాకారిణి అలియాబేగ్ ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్నారు. సిటీ బ్లాగింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. అటు ఫ్యాషన్ బ్లాగర్‌గా, ఇటు యోగా ట్రైనర్‌గానూ రాణిస్తున్న ఇషా హిందోచా తదితరులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా ఉన్నారు. -
అమరావతి ఆర్భాటం-సీమకు మరో విద్రోహం
ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నంబర్ వన్ కావాలని చంద్రబాబు తరచూ అంటున్నారు. శంకు స్థాపన పని అంతా ఈవెంట్మేనేజ్మెంట్కు ఇచ్చి చేయిస్తున్నామని ప్రభు త్వం ప్రకటించుకుంది. ఇది చాలదని ప్రతి ఊరి నుంచి నీరు, మట్టి తీసుకురావాలని ప్రజలకు పిలుపు ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని భూములన్నీ రాజ దాని కిందికి లాగేసుకుంటే వ్యవసాయం మాటే మిటని? ప్రశ్నిస్తే... చంద్రబాబు దాపరికం లేకుండా రాజధానిలో వ్యాపారం చేసి సంపద పెంచుతాం... అన్నారు. మనం ఉత్పత్తి గురించి మాట్లాడితే వాళ్లు కార్పొరేట్ల వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. అమరావతి ప్రపంచంలోనే నంబర్ వన్ విధ్వం సక నిర్మాణం. దాని చుట్టూ లక్షల ఎకరాల భూదం దా ఉంది. దేశ విదేశాల్లోని కార్పొరేట్లన్నీ రాజధాని చుట్టూ మోహరించాయి. అగ్రకుల సంపన్న వర్గాలు, కార్పొరేట్‌శక్తులు మన రైతుల, ప్రజల రక్తమాంసాలు పీల్చేసుకొని లాభాలు ఎలా పొందవచ్చునో చంద్ర బాబు పథకం తయారు చేసి ఇచ్చాడు. ఆ ప్రకారమే అమరావతి నిర్మాణమవు తుంది. ఇదంతా ఒక ఎత్తయితే రాయలసీమకు మరో సారి జరుగుతున్న విద్రోహం ఇంకో ఎత్తు. రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒప్పందం ఉల్లంఘించడం దగ్గరి నుంచి పదేపదే సీమకు అన్యాయం జరుగు తోంది. అమరావతితో శ్రీబాగ్ తాజాగా వంచనకు గురైంది. దీనికి పట్టిసీమ మంచి ఉదాహరణ. నదుల అనుసంధానమనే భావన సంపన్నుల, కార్పొరేట్ల ప్రయోజనానికి బలైపోయింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో కూడా ఇంతకంటే భారీ అన్యాయం రాయలసీమకు జరగబోతోంది. ఆంధ్రరాష్ట్ర హయాం నుంచి ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ దాకా పాలకులు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అన్ని పథకాలు రాయలసీమకు ద్రోహం చేసినవే. అమరావతిగాని, పోలవరంగాని అలాంటి అన్యాయాలకు పరాకాష్ట. సీమ ప్రాజెక్టులకు చిల్లి గవ్వలు విదిల్చి, కోటానుకోట్లతో అమరావతి నిర్మి స్తున్నారు. పోలవరం నిర్మిస్తున్నారు. రాయలసీమలో నిర్మించాల్సిన రాజధానిని సంపన్న వర్గాల ప్రయో జనం కోసం, కార్పొరేట్ల ధనదాహం, భూదాహం తీర్చడం కోసం అమరావతిలో నిర్మించడం రాయల సీమ ప్రేమికుల కడుపు రగుల్చు తుంది. రాయల సీమలాగే వెనుకబడిన కళింగాంధ్ర ప్రజల అభివృద్ధికి కూడా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకం. సంపన్నుల ప్రయోజనాల కోసం పని చేస్తున్న చంద్ర బాబు విధానాలు కళింగాంధ్ర ప్రజలకు తీరని అన్యా యం చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఉరి తాళ్లకు విద్యార్థులు చచ్చిపోతున్నారు. రాయలసీమ లో ఈ ఖరీఫ్ కరువుతో కనీవినీ ఎరుగని స్థాయిలో జనాలు వలస వెళుతున్నారు. అమరావతికి శంకుస్థాపన అంటే రాయలసీమ ప్రజాప్రయోజనాలను భూస్థాపితం చేయడమే. సీమ ప్రజలను ఘోరంగా వంచించడమే. అందుకే అక్టో బర్ 22 రాయలసీమ విద్రోహ దినం. ఆంధ్రప్రదేశ్‌లో సీమకు చీకటి రోజు. కోస్తా ప్రాంత ప్రజల, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా కాలరాచే కుట్ర, దుర్మార్గం ఇందులో ఉన్నాయి. సంపన్న వర్గాల కోసం, కార్పొరేట్ల దోపిడీ కోసం నిర్మిస్తున్న రాజధాని మనకొద్దని అందరూ ఉద్యమించాలి. ప్రత్యేక హోదా పేరిట వచ్చే రాయితీలు, నిధులు అన్నీ సంపన్న వర్గాల బొక్కసాలకే వెళతాయని ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ప్యాకేజీలు కాదు... ప్రత్యేక రాష్ట్రమే రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఈ స్ఫూర్తితో రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని బహి ష్కరిద్దాం. మీ రాజధానీ మాకొద్దు, మీ రాష్ట్రమూ మాకొద్దు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వా ల్సిందే అని ఉద్యమిద్దాం. (అక్టోబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టరేట్ వద్ద రాజధాని శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళన సందర్భంగా) వ్యాసకర్త కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక, కర్నూలు యూనిట్, 94402 94462 - అరుణ్ -
జూన్ 1 నుంచి కొత్త సేవా పన్ను రేటు అమల్లోకి
న్యూఢిల్లీ: బడ్జెట్లో కొత్తగా 14 శాతం మేర ప్రతిపాదించిన సర్వీస్ ట్యాక్స్ రేటు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఇది విద్యా సుంకం సహా 12.36 శాతంగా ఉంది. తాజా రేటుతో రెస్టారెంట్లలో తినడం, బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. అడ్వర్టైజింగ్, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్టుల సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ మొదలైన వాటన్నింటిపైనా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. -
సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు!
ముంబై: సినిమా పేరుతో మోసం చేసిన మరో ఉదంతం తాజాగా వెలుగు చూసింది. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సినిమా ఇండస్టీలో నిలదొక్కుంటున్న ఓ నటి అత్యాచారానికి గురైన ఘటన ముంబైలో కలకలం రేపింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సుబర్బన్ చార్ కోప్ నిర్వహిస్తున్నఈవెంట్ ప్రోగ్రామ్స్ కు వెళ్లిన క్రమంలో అక్కడికి వచ్చిన ముఫ్దాల్ ఘడియాలి అనే వ్యక్తి నమ్మించి మోసం చేశాడని ఆ నటి తెలిపింది. ముఫ్దాల్ తనను సుబర్బన్ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడని.. త్వరలో ఓ సినిమా తీయబోతున్నట్లు నమ్మబలికి అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. కొన్ని రోజుల క్రితం సినిమాలో ఛాన్స్ లో భాగంగా అతని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. సినిమాకు సంబంధించిన కాంటాక్ట్ పై సంతంకం చేయాల్సి ఉందని చెప్పడంతో తాను అతని ఇంటికి వెళ్లానని.. ఆ క్రమంలోనే ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడని పేర్కొంది. అటు తరువాత తాను సృహ కోల్పోయానని.. చాలా సేపటికి తిరిగి మేల్కోన్న అనంతరం అత్యాచారానికి గురైనట్లు గ్రహించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ ఈవెంట్ మేనేజర్ సుబర్బన్ చార్ కోప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.